కెనడియన్ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరనున్న నేపథ్యంలో కీలక మిత్రపక్షం జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ ట్రూడో లిబరల్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది.
ఈ మేరకు న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జగ్మీత్ సింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.. ‘ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ తేలికగా విజయం సాధిస్తుందని చూపుతున్నాయి. అయినప్పటికీ ప్రధాని ట్రూడో దీనిని గ్రహించలేకపోతున్నారు. ట్రూడో ప్రతీసారి కార్పొరేట్ దురాశకు గురవుతున్నారని పదే పదే రుజవవుతోంది. లిబరల్ పార్టీ నేతలను ప్రజలను నిరాశపరిచారు. కెనడియన్లు వారికి మరో అవకాశం ఇవ్వరు.
ఒప్పందం పూర్తయింది. లిబరల్ నేతలు చాలా బలహీనంగా ఉన్నారు, చాలా స్వార్థపరులు. ప్రజల కోసం పోరాడాల్సింది పోయి కన్జర్వేటివ్‌లను, వారి ప్రణాళికలను అడ్డుకునేందుకు కార్పొరేట్ ప్రయోజనాలకు కట్టుబడి పనిచేస్తోంది ఈ ప్రభుత్వం.
ఇక్కడ పెద్ద కంపెనీలు, వాటి సీఈవీలతో ప్రభుత్వం పనిచేస్తుంది.. పేద ప్రజల నుంచి సొమ్మును దోచి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోంది. వారు ప్రజలను నిరాశపరిచారు. కానీ ఇది ప్రజల సమయం. భవిష్యత్తులో పెద్ద యుద్ధం జరగబోతుంది. ఎన్డీపీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు.
అయితే 2025 వరకు ట్రూడోకు తమ మద్దతు ఉంటుందని ఎన్డీపీ ఒప్పందం చేసుకుంది. కానీ వచ్చే ఎన్నికల్లో ట్రూడో పార్టీ ఓడిపోతుందని సర్వేలు చెబుతుండటంతో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 2015 నుంచి కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో కొనసాగుతున్నారు.
న్యూ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు విరమించుకున్నప్పటికీ ట్రూడోకు తక్షణ ప్రమాదం ఏం లేదు. ప్రధాని పదవీవిరమణ చేసి కొత్త ఎన్నికలకు వెళ్లాల్సిన రిస్క్ కూడా లేదు. కానీ ట్రూడో బడ్జెట్‌లను ఆమోదించాలంటే విశ్వాస ఓట్లను తట్టుకుని నిలబడాలంటే హౌస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్‌లోని ఇతర ప్రతిపక్ష శాసనసభ్యుల నుంచి మద్దతు సంపాదించాల్సి ఉంటుంది.
The deal is done.
The Liberals are too weak, too selfish and too beholden to corporate interests to stop the Conservatives and their plans to cut. But the NDP can.
Big corporations and CEOs have had their governments. It's the people's time. pic.twitter.com/BsE9zT0CwF— Jagmeet Singh (@theJagmeetSingh) September 4, 2024
Comments
Please login to add a commentAdd a comment