కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారు. ఇదిలావుంటే మమతా బెనర్జీ, నితీష్ కుమార్‌ల తర్వాత వామపక్షాలు కూడా కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌కు సవాళ్లు పెరుగుతున్నాయి. కేరళలోని రాహుల్ గాంధీ స్థానమైన వయనాడ్‌పై సీపీఐ తన వాదనలు వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఈ సీటును వదులుకునే పరిస్థితి లేదని చెబుతున్నప్పటికీ, సంకీర్ణ రాజకీయాల కారణంగా రాహుల్ ఈ సీటును వదిలిపెట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
సీపీఐ చూపు ఇప్పుడు రాహుల్‌కు చెందిన వయనాడ్ సీటుపై పడింది. వయనాడ్ ఎప్పటి నుంచో లెఫ్ట్ సీటు అని, కాబట్టి రాహుల్ నిజంగా బీజేపీని సవాలు చేయాలనుకుంటే ఉత్తర భారతదేశంలోని ఏదైనా స్థానం నుండి పోటీ చేయాలని సీపీఐ చెబుతోంది. కాగా సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం మాట్లాడుతూ రాహుల్ స్థాయి వ్యక్తులు వాయనాడ్‌ను ఎన్నుకునేందుకు బదులుగా ఉత్తరాదితో పోరాడాలి. ఉత్తరాదిలో బీజేపీతో ప్రధాన పోరు ఉంది. అక్కడ ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌లో కాన్ఫిడెన్స్ లేదని అనిపిస్తున్నదని పేర్కొన్నారు. అయితే రాహుల్‌కి వయనాడ్ సీటు సేఫ్ అనే వాదన వినిపిస్తుంటుంది. 2019లో రాహుల్ వయనాడ్‌లో సీపీఎం అభ్యర్థిని నాలుగు లక్షలకు పైగా ఓట్లతో ఓడించారు. అయితే అమేథీలో ఓడిపోయారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా రాహుల్‌కు మద్దతు నివ్వాలని కాంగ్రెస్ వామపక్షాలను అభ్యర్థిస్తోంది.
సీపీఐ, సీపీఎం తదితర వామపక్షాలు రాహుల్‌కు మద్దతివ్వాలని తాము కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ అన్నారు. కేరళ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలని కేరళ ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని కూడా సురేష్ పేర్కొన్నారు. అయితే వయనాడ్ సీటు విషయంలో రెండు పార్టీలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇండియా కూటమికి చెందిన ఈ రెండు పక్షాలు వయనాడ్ సీటు విషయంలో తమ వాదనలపై గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment