Minister Puvvada Ajay Kumar Key Comments On Quitting Politics In Khammam Meeting - Sakshi
Sakshi News home page

ఆ రోజే రాజకీయాల నుంచి వైదొలుగుతా: మంత్రి పువ్వాడ కీలక వ్యాఖ్యలు

Published Fri, Jun 16 2023 2:26 PM | Last Updated on Fri, Jun 16 2023 3:26 PM

Minister Puvvada Ajay Kumar Key Comments On Quit Politics Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం: ఖమ్మానికి తన అవసరం తీరిన రోజు మాత్రమే రాజకీయాల నుంచి వైదొలుతానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణంలో ఎర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓరవలేక అనేక మంది అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి అభివృద్ధి చేశామన్నారు.

ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి కారణం మంత్రి కేటీఆర్ అని అన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి పేరు కేటీఆర్‌ అంటూ అజయ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ  పార్టీలు దమ్ముంటే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి రహిత కార్పొరేషన్‌గా నిలిచిందని,  ఐఏఎస్ పరిపాలన వచ్చిన తర్వాతనే ఖమ్మం అభివృద్ధి చెందిందన్నారు.
చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. వారికోసం ‘టీ-9 టికెట్’.. ప్రయోజనాలివే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement