సాక్షి, విజయవాడ: విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అలజడి రేగింది. టీడీపీతో పొత్తులపై జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడేని కార్యకర్తలు నిలదీశారు. ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పకుండా ఎలా పొత్తులు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ప్రధానికి చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న కార్యకర్తలు.. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా సీట్లు ఇస్తారంటూ ప్రశ్నలు గుప్పించారు.
బీజేపీకోసం పనిచేసే వారికే టిక్కెట్లు ఇవ్వాలన్న కార్యకర్తలు.. బీజేపీకి కేటాయించిన సీట్లలో చంద్రబాబు పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల ప్రశ్నలకు వినోద్ ధావడే ఉక్కిరిబిక్కిరి అయారు. ప్రధాని మోదీ చిలకలూరిపేట సభని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వినోద్ ధావడే.. రేపు జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలుస్తానని, అధిష్టానం దృష్టికి కార్యకర్తల మనోభావాలను తీసుకెళ్తానన్నారు.
కాగా, ఏపీ బీజేపీలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాష్ట్రంలో పొత్తులపై స్థానిక బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పురందేశ్వరి తీరుపై ఫైరవుతున్నారు. ఇదే సమయంలో పలువురు సీనియర్ నేతలు హైకమాండ్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది.
మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం
ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం రేగుతోంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి రాసిన లేఖని సీనియర్లు వ్యూహాత్మకంగా లీక్ చేశారు. ఓడే సీట్లనే బీజేపీకి టీడీపీ కేటాయిస్తోందని సీనియర్లు లేఖలో పేర్కొన్నారు. ఆ సీట్లలో టీడీపీ గతంలో గెలవలేదని లేఖలో ప్రస్తావించారు. టీడీపీ నేతలను బీజేపీలోకి పంపి టిక్కెట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సీనియర్లు.. బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే టిక్కెట్లు కేటాయించాలంటున్న సీనియర్లు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోతే పార్టీకే నష్టమంటున్నారు.
ఇదీ చదవండి: ఏపీ బీజేపీలో కొత్త ట్విస్ట్.. చిచ్చుపెట్టిన చంద్రబాబు!
Comments
Please login to add a commentAdd a comment