
మహిళాకూలీలను చూడగానే వారి మనసు వరిపొలం వైపు మళ్లింది... ఎంపీ, ఎమ్మెల్యేలమనే హోదాలను పక్కన పెట్టి సాదాసీదా మనుషులుగా మారిపోయి కూలీలతో కలిసిపోయారు.. బురదపొలంలోకి దిగి వారితోపాటే నాట్లేశారు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ. ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట బాల్యాతండాలో తీజ్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతూ ఇలా ‘సాక్షి’కెమెరాకు చిక్కారు. అలాగే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గన్నుతో ఇలా కనిపించారు. – బయ్యారం, సాక్షి ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
సారె తిప్పారు..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద కుమ్మరి సారెను కర్రతో కొద్దిసేపు తిప్పారు. – సాక్షి ఫొటో గ్రాఫర్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment