
హిమాయత్‌నగర్: ‘మీతో ఇంపార్టెంట్ మ్యా టర్ ఉంది. మీకు నేను చెప్పాలి, మీరు నాకు ఒక మ్యాటర్ పంపాలి’ అంటూ టీఎస్‌ఆర్టీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జీవన్ ప్రసాద్ కు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నుంచి ఈ నెల 4న మెయిల్ వచ్చింది. మంత్రి నుంచి మెయిల్ రావడమేమిటనుకుని చూసిన సదరు అధికారి ఇదేదో సైబర్ నేరగాడు చేసిన పని కావొచ్చని భావించి అప్రమత్తమయ్యారు. సోమవారం జీవన్ ప్రసాద్ సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(చదవండి: కౌన్సిలర్లకు ‘కరెంటు’షాక్!)