
బస్సు డ్రైవర్ సీట్లో మంత్రి పువ్వాడ
ఇల్లెందు: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా మారారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్ డిపోను మంత్రి ప్రారంభించారు. అనంతరం డ్రైవర్ సీట్లో కూర్చుని బస్సును కాసేపు నడిపారు.
అంతకుముందు జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం ఖమ్మం సభలో రైతుల గురించి మాట్లాడారని, ఆయనకు ఆ అర్హత లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు దేశ రాజధానిలో ఎన్నో రోజులు ఆందోళన చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, అలాంటి వారు రైతుల గురించి మాట్లాడడమా? అని ప్రశ్నించారు. ఆ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment