Assemly elections
-
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు... 13 స్థానాలకు 10 చోట్ల గెలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్
-
Live: తెలంగాణ రిజల్ట్స్...నాన్ స్టాప్ లైవ్ కవరేజ్
-
వచ్చేది హంగ్.. మనదే పవర్!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో హంగ్ తప్పదు.. అయినా అధికారం మనదే’అని బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. ‘బీజేపీ నిర్వహించిన సర్వేలు, అధ్యయనాలను పరిశీలిస్తే ఏ పార్టీకి 60 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని విశ్వసించొద్దు. వాటి ఉచ్చులో పడొద్దు..’అని చెప్పారు. శుక్రవారం ఘట్కేసర్ సమీపంలోని ఓ కాలేజీలో జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల దిశానిర్దేశం చేశారు. మొత్తం 43 మంది అగ్రనేతల సభలు ‘వచ్చే 60 రోజులు టార్గెట్‌గా పెట్టుకొని గట్టిగా కృషి చేయాలి. రాత్రి, పగలు కష్టపడాలి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 43 మంది అగ్రనేతలు, ముఖ్య నాయకుల సభలు నిర్వహిస్తాం. ఎప్పటినుంచో పని చేస్తున్నాం.. టికెట్ ఇవ్వాలి అంటే కుదరదు. 119 స్థానాల కోసం 2 వేల మంది అడుగుతున్నారు. స్థానిక బలం ఆధారంగానే టికెట్ ఇస్తాం. టికెట్లు ఢిల్లీలోనో, హైదరాబాద్‌లోనో డిసైడ్ కావు. నియోజకవర్గాల్లో చేసే పని ఆధారంగా స్థానికంగానే నిర్ణయిస్తాం. ముఖ్యమంత్రి ఎవరు అనేది జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. ఎవరూ నేను ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకోవద్దు. అధికారంలోకి వస్తే అందరికీ పదవులు వస్తాయి..’అని సంతోష్ చెప్పినట్టు తెలిసింది. మనం ఓడిపోలేదు.. బలపడ్డాం ‘మనం సరిగ్గా పనిచేయాలి. మనలో మనం గొడవలు పడొద్దు. ఎవరూ లూజ్ టాక్ చేయవద్దు. అందరూ కలిసి పని చేయండి. మునుగోడులో ఓడిపోయాం అని మీరు అనుకుంటున్నారు. కానీ మనం బలపడ్డాం. 12 వేల ఓట్ల నుండి 90 వేల ఓట్లకు పెరిగాం. జీహెచ్ఎంసీలో నాలుగు సీట్ల నుండి 48 సీట్లు గెలిచాం. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచాం. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఎంఐఎం అవసరం. అందుకోసమే ఆ పార్టీతో అవి అంటకాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తెలంగాణ సీఎంలు ఒకేలా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అక్రమ కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదు..’అని సంతోష్ పేర్కొన్నారు. కాగా పార్లమెంట్ ఉభయ సభలు ‘నారీశక్తి వందన్ బిల్లు’కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర కౌన్సిల్ ఆమోదించింది. దీనితో పాటు రాజకీయ తీర్మానాన్ని, జీ–20 సమావేశాల విజయవంతం, చంద్రయాన్–2 విజయవంతంపై తీర్మానాలు కూడా ఆమోదించారు. బీజేపీకి మద్దతివ్వండి అన్నివర్గాల ప్రజలను దగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి, ప్రజాస్వామ్యయుత పాలన నెలకొల్పేందుకు బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతునివ్వాలని కోరుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. ‘మహమూద్ అలీ హోంమంత్రిగా ఉండటానికి అనర్హుడు. పోలీస్ చెంప పగలగొడతాడా?’అంటూ తీర్మానంలో ప్రశ్నించారు. సమావేశం ప్రారంభానికి ముందు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాలేజీ ప్రాంగణంలో మొక్క నాటారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్‌బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్, నేతలు అరి్వంద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి, సోయం బాపూరావు, పి.మురళీధర్‌రావు, వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకరరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, రవీంద్రనాయక్, ఎవీఎన్ రెడ్డి, చిత్తరంజన్‌దాస్, డా.కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో సీటుకు పోటీ.. ఒకేచోట ఐదుగురు కుస్తీ..!
మెదక్: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ బీజేపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యుడు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి, బోదన్అసెంబ్లీ ఇన్చార్జి నందారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నందు జనార్ధన్్ రెడ్డి, పరిణితి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇలా టికెట్ కోసం ఐదుగురు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధిష్టానం ఎవరికి కేటాయిస్తోందనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీ ఎంపీ విముఖత.. మెదక్ నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ విజయశాంతి పేరు తెరపైకి వచ్చినప్పటికీ మెదక్ రావటానికి సుముఖంగా లేరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. 2018లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిపై పరాజయం పొందారు. దీంతో ఇప్పటి వరకు మెదక్ రాలేరు. అనంతరం ఆమె బీజేపీలో చేరింది. మళ్లీ ఇప్పుడు మెదక్ నుంచి బీజేపీ టికెట్‌పై బరిలో ఉంటారని ప్రచారం జరుగుతున్నా ఆమెకు ఆసక్తి లేదని చెబుతున్నారు. టికెట్ ఆయనకేనని.. కాగా మెదక్ టికెట్ కోసం ఐదుగురు పోటీ పడుతుండగా అందులో విద్యావేత్త, హైకోర్టు న్యాయవ్యాది, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తాళ్లపల్లి రాజశేఖర్వైపు అధిష్టానం మొగ్గు చూపుతునట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. 2013 నుంచి బీజేపీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అంతే కాకుండా ఆయన తన నాయనమ్మ పేరుపై సుశీల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. అనాథ పిల్లలను దత్తత తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి పథకం ద్వారా వారికి బాగోగులు చూస్తున్నారు. అంతే కాకుండా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రత్యేక డిజిటల్ వాహనం ద్వారా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు కేటాయించిన కేంద్ర నిధులను వివరిస్తున్నారు. దీంతో మెదక్ టికెట్ ఆయనకే కేటాయిస్తారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. -
ఖమ్మంలో 10కి 10 స్థానాలు గెలుస్తాం: మంత్రి పువ్వాడ అజయ్
సాక్షి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు దాటనివ్వనని ఒకరు ‘మంగమ్మ శపథం’చేస్తున్నారని, అయితే ప్రజలే తమను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వార్థపూరిత, డబ్బు రాజకీయాలు నడవవని, జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలనూ బీఆర్ఎస్ గెలుచుకుంటుందని మంత్రి అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో అనవసరంగా వైరం పెంచుకున్నవారికి శంకరగిరి మాన్యాలే శరణ్యమని ఎద్దేవా చేశారు. పారీ్టకి కార్యకర్తలే బలం, బలగం అని, త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్ఎస్ సత్తా చాటుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి అవగాహన, అభివృద్ధి, సంక్షేమంపై విస్తత ప్రచారం కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం త్వరలోనే అందిస్తామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు -
Telangana: ఎన్ని‘కళ’ కమలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ‘ఎలక్షన్ మోడ్’లోకి వచ్చింది. వచ్చే 7, 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, దానికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసింది. పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికకు తుదిరూపు ఇచ్చింది. తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టిన బీజేపీ అధినాయకత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో వరుస కార్యక్రమాల నిర్వహణకు సంసిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ మొదలుకుని వరుస కార్యక్రమాలతో వేడెక్కించనుంది. 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలింగ్ బూత్ కమిటీల సభ్యులతో ఎన్నికల సన్నద్ధతపై ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడనున్నారు. రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన/చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు 8న రాష్ట్రానికి రానున్నారు. మే నెలలో కూడా ప్రధాని మరోసారి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా వరంగల్‌లో మెగా టెక్స్టైల్ పార్క్, రైల్వే వ్యాగన్ తయారీ యూనిట్ తదితర పనులకు శంకుస్థాపన చేస్తారని సమాచారం. పలు అంశాలపై ఆందోళన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలప్రచారంతో పాటు.. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయపోవడం, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, తదితర అంశాలపై మండలాలు, నియోజకవర్గాల వారీగా ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 34,902 పోలింగ్ బూత్ కమిటీల నియామకాన్ని ఈ నెల 5వ తేదీలోగా పూర్తి చేయనుంది. 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ పతాకావిష్కరణ నిర్వహించనుంది. అదేరోజు ఉదయం 9 గంటలకు బూత్ కమిటీలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడతారు. 11న పూలే జయంతి, 14న డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అగ్రనేతల ఫుల్ ఫోకస్ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలు దాదాపు ఖరారవగా..కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేయడం, నేతల మధ్య సమన్వయాన్ని మెరుగు పరచడం తదితర అంశాలపై బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ‘మిషన్ తెలంగాణ–90’ (తొంభై సీట్లలో గెలుపు లక్ష్యం) కార్యాచరణ ప్రణాళిక అమలు ఎలా జరుగుతోంది? అన్న దానిపై, అలాగే పోలింగ్ బూత్ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అమిత్‌షా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని గట్టెక్కించే పనిలో నిమగ్నమైన అమిత్‌షా, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఫిబ్రవరిలో ‘స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్’ జరిగిన తీరుపై సవివరమైన నివేదిక సమర్పించాల్సిందిగా రాష్ట్ర పార్టీని నడ్డా ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాల వారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమౌతున్న తీరుపై జిల్లాల అధ్యక్షులతో నేరుగా సమీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం. ‘బూత్ సశక్తికరణ్ అభియాన్’ ఎంతవరకు వచ్చింది? తదితర అంశాలను కూడా సమీక్షించనున్నారని తెలిసింది. 30న 100 సెంటర్లలో మన్ కీ బాత్ ఏప్రిల్ 30న మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వంద సెంటర్లలో నిర్వహిస్తారు. ఇక మే నెలలో కేంద్రం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. మే రెండో వారంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 500 మంది ముఖ్య కార్యకర్తలతో సమ్మేళనాలు ఉంటాయి. మే 15 నుంచి జూన్ 15 వరకు నియోజకవర్గ కేంద్రాల వారీగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ‘సాలుదొర–సెలవు దొర’ పేరిట భేటీలు ఉంటాయి. జూన్ 1 నుంచి ఇంటింటికీ బీజేపీ పేరిట ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తారు. జూలైలో కేంద్రం చేసిన కార్యక్రమాలు ప్రధానంగా ప్రస్తావిస్తూ కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడతారు. ఆగస్టు, సెప్టెంబర్లలో మహిళా, యువ, రైతు వర్గాలతో సమావేశాలు ఉంటాయి. అక్టోబర్, నవంబర్లలో రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తారు. -
ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమే' కీలకం
హిమాచల్ ప్రదేశ్. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. ఆ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లినా రోడ్డుపక్కన టీ కొట్టుల్లో, ఆలయాల వద్ద, ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మహిళలే వ్యాపారాలు చేస్తూ కనిపిస్తారు. ఆర్థిక స్వాతంత్య్రం రాజకీయ చైతన్యం ఇష్టపడే మహిళలు ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అందుకే ప్రధాన పార్టీలన్నీ మహిళా ఓటర్లపై గాలం వేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మహిళా ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించడంలో మహిళలు అత్యంత కీలకంగా మారారు. రాష్ట్ర జనాభాలో 49% మంది మహిళలే ఉన్నారు. 1998 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని విశ్లేషిస్తే పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓట్లు వేశారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 55,92,828 ఉంటే వారిలో పురుష ఓటర్లు 28,54,945, మహిళా ఓటర్లు 27,37,845, థర్డ్ జెండర్ ఓటర్లు 38 ఉన్నాయి. స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తి జాతీయ సగటు కంటే హిమాచల్ ప్రదేశ్‌లో అధికం. ప్రతీ వెయ్యి మంది పురుషులకు జాతీయ స్థాయిలో 976 మంది మహిళలు ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లో 981 మంది ఉన్నారు. 18 నియోజకవర్గాల్లో లింగ నిష్పత్తి వెయ్యి దాటి ఉండడం విశేషం. ’’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దేవేష్ కుమార్ వ్యాఖ్యానించారు. పోటీ పడి హామీలు అధికార బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేక మేనిఫెస్టో స్త్రీ సంకల్ప పత్ర విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పెళ్లయ్యే సమయంలో రూ.51 వేల ఆర్థిక సాయం, ప్రాథమిక విద్య అభ్యసించే బాలికలకు ఉచిత సైకిళ్లు, ఉన్నత విద్య అమ్మాయిలకు స్కూటీలు, మహిళా సాధికారత సాధించడానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, ఆశావర్కర్ల జీతం రూ.4,700కి పెంపు వంటి హామీలు గుప్పించింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం కింద 1.36 లక్షల ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, రాష్ట్రస్థాయిలో గ్రామీణ సువిధ యోజన కింద 3.24 లక్షల గ్యాస్ కనెక్షన్ల పంపిణీతో మహిళలు పొగ ముప్పు నుంచి విముక్తి చెందారని, తొలి స్మోక్ ఫ్రీ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచిందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 18 ఏళ్ల వయసు పైబడిన మహిళలందరికీ హర్ ఘర్ లక్ష్మి నారి సమ్మాన్ నిధి పథకం కింద నెలకి రూ.1500 ఇస్తామని ప్రకటించింది. ‘‘ఉన్నత విద్య అభ్యసించలేని యువతులు కానివ్వండి, సింగిల్ మదర్లు, వితంతువులు ఇలా అవసరం ఉన్న మహిళలందరికీ రూ.1500 బ్యాంకులో పడతాయి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది’’ అని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఆశాకుమారి చెప్పారు. అంతకు ముందే ఆప్ తాము అధికారంలోకి వస్తే నెలకి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాతినిధ్యం ఏది ? మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించే పార్టీలు వారికి టికెట్ ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. 68 స్థానాలున్న అసెంబ్లీలో గత సారి కేవలం నలుగురు మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సారి బీజేపీ ఆరుగురికి టికెట్ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం ముగ్గురుకి మాత్రమే ఇచ్చింది. తొలిసారిగా ఎన్నికల బరిలో నిల్చొన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆరుగురికి టికెట్లు ఇచ్చింది. 1998లో తొలిసారిగా ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎన్నికై రికార్డు నెలకొల్పారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 338 అభ్యర్థులు పోటీ పడితే వారిలో 19 మంది మాత్రమే మహిళలు. వారిలో నలుగురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 6% ఎక్కువగా మహిళల ఓటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో మహిళా అక్షరాస్యత ఎక్కువ. ఓటు ఎంత విలువైనదో వారికి బాగా తెలుసు. సామాజికంగా, రాజకీయంగా, మతపరంగా ఎంతో అవగాహనతో ఉంటారు. అందుకే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలవచ్చి ఓట్లు వేస్తారు. గత 20 ఏళ్లుగా పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6 శాతం అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మందు తాగం.. ఖాదీ వస్త్రాలే ధరిస్తాం’
చండీగఢ్: మరో కొద్ది రోజుల్లో హరియాణ అసెంబ్లీ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీలన్ని అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార కార్యక్రమాల వంటి అంశాల గురించి కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. పార్టీ టికెట్ ఆశించేవారు తప్పకుండా వీటిని పాటించాలని పేర్కన్నది. ఈ మేరకు ‘ఘోష్నా పత్ర’ పేరుతో ఉన్న నియమాల జాబితాను హరియాణా కాంగ్రెస్ చీఫ్ సెల్జా కుమారి ట్వీట్ చేశారు. మంచి వారు, అంకితభావం గల అభ్యర్థులను ఎంపిక చేయడం కోసమే ఈ నియమాలను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావించే వారు మద్యం సేవించమని.. ఖాదీ వస్త్రాలు ధరిస్తామని స్పష్టం చేయాలి. గాంధీమార్గంలో పయనిస్తూ.. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామని హామీ ఇవ్వాలి. అంతేకాక లౌకిక వాదాన్ని విశ్వసిస్తామని.. కుల, మత విద్వేశపూరిత వ్యాఖ్యలు చేయనని ప్రమాణం చేయాలి. అంతేకాక జనరల్ కేటగిరికి చెందిన అభ్యర్థి టికెట్ ఆశిస్తే.. రూ.5000 చెల్లించాలని.. ఎస్సీ అభ్యర్థులైతే రూ. 2వేలు, మహిళా అభ్యర్థులైతే రూ.3000 చెల్లించాలని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల కోసం భారీ ఎత్తున బరిలోకి దిగుతుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ కొత్త వ్యూహాలు రచిస్తోంది. గతంలో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ కేవలం 15 సీట్లకే పరిమితం అయ్యింది. -
‘దీదీ’కే మరోసారి అధికారం?
రాజకీయ చైతన్యానికి మారుపేరుగా మార్మోగిన పశ్చిమ బెంగాల్ 16వ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత పాలకపార్టీ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మరోసారి గెలుస్తుందనే విషయంపై భిన్నాభిప్రాయాలు లేవు. అయినా, ఈ ఎన్నికలపై మీడియాలో, రాజకీయవర్గాల్లో ఆసక్తి తగ్గలేదు. 294 సీట్లున్న ఈ రాష్ట్రంలో కిందటి(2011) ఎన్నికల్లో తృణమూల్‌తో పొత్తుపెట్టుకుని పోటీచేసిన కాంగ్రెస్ దశాబ్దాలుగా రాజకీయ బద్ధశత్రువులుగా ఉన్న కమ్యూనిస్టులతో కలిసి పోటీచేస్తోంది. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అప్పటి నుంచీ ప్రధాన వామపక్షమైన సీపీఎంతో శత్రుత్వమే ఉంది. అలాంటిది కిందటి ఎన్నికల్లో తృణమూల్ నేత మమతా బెనర్జీతో చేతులు కలిపి 34 ఏళ్లు పాలించిన సీపీఎంను కూలదోయడంలో కీలకపాత్ర పోషించింది. ఆ తర్వాత పరిణామాల వల్ల కాంగ్రెస్ తృణమూల్‌కు దూరమైంది. మమత ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక వర్గాల ప్రజలతోపాటు ముస్లింలు తృణమూల్‌కు దగ్గరయ్యారు. సంప్రదాయ ఓటర్లుగా ఉన్న ఈ మైనారిటీలు సీపీఎంకు దూరమయ్యారు. దాదాపు 25 శాతం ముస్లింలు ఉన్న బెంగాల్లో మమత వారి సంక్షేమానికి తీసుకున్న చర్యలు వారిని తృణమూల్‌కు దగ్గరయ్యేలా చేశాయి. ఫలితంగా మతం రంగు పులుముకున్న రాజకీయాలు రాష్ర్టంలో బీజేపీ బలపడడానికి అవకాశమిచ్చాయి. కాంగ్రెస్, సీపీఎం-దాని మిత్రపక్షాలు, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే, తృణమూల్‌కు ప్రధాన ప్రత్యర్థి పక్షంగా బీజేపీయే ఆవిర్భవించవచ్చనే అంచనాతో కాంగ్రెస్, సీపీఎంలు చేతులు కలిపాయి. ఈ కొత్త రాజకీయ సమీకరణతో వామపక్షాలు, కాంగ్రెస్ బాగా దెబ్బతినే ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. అదీగాక బీజేపీ ఎదుగుదలకు బ్రేక్ పడడానికి ఈ పొత్తు ఉపకరిస్తుందని విశ్లేషిస్తున్నారు. రే, బసు, బుద్ధ మినహా అందరు సీఎంలూ అవివాహితులే... బీసీ రాయ్ నుంచి మమత వరకూ బెంగాల్‌కు 8 మంది ముఖ్యమంత్రులుగా పనిచేయగా వారిలో వరుసగా సీఎంలైన ముగ్గురు సిద్ధార్థ శంకర్‌రే(1972-77), జ్యోతి బసు(1977-2000), బుద్ధదేవ్ భట్టాచార్య(2000-2011) మాత్రమే వివాహితులు. మిగిలిన ఐదుగురూ(పీసీ ఘోష్, బీసీ రాయ్, పీసీ సేన్, అజయ్ ముఖర్జీ(1967-69, 1969-70), మమతా బెనర్జీ(2011 నుంచి ఇప్పటి వరకూ) పెళ్లి చేసుకోలేదు. అవివాిహ తులుగా ఉండిపోవడం, ఆలస్యంగా పెళ్లాడడం బెంగాలీ సమాజంలో మామూలే. 34 ఏళ్ల మార్క్సిస్టుల పాలన 1977 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నాయకత్వంలోని వామపక్ష ఫ్రంట్(సీపీఎంకు సొంతగానే మెజారిటీ) సంపూర్ణ మెజారిటీ సాధించింది. సీనియర్ నేత జ్యోతిబసు ముఖ్యమంత్రిగా వరుసగా 1982, 87, 91, 96 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగింది. వరుసగా 23 ఏళ్ల 137 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగి జ్యోతిబసు రికార్డు సృష్టించారు. 2000 నవంబర్‌లో ఆరోగ్యకారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగడంతో ఆయన అనుచరుడు, తర్వాతి తరం నేత 56 ఏళ్ల బుద్ధదేవ్ భట్టాచార్యకు సీఎం పదవి దక్కింది. అన్నివిధాలా బసుకు మంచి వారసునిగా పేరుతెచ్చుకున్న బుద్ధదేవ్ కొద్ది నెలలకే 2001 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కూటమిని విజయపథాన నడిపించారు. మళ్లీ ఐదేళ్ల మంచి పాలన తర్వాత 2006లో సీపీఎంను, లెఫ్ట్ ఫ్రంట్‌ను అంతకు ముందు కనీవినీ ఎరగని రీతిలో గెలిపించి, రికార్డు స్థాయిలో మెజరిటీ సాధించిపెట్టారు. సీపీఎం జ్యోతిబసు హయాంలో జరిగిన ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు(294కు 176 సీట్లు) గెలుచుకుంది. రెండోసారి అన్నీ తప్పిదాలు బుద్ధదేవ్ 2006 భారీ విజయం తర్వాత సింగూరు టాటా-నానో కార్ల ఫ్యాక్టరీకి స్థల సేకరణ, నందిగ్రామ్‌లో ఇండొనీసియా కంపెనీకి భూసేకరణ సందర్భాల్లో ప్రజలపై ప్రభుత్వ దమనకాండకు నాయకత్వం వహించి అప్రతిష్టపాలయ్యారు. ఈ సమయంలో జన ం తరఫున పోరాడుతూ బలపడుతున్న మావోయిస్టుల అణచివేత పేరుతో అటవీ ప్రాతాల్లో ఆదివాసీలపై పోలీసుదాడులు, జులుం పెరిగిపోయాయి. మొదట్నించీ కమ్యూనిస్టులకు సానుభూతిపరులుగా ఉన్న మధ్యతరగతి ప్రజలు (భద్రలోక్) మార్క్సిస్టులకు దూరమయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టుల నుంచి మధ్యతరగతి మేధావులు, పేద ప్రజలు తృణమూల్ బలపడడానికి కారకులయ్యారు. ఫలితంగా 34 సుదీర్ఘ పాలన తర్వాత కమ్యూనిస్టులు, పదేళ్ల ఏలుబడి తర్వాత బుద్ధదేవ్ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూడాల్సివచ్చింది. బుద్ధదేవే తన నియోజకవర్గంలో తృణమూల్ చేతిలో ఓడిపోయారు. అక్రమాలతో, అణచివేతతో జరిగిన 1972 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే జ్యోతిబసు ఓడిపోయారు (అక్రమాలను పసికట్టి పోలింగ్‌కు ముందే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు.). దాదాపు మూడున్నర దశాబ్దాలు సాగిన పాలనలో మార్క్సిస్టుల తప్పిదాలు, ముఖ్యంగా బుద్ధదేవ్ చివరి సంవత్సరాల్లో చేసిన పెద్ద పొరపాట్లు 2011 ఎన్నికల్లో తృణమూల్-కాంగ్రెస్ కూటమికి ఘనవిజయం సాధించిపెట్టాయి. పదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కొనసాగిన బుద్ధదేవ్ సీపీఎం అధికారం కోల్పోవడానికి ప్రధాన ముద్దాయిగా కనిపించారు. జ్యోతిబసు కాలం నుంచీ పాలకపక్షమైన సీపీఎం కార్యకర్తలతో జరిపిన వీధిపోరాటాలతో రాటుదేలిన మమత అంతకు ముందు ఎవరూ ఊహించనిరీతిలో కాంగ్రెస్ వీడి, ప్రాంతీయపార్టీ స్థాపించి మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. తృణమూల్ పాలనలో సీపీఎం ఛాయలు ప్రతిపక్షంలో ఉండగా సీపీఎంనే అనుకరించిన మమత అధికారంలోకి వచ్చాక కూడా లెఫ్ట్ ఫ్రంట్ విధానాలు కొన్నింటిని అనుసరించారు. ప్రధానంగా ప్రతిపక్షాలను అణచివేయడంలో, అధికారాన్ని గరిష్టస్థాయిలో కార్యకర్తలు, నాయకులకు ఉపయోగపడేలా చూడడంలోనూ మార్క్సిస్టుల దారిలోనే మమత ప్రయాణిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే బాహాటంగా వినిపిస్తున్నాయి. పాతికేళ్లకు పైగా మార్క్సిస్టులతో పోరాడిన మమతా బెనర్జీ మనుషులు తాము అధికారపార్టీ అనే విషయం మరచి వీధిపోరాటాలు కొనసాగిస్తున్నారు. అలాగే, 34 ఏళ్లు పాలకపక్షంగా కొనసాగిన సీపీఎం అధికారం కోల్పోయి ఐదేళ్లు దాటినా సమరశీల ప్రతిపక్షపార్టీ పాత్ర పోషించడం ఇంకా నేర్చుకోలేకపోతోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోల్‌కతాలోని సీపీఎం రాష్ర్ట ప్రధాన కార్యాలయం(అలీముద్దీన్ స్ట్రీట్‌లోని ముజఫర్ అహ్మద్ భవన్) వైపు వెళ్లిన మీడియా ప్రతిధులకు నిర్మానుష్యంగా కనిపించింది. ఎన్నికల సమయంలో ఉండాల్సిన కోలాహలం, కార్యకర్తల్లో ఉత్సాహం కరువయ్యాయి. అత్యాచారాలు, అవినీతి, కుంభకోణాలు తృణమూల్ కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో మహిళలపై అత్యాచారాలు, ప్రతిపక్షాలపై హింసాత్మక దాడులు జరిగాయి. సీపీఎం సర్కారు మాదిరిగానే మావోయిస్టులను, వారి నేతలను బూటకపు ఎన్కౌంటర్లలో పోలీసులు చంపివేశారని వార్తలొచ్చాయి. తెలుగు ప్రాంతానికి చెందిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావును అదే పద్ధతిలో బెంగాల్ పోలీసులు కాల్చిచంపారు. శారదా కుంభకోణంలో తృణమూల్ ఎంపీలు, అగ్రనేతలు, మంత్రుల ప్రమేయం ఉందని ఆరోపణలొచ్చాయి. ఇంత జరుగుతున్నా బెంగాల్ ప్రజలు మమతనే మరోసారి ముఖ్యమంత్రిని చేసేలా ఉన్నారని ఎన్నికల సర్వేలు సూచిస్తున్నాయి. వరుసగా ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో మార్క్సిస్టుల నేతృత్వంలోని వామపక్షాలను గద్దెనెక్కించిన బెంగాలీలు మమతకు మరో అవకాశం తప్పక ఇస్తారని 2011 నుంచి జరుగుతున్న ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు నిరూపిస్తున్నాయి. 63 నుంచి 86 ఏళ్ల వరకూ బసుకు సీఎం పదవి రెండుసార్లు ఉపముఖ్యమంత్రిగా బంగ్లా కాంగ్రెస్ నేత అజయ్‌కుమార్ ముఖర్జీ నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాల్లో పనిచేసిన జ్యోతి బసు ఇంగ్లండ్‌లో న్యాయశాస్త్రం చదువుకున్న బారిస్టర్. కులీన కాయస్థ కుటుంబంలో జన్మించిన బసు చివరికి 1977లో 63 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. 86వ ఏట పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. డాక్టర్ సీఎం బీసీ రాయ్ స్వాతంత్య్రం వచ్చాక రెండో ముఖ్యమంత్రిగా 1948లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ నేత డాక్టర్ బిధాన్ చంద్ర(బీసీ)రాయ్ మొత్తం 14 ఏళ్ల 157 రోజులు సీఎంగా 1962 వరకూ కొనసాగారు. ఆ తర్వాత సీఎం పదవి చేపట్టిన ఏ కాంగ్రెస్ నేతా ఇంత కాలం పదవిలో లేరు. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో సీఎం అయిన సిద్ధార్థ శంకర్‌రే(రాయ్) ఐదేళ్లు 1977 ఎన్నికల వరకూ పదవిలో కొనసాగారు. ఆయనే రాష్ట్రంలో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. 1957 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం బీసీ రాయ్ కలకత్తా నగరంలోని బౌబజార్ అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు రోజు మధ్యాహ్నం వరకూ కమ్యూనిస్టు(సీపీఐ)అభ్యర్థి మహ్మద్ ఇస్మాయిల్ కన్నా దాదాపు 200 ఓట్లు వెనకబడి ఉండి, సాయంత్రానికి పుంజుకుని అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించడం సంచలనమైంది. ఫలితం ప్రకటించడానికి ముందు లెక్కింపు కేంద్రంలో కరెంటు పోవడం అనుమానాలకు దారితీసిందని ప్రఖ్యాత ఆర్థికవేత్త, జ్యోతి బసు కేబినెట్లో ఆర్థికమంత్రిగా ఉన్న డా.అశోక్‌మిత్రా ఓ ఆంగ్ల వార పత్రికలో రాసిన వ్యాసంలో వెల్లడించారు. 1984లో జెయింట్ కిల్లర్..2011లో సీఎం పదవి.. మమతా బెనర్జీ కాంగ్రెస్ టికెట్‌పై 1984 డిసెంబర్ ఆఖరులో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్‌లో సీనియర్ సీపీఎం నేత సోమనాథ్ చటర్జీని ఓడించి ‘జెయింట్ కిలర్’ వెలుగులోకి వచ్చారు. అయితే, సీపీఎం నేతలు, కార్యకర్తలతో వీధిపోరాటాలకు దిగుతున్న మమతను ఓడించాలనే దృఢ లక్ష్యంతో 1989 డిసెంబర్ లోక్‌సభ ఎన్నికల్లో అదే జాదవ్‌పూర్ నియోజకవర్గంలో ఆమెపై జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాలినీ భట్టాచార్యను సీపీఎం తరఫున ఎన్నికల బరిలోకి దింపారు. మమతను మాలిని ఓడించారు గాని ఏడాదిన్నరకే లోక్‌సభ రద్దుతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో జాదవ్‌పూర్‌లోనే మమత చేతిలో ఓడిపోయారు. -
‘దేశం’లో గందరగోళం
సాక్షి, కడప: ‘పగలు పలకరింపులు..రాత్రి రాజకీయాలు’ అన్నట్లు.. జిల్లా టీడీపీలో నయా రాజకీయం నడుస్తోంది. కొన్నేళ్లుగా కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ..కేడర్‌ను ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ నేతలను ఎదుర్కొంటూ ‘పార్టీ’ని నిలబెట్టిన నేతలను కాదని చంద్రబాబు కొత్త నేతలను అరువు తెచ్చుకోవడం ఎంత తప్పో ఇప్పుడు తెలిసొస్తోంది. కొత్తనేతల రాకతో ఇన్నాళ్లూ నివురుకప్పిన నిప్పులా ఉన్న పార్టీలోని అసమ్మతి ప్రచారపర్వంలో పైకి లేస్తోంది. టీడీపీ తరఫున బరిలో నిలిచిన నేతలను ఓడించేందుకు టిక్కెట్టు దక్కని నేతలు కంకణం కట్టుకున్నారు. పగలు వారి తరఫున ప్రచారం చేస్తూ...రాత్రి అనుచరులతో మంతనాలు జరిపి ఎలాగైనా మనపార్టీ అభ్యర్థి ఓడిపోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ పరిణామాలు బరిలోని అభ్యర్థులకు గుబులు రేపుతున్నాయి. ఈ క్రమంలో అసమ్మతి, అంతర్గత పోరుతో తమ్ముళ్లు సతమతమవుతుంటే..వైఎస్సార్కాంగ్రెస్పార్టీ శ్రేణులు మాత్రం సమష్టికృషితో ప్రచారంలో ముందుకెళ్తున్నారు. ‘మేడా’ ఆశలు ఆవిరి మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్యను కాదని కాంగ్రెస్‌పార్టీకి ‘చేయి’చ్చి ఇటీవలే సైకిలెక్కిన మేడా మల్లికార్జనరెడ్డికి టిక్కెట్టు కేటాయించారు చంద్రబాబు. దీంతో ‘మేడా’కు మద్దతిచ్చేందుకు మనసొప్పని మోదుగుల పెంచలయ్య’ బ్రహ్మయ్యతో మంతనాలు జరిపారు. మేడా గెలిస్తే..తమ భవిష్యత్ గల్లంతే అని చర్చించుకుని వ్యతిరేకంగా పనిచేద్దామని పెంచలయ్య ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. ‘నువ్వు చెప్పేది నిజమే. అయితే ఇప్పటికే ‘మేడా’తో ఒప్పందం మేరకు మద్దతిస్తానని మాట ఇచ్చా. పైకి అండగా ఉంటూనే లోలోపల వ్యతిరేకంగా పనిచేద్దాం’ అంటూ అంతర్గత చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే పెంచలయ్య మాత్రం బాహాటంగానే తన సామాజికవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి గాజులభాస్కర్కు మద్దతిస్తున్నారు. దీంతో మేడాకు గట్టి దెబ్బ తగిలింది. బ్రహ్మయ్య కూడా ‘మేడా’కు వ్యతిరేకంగా ముఖ్య అనుచరులతో పనిచేయిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వరద’ను ఓడించడమే లక్ష్యంగా.. ప్రొద్దుటూరులో కూడా వరదరాజులరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా లింగారెడ్డితో పాటు ఆయన వర్గీయులు వ్యూహరచన చేస్తున్నారు. పైకి మద్దతిస్తున్నట్లు ప్రకటించి లోలోపల ‘వరద’ను చిత్తుగా ఓడించేందుకు లింగారెడ్డి వర్గం గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా టీడీపీ కేడర్‌ను ‘వరద’ ఎనలేని ఇబ్బందులు పెట్టారు. దీన్ని మరవని టీడీపీ కార్యకర్తలంతా ‘వరద’కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని లింగారెడ్డి వైపు నిలుస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ నుంచి బయటకు వచ్చిన ‘వరద’కు ప్రత్యేక వర్గం పెద్దగా వెంట రాలేదు. ఈ పరిణామాలన్నీ అధిగమించి గెలవడం ‘వరద’కు కత్తిమీద సామే. నియోజకవర్గంలో చురుకైన నేతగా, పేదల మనిషిగా పేరుతెచ్చుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి టీడీపీలోని పరిణామాలన్నీ ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మలుచుకుంటూ ముందడగు వేస్తున్నారు. ఇక్కడ పరిస్థితులే కమలాపురం, రాయచోటిలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి గెలిస్తే తమ ఆధిపత్యం తగ్గుతుందని, పుత్తాను ఓడిస్తే...తర్వాతి ఎన్నికల్లోపు తన కుమారుడు అనిల్‌ను ఫోకస్ చేయొచ్చనే యోచనలో వీరశివారెడ్డి ఉన్నారు. ఈ లక్ష్యంతోనే ఈయన ‘పుత్తా’కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. రాయచోటిలో రమేశ్‌రెడ్డిని ఓడించేందుకు పాలకొండ్రాయుడు కూడా కసితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా టీడీపీలో వారికి వారే శత్రువులుగా మారి పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు పనిచేడం వైఎస్సార్సీపీకి మరింత మేలు జరగనుంది. మైదుకూరులో ఇదే పరిస్థితి మైదుకూరులో 32 ఏళ్లుగా టీడీపీ కోసం పాటుపడుతున్న నేత రెడ్యం వెంకటసుబ్బారెడ్డి. ఇటీవల జరిగిన పరిణామాలతో నియోజకవర్గ ఇన్చార్జ్గా ప్రజలకు ఏమాత్రం పరిచయం లేని, పార్టీకోసం ఎప్పుడూ పాటుపడని పుట్టాసుధాకర్యాదవ్ను నియమించారు. కేవలం డబ్బులేదనే కారణంతో తనను పక్కనపెట్టారనే ఆక్రోశం రెడ్యంలో బలంగా ఉంది. దీంతో ఇతను కూడా బయటికి మద్దతిస్తున్నట్లు కన్పిస్తున్నా లోలోపల మాత్రం ‘పుట్టా’కు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారని మైదుకూరులో కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. టీడీపీలోని గ్రామస్థాయి నేతలు కూడా డబ్బు కోసమే ‘పుట్టా’పై పైపైకి ప్రేమ చూపిస్తున్నారు. సైకిల్ ఎక్కినట్లే ఎక్కి దిగిపోయిన మాజీమంత్రి డీఎల్ అనుచరులు కూడా ‘పుట్టా’ను వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కొన్నేళ్లుగా పెద్దాయన రఘురామిరెడ్డి పాటుపడ్డారని, రాజకీయంగా పెద్దాయనకు ఇదే చివరి మజిలీ అని, కచ్చితంగా ఆయనకు అండగా నిలవాలని డీఎల్ వర్గీయులు నిర్ణయించుకున్నారు. అజాతశత్రువుగా పేరుతె చ్చుకున్న రఘురామిరెడ్డికి ప్రజల నుంచికూడా మంచి మద్దతు లభిస్తోంది. ఈ పరిణామాలతో ‘పుట్టా’ కుదేలవుతున్నారు.