కాంగ్రెస్ స్పందించకపోవడంతో నిర్ణయం
భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి గానే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరి లోకి దిగాలని సీపీఎం భావిస్తోంది. ఇండియా కూటమిలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించినా, ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. బుధారం జరిగిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.
కాగా ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణ యం తీసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య హైదరాబాద్‌లో విలేకరుల కు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రేవంత్‌రెడ్డి వంద రోజుల పాలన, పార్లమెంటు ఎన్నికలు, పార్టీ వైఖరిపై సమావేశంలో చర్చించామని తెలిపారు.
ఖమ్మం, మహబూబాబాద్, భువనగిరి, నల్లగొండల్లో తమకు బలముందని, భువనగిరి కాకుండా మిగతా మూడింటిలో ఎక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించినా తాము సిద్ధమని ప్రకటించారు. కలిసి పనిచేద్దామని బీఆర్ ఎస్ నుంచి ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.జహంగీర్ భువ నగిరి జిల్లాలో అనేక సమస్యలపై పోరాటాలు చేశా రని చెప్పారు. మూసీ సమస్యను పరిష్కరించాలంటూ పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు.
తమ్మినేనికి బదులు వీరయ్య నిర్ణయాలు
అనారోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బదు లుగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా జహంగీర్ పేరును కూడా వీరయ్యే ప్రకటించారు.
ఇలావుండగా రాష్ట్రంలో పెద్దపల్లి, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక స్థానంలో సీట్ల సర్దుబాటు ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. ఈ విషయాన్ని తాము ఇదివరకే ప్రతిపాదించామని చెప్పారు. బుధవారం జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment