![Doors Still Open For Alliance With TMC Says Jairam Ramesh - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/3/jairam-ramesh.jpg.webp?itok=id191BTH)
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించుకున్నప్పటికీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో పొత్తుకు ఇంకా తలుపులు తెరిచి ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది.
పాట్నాలో ప్రతిపక్షాల ర్యాలీకి ముందు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి & కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ఏకపక్షంగా 42 స్థానాలకు (పశ్చిమ బెంగాల్‌లో) పోటీ చేస్తానని ప్రకటించింది, కానీ మాకు సంబంధించినంతవరకు, చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి, వారి కోసం తలుపులు తెరిచి ఉన్నాయని.. ఆఖరి మాట చెప్పేంత ఈ అవకాశం ఉంటుందని అన్నారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రదానం చేసిన వారం రోజుల తర్వాత రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి) NDA కూటమిలో చేరింది. అలీఘర్‌లో యాత్రలో రాహుల్ గాంధీకి లోక్ దళ్ స్వాగతం పలికిందని రమేష్ అన్నారు.
రాహుల్ గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానం (కేరళలోని) నుంచి పోటీ చేస్తారా అనే ప్రశ్నకు జవాబిస్తూ.. ఆ విషయం ప్రస్తుతం చర్చలో ఉందని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment