ఆర్టీసీ ప్రయాణికులకు ‌గుడ్‌ న్యూస్‌ | AP And Telangana Have Agreed To Run Bus Services | Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌: కుదిరిన అంతర్‌ రాష్ట్ర ఒప్పందం

Published Mon, Nov 2 2020 4:31 PM | Last Updated on Mon, Nov 2 2020 7:14 PM

AP And Telangana Have Agreed To Run Bus Services - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి పువ్వాడ అజయ్‌ సమక్షంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కి.మీ మేర  బస్సు సర్వీసులను నడపనుంది. తెలంగాణలో ఏపీఎస్‌ఆర్టీసీ 1,60,999 కి.మీ నడపనుంది. కాగా.. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సులను తిప్పనుంది. ఇక ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు 638 బస్సులు నడపనుంది. విజయవాడ రూట్‌లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. కర్నూలు- హైదరాబాద్‌ రూట్‌లలో 213 బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. తక్షణమే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి.


ఎంవోయూలోని ముఖ్యాంశాలు
మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్లు అవగాహన ఒప్పందంపై సంతకం.
అవగాహన ఒప్పందం ప్రకారం, టీఎస్ఆర్టీసీ 826 బస్సులతో ఏపీలో 1,61,258 కిలోమీటర్లు, ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 638 బస్సులతో 1,60,999 కిమీ దూరం బస్సులు నడవనున్నాయి.
విజయవాడ మార్గంలో, టీఎస్ఆర్టీసీ 273 బస్సులతో 52,944 కిలోమీటర్లు నడుస్తుంది. ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణలో 192 బస్సులతో 52,524 కిలోమీటర్లు నడుస్తాయి.
కర్నూలు- హైదరాబాద్‌ మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఎపిలో 213 బస్సులతో 43,456 కిలోమీటర్లు నడుస్తుంది. ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణలో 146 బస్సులతో 43,202 కిలోమీటర్లు నడుస్తుంది. 
వడపల్లి మీదుగా పిడుగురాల్ల/ గుంటూరు మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఏపీలో 57 బస్సులతో 19,044 కిలోమీటర్లు, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 88 బస్సులతో 20,238 కిలోమీటర్లు నడుస్తుంది.
​​​​​​​♦మాచర్ల మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఏపీలో 66 బస్సులతో 14, 158 కిలోమీటర్లు నడపనున్నది. ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణలో 61 బస్సులతో 16,060 కిలోమీటర్లు నడపనున్నది.
​​​​​​​♦నూజివీడు తిరువూర్, భద్రాచలం- విజయవాడ మార్గంలో  టీఎస్ ఆర్టీసీ అదే కిలోమీటర్లు నడిపేందుకు సిద్ధం. అంటే తెలంగాణ, ఏపీలో 48 బస్సులతో 12,453, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 65 బస్సులతో 14,026 కిలోమీటర్లు నడుస్తాయి. 
​​​​​​​♦ఖమ్మం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మార్గంలో తెలంగాణ.. ఏపీలో 35 బస్సులతో 9, 140 కిలోమీటర్లు, ఏపీ తెలంగాణలో 58 బస్సులతో 11,541 కిలోమీటర్లు తిప్పనున్నారు.
​​​​​​​♦హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో టీఎస్ ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 19,004 కిలోమీటర్ల కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ నుంచి ఈ మార్గంలో బస్సులు నడపదు.
​​​​​​​♦సత్తుపల్లి- ఏలూరు (2 మార్గాలు), భద్రాచలం మరియు మిగిలిన మార్గాల్లో కల్లూగుడెం, సత్తుపల్లి, విజయవాడ మార్గం మరియు ఇతర మార్గాల ద్వారా టీఎస్‌ ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 8,159 కిలోమీటర్లు, ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణలో 28 బస్సులతో 3,408 కిలోమీటర్లు బస్సులు నడపనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement