Bandi Sanjay Kumar Comments On TRS Minister Puvvada Ajay Kumar - Sakshi
Sakshi News home page

చరిత్ర తెలుసుకుని మాట్లాడు..!

Jan 8 2021 3:32 PM | Updated on Jan 8 2021 4:34 PM

Bandi Sanjay Fires On Minister Puvvada Ajay Kumar - Sakshi

సాక్షి, ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ విరుచుకుపడ్డారు. చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో కలిసి బండి సంజయ్‌ శుక్రవారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం కార్పొరేషన్‌లో కాషాయ జెండా ఎగరవేసి తీరుతామన్నారు. బీజేపీని విమర్శించడానికి మంత్రికి సిగ్గుండాలంటూ ఆయన మండిపడ్డారు. నాలుగేళ్లలో నాలుగు పార్టీలు మారిన మంత్రి పువ్వాడ.. తమకు నీతులు చెప్పుతారా అంటూ నిప్పులు చెరిగారు. (చదవండి: 'ఎన్ని యాగాలు చేసినా ఆయన పాపాలు పోవు')

‘‘నీ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసు.. అక్రమ భూములను రెగ్యులర్ చేయించుకోవడానికి టీఆర్ఎస్‌లోకి చేరారు. మెడికల్ కాలేజీ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆయన అక్రమాలన్ని బయట పెడతాం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన పాలన పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఎప్పుడు ప్రభుత్వం పడి పోతుందో తెలియదు. వచ్చే రెండేళ్లు కొనసాగడం కష్టమే. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం.. రెండు చోట్ల విజయవంతం అయింది. తర్వాత ఖమ్మం కార్పొరేషన్‌లో వ్యాక్సిన్ ప్రయోగించ బోతున్నాం. తెలంగాణలో మంత్రులందరూ డమ్మిలేనంటూ’’ బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.(చదవండి: 'బండి సంజయ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement