మెదక్: శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మెదక్ బీజేపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పార్టీ టికెట్‌ను ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యుడు హైకోర్టు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి, బోదన్‌అసెంబ్లీ ఇన్‌చార్జి నందారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నందు జనార్ధన్‌్ రెడ్డి, పరిణితి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇలా టికెట్ కోసం ఐదుగురు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధిష్టానం ఎవరికి కేటాయిస్తోందనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మాజీ ఎంపీ విముఖత..
మెదక్ నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ విజయశాంతి పేరు తెరపైకి వచ్చినప్పటికీ మెదక్ రావటానికి సుముఖంగా లేరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. 2018లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిపై పరాజయం పొందారు. దీంతో ఇప్పటి వరకు మెదక్ రాలేరు. అనంతరం ఆమె బీజేపీలో చేరింది. మళ్లీ ఇప్పుడు మెదక్ నుంచి బీజేపీ టికెట్‌పై బరిలో ఉంటారని ప్రచారం జరుగుతున్నా ఆమెకు ఆసక్తి లేదని చెబుతున్నారు.
టికెట్ ఆయనకేనని..
కాగా మెదక్ టికెట్ కోసం ఐదుగురు పోటీ పడుతుండగా అందులో విద్యావేత్త, హైకోర్టు న్యాయవ్యాది, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తాళ్లపల్లి రాజశేఖర్‌వైపు అధిష్టానం మొగ్గు చూపుతునట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. 2013 నుంచి బీజేపీలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అంతే కాకుండా ఆయన తన నాయనమ్మ పేరుపై సుశీల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు.
అనాథ పిల్లలను దత్తత తీసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి పథకం ద్వారా వారికి బాగోగులు చూస్తున్నారు. అంతే కాకుండా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రత్యేక డిజిటల్ వాహనం ద్వారా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు కేటాయించిన కేంద్ర నిధులను వివరిస్తున్నారు. దీంతో మెదక్ టికెట్ ఆయనకే కేటాయిస్తారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment