
సాక్షి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పోటీ చేసే బీఆర్‌ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు దాటనివ్వనని ఒకరు ‘మంగమ్మ శపథం’చేస్తున్నారని, అయితే ప్రజలే తమను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వార్థపూరిత, డబ్బు రాజకీయాలు నడవవని, జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలనూ బీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని మంత్రి అన్నారు.
ఆదివారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో అనవసరంగా వైరం పెంచుకున్నవారికి శంకరగిరి మాన్యాలే శరణ్యమని ఎద్దేవా చేశారు. పారీ్టకి కార్యకర్తలే బలం, బలగం అని, త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్‌ఎస్ సత్తా చాటుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి అవగాహన, అభివృద్ధి, సంక్షేమంపై విస్తత ప్రచారం కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం త్వరలోనే అందిస్తామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
చదవండి: దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు
Comments
Please login to add a commentAdd a comment