హైదరాబాద్: ఖమ్మం నగరాన్ని ఉత్తమ నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియ జరుగుతుందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మంంలో ప్రతీ సంవత్సరం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామన్నారు అజయ్ కుమార్. ‘ఈనెల 16న ఖమ్మంలో కేటీఆర్ పర్యటించనున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ భవనాన్ని కేటీఆర్ ప్రారంబిస్తారు. పది కోట్లతో నిర్మించిన లక్కారం కేబుల్ బ్రిడ్జి ప్రారంబించబోతున్నాం.
స్థంబాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంబోత్సవం చేయబోతున్నాం. మున్నేరు వాగులోకి మురుగు నీరు చేరకుండ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తాం. లక్కారం ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు. గొంగళి పురుగు లాగ ఉన్న ఖమ్మం ను సీతాకోక చిలుక లాగ చేస్తున్నాం.ఖమ్మం లో దాదాపు వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపన లు మంత్రి కేటీఆర్ చేయబోతున్నారు. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసాం. నా నియోజకవర్గంలో రెండు వేల డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ పూర్తయింది’అని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment