సాక్షి, ఖమ్మం: తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హత్యారాజకీయాలు చేస్తున్నాడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ప్రస్తుతం పాదయాత్రలో ఉన్న బండి సంజయ్.. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ సంస్మరణ సభ సందర్భంగా జూమ్ లైవ్ ద్వారా మాట్లాడారు.
సాయి గణేష్ ఆత్మహత్య చాలా బాధాకరమన్న ఆయన.. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ వేధింపుల కారణంగానే గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ‘‘సాయి గణేష్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. అతనిపై 16కేసులు పెట్టీ రౌడీ షీట్ ఒపెన్ చేశారు. బలవన్మరణానికి కారణం అయ్యింది ఈ ప్రభుత్వం. మంత్రి పువ్వాడ అజయ్ చిట్టా అంతా మాకు తెలుసు.
పువ్వాడను విడిచిపెట్టేదే లేదు. సంగతి తేలుస్తాం. ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటాం. సాయి గణేష్ ఘటనపై సీఎం కేసీఆర్ సీబీఐ విచారణకు కోరాలి. ఇప్పటికే ఈ వ్యవహారంపై పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపింది.
Comments
Please login to add a commentAdd a comment