సాక్షి, బాపట్ల: పార్టీల పొత్తుతో చంద్రబాబు.. ప్రజల బలమే బలంగా మనం తలబడబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్దంకి మేదరమెట్ల సిద్ధం సభ వేదికగా వైఎస్సార్‌సీపీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఆదివారం 15 లక్షల మంది హాజరైన భారీ బహిరంగ సభలో ప్రతిపక్ష టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై సీఎం జగన్ పంచ్‌లు గుప్పించారు.
మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. బాబు అండ్ కో.. వీళ్ల పొత్తుల గురించి కాసేపు మాట్లాతాను. వీళ్లందరి పార్టీలకు సేనాధిపతులే ఉన్నారు తప్ప సైన్యం లేదు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ అటువైపు ఉంది. వాళ్లు వెనుక ప్రజలు లేరు కాబట్టే పొత్తులతో, ఎత్తులతో వస్తున్నారు. నాకు చంద్రబాబులా నటించే పొలిటికల్ స్టార్స్ లేరు. నాకు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు.. అందుకే ఒంటరిగానే పోటీ కెళ్తున్నా. సామాన్య ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు. నన్ను గెలిపించే స్టార్‌క్యాంపెయినర్లు ప్రతీ ఇంటా ఉన్నారు. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. గెలిపించాలని మనం. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగుతున్న యుద్ధం ఇది అని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
ప్యాకేజీ స్టార్ బాబు ఎలా చెబితే అలా..
సంక్షేమ పథకాలు అందిస్తున్నందుకే ప్రజలు ఆశీర‍్వదించడంతోనే మన ఫ్యాన్‌కు పవర్ వస్తోంది. కానీ, చంద్రబాబు సైకిల్‌కు ట్యూబ్ లేదు. చక్రాలు లేవు. తప్పు పట్టిన ఆ సైకిల్‌ను తోక్కడానికి ఆయనకు ఇతరులు కావాలి. అందుకోసమే ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుడ్ని తెచ్చుకున్నారు. ప్యాకేజీ స్టార్ సైకిల్ సీటు అడగడు. ఎందుకు తక్కువ సీట్లు ఇస్తున్నాడని అడగడు. ప్యాకేజీ స్టార్ చంద్రబాబు సైకిల్ దిగమంటే దిగుతాడు.. సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.
చంద్రబాబు ఏపీలో సైకిల్ చక్రం తిరగడం లేదని ఢిల్లీ వెళ్లి దత్తపుత్రుడితో కలిసి మోకరిల్లారు. చంద్రబాబు గుండెల్లో జగన్ రైళ్లు పరిగెత్తకపోయి ఉంటే.. ఇన్ని పొత్తుల కోసం ఎందుకు అగచాట్లు పడతారు. మన నేతలంతా గడపగడపకు వెళ్లి జరిగిన అభివృద్ధి గురించి చెబుతాం. చంద్రబాబు చేసిన మోసాల గురించి వివరిద్దాం. జగన్ మార్క్ రాజకీయాంలో విశ్వసనీయత, విలువలు ఉంటాయి.
2014లో ఇదే మూడు పార్టీలు కూటమిగా వచ్చి.. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం జగన్ ఈ సందర్భంగా సిద్ధం వేదిక సభ నుంచి చదివి వినిపించారు.
అందులో హామీలు అమలు అయ్యాయా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజల్ని దోచుకునేందుకు.. పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబుకి అధికారం కావాలి. నరక లోకానికి నారా లోకానికి ఎవరూ రారు కాబట్టి ఎంటట్రెన్స్‌లో స్వర్గం చూపించి.. లోపల నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబుకు అలవాటు. మరోసారి మోసం చేసేందుకు వాగ్దానాలతో ముందుకు వస్తున్నారు. చంద్రబాబు మేనిఫెస్టోకు.. శకుని పాచికలకు తేడా ఏం ఉంది?. ఈ మధ్య కాలంలో కిచిడీ వాగ్దానాలు కలిపారు చంద్రబాబుని ఉద్దేశించి.. అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment