khamam
-
నామినేషన్లకు 2 రోజులే.. ఇంకా సస్పెన్స్‌లో కాంగ్రెస్ పెండింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగుళూరులో సమావేశమయ్యారు. మరో వైపు, కరీంనగర్ అభ్యర్థిగా వెల్చాల రాజేందర్రావు నామినేషన్ వేయగా, పార్టీ ఆదేశించకుండా నామినేషన్ వేయడంపై ఆశావహుడు ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ అభ్యర్థి విషయంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించారని.. లేని పక్షంలో అభ్యర్థిని మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
ఖమ్మంలో విషాదం.. రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు
ఖమ్మం: జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయల్దేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాసరావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. అయితే ఆయన ఆలస్యం చేయలేదు. ప్రయాణికులతో ఉన్న ఆ బస్సును వెంటనే పక్కకు ఆపారు. ఆపై దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గుండెపోటుతోనే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు స్వస్థలం వేంసూరు మండలం రామన్నపాలెంగా తెలుస్తోంది. -
ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్‌లోకి తుమ్మల
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. పాలేరు టికెట్ విషయంలో తుమ్మలకు భరోసా లభించినట్లు సమాచారం. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరనున్నట్లు తెలిసింది. ‘తుమ్మలన్న రా.. కదిలిరా.. జనమంతా ప్రభంజనంలా నీ వెంటే’ అంటూ ఖమ్మం నగరంలో ఫ్లెక్సీ వెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి రావాలని తుమ్మల నాగేశ్వరావును పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తుమ్మల ఇంటికి వెళ్లిన పొంగులేటి తాజా పరిణామాలపై చర్చించారు. తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం ఆసక్తికర పరిణామమే. ఎందుకంటే ఈ ఇద్దరూ బీఆర్ఎస్లోనే ఉన్నా.. ఇంతకాలం మాట్లాడుకోలేదు. అలాంటిది నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. అదీ.. బీఆర్ఎస్ అసంతృప్తి నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఎట్టిపరిస్థితుల్లో ఖమ్మం కంచుకోటను వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బలమైన నేతలను ఒకే గూటికి తెచ్చి.. కలిసి పని చేయడం ద్వారా విజయం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు ఇవాళ తుమ్మలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. చదవండి: ‘జమిలి’తో మరింత జోష్! -
అధికారం ఎవడబ్బ సొత్తు కాదు.. పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘అధికారం ఎవడబ్బ సొత్తు కాదు.. తాను పెట్టే అభ్యర్థులంతా విజయం సాధించి తీరుతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను తప్పు చేయలేదు.. వెనకడుగు వేయను. తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినా విజయం మాదే.’’ అని అన్నారు. ‘‘నాకు, నన్ను నమ్ముకున్న నాయకులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది. ప్రజల అభిమానం పొందలేక ఓడిపొతే అసెంబ్లీ ఎన్నికలలో కొందరు నా వల్లనే ఓడిపోయారని తప్పుడు ఫిర్యాదు చేశారు. అవి నమ్మి .. నాకు సీటు ఇవ్వకుండా నామా నాగేశ్వరరావుకి సీటు ఇచ్చారు. అధికార మదంతో నాతో ఉన్న వారిని ఇబ్బందులు గురి చేశారు’’ అని పొంగులేటి దుయ్యబట్టారు. చదవండి: గవర్నర్ తమిళిసై విషయంలో వెనక్కి తగ్గిన కేసీఆర్ సర్కార్.. -
లేత దొంగ! సార్.. ఇదే మొదటి దొంగతనం!
ఖమ్మం అర్బన్: ఓ సినిమాలో ఆలీ లేత దొంగగా కనిపించి నవ్వించాడు. ఎప్పటికప్పుడు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ దొంగతనం అనుకుని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతుంటాడు. సరిగ్గా ఇదే రీతిన ఖమ్మంలో ఓ యువకుడు చోరీ చేసి పట్టుబడ్డాడు. ఖమ్మం ఖానాపురం సెంటర్లోని తూము మోహన్‌రావు కిరాణం షాపు షట్టర్లను గతనెల 25న పగులగొట్టి సెల్‌ఫోన్, వెండిపట్టీలు, రూ.15 వేలు చోరీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణలో భాగంగా ఖమ్మం మంచికంటి నగర్‌కు చెందిన దేవెళ్ల మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్న అతను చోరీ చేసేందుకు గల కారణాలను వివరించాడు. తల్లిదండ్రులతో ఘర్షణ పడి వేరు కాపురం పెట్టానని, దీంతో అవసరమైన సరుకులు కొనుగోలు చేసేందుకు మొదటిసారి దొంగతనం చేశానని చెప్పాడు. చోరీ చేసిన నగదుతో గ్యాస్ సిలిండర్, వంటపాత్రలు కొనుగోలు చేసి సెల్‌ఫోన్, పట్టీలు ఇంట్లోనే ఉంచినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో ఆయా సరుకులను రికవరీ చేసిన ఖమ్మం అర్బన్ పోలీసులు మహేష్‌ను సోమవారం కోర్టులో హాజరుపరిచారు. (చదవండి: గద్వాలలో ‘డర్టీ పిక్చర్’!) -
టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్..
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామా, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని మొత్తం 28 స్థిరాస్తు లను సోమవారం జప్తు చేసింది. వీటి విలువ రూ.80.65 కోట్లు ఉంటుందని స్పష్టం చేసింది. గత జూలైలోనూ నామాకు, ఆయన కుటుంబానికి సంబంధించి రూ.73.74 కోట్ల విలువ గల 105 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో నుంచి మధుకాన్ గ్రూపు రూ.361.92 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ నిగ్గుతేల్చింది. మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్‌గా, డైరెక్టర్‌గా ఉన్న నామా నాగేశ్వరరావు బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకునే రుణానికి పూచీకత్తుగా కూడా ఉన్నారని ఈడీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధ్వర్యంలోని ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, శ్రీధర్మ శాస్త కన్స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్స్ట్రక్షన్స్, రాగిణి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వరలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అనే ఆరు డొల్ల కంపెనీలకు రూ.75.50 కోట్లు మళ్లించారని ఈడీ గుర్తించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మధుకాన్ ప్రధాన కార్యాలయం, నగరంలోని మరికొన్ని ఆస్తులతో పాటు ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని ఆ సంస్థ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కాంట్రాక్ట్ రద్దు రాంచీ నుంచి జంషెడ్‌పూర్‌ను కలిపే 163 కిలోమీటర్ల నిడివి గల ఎక్స్‌ప్రెస్ వే అయిన నాలుగు లేన్ల ఎన్‌హెచ్ 33కి సంబంధించి కాంట్రాక్టును మధుకాన్ కంపెనీ పొందింది. ఇందుకోసం 15 బ్యాంకుల కన్సార్షియం రూ.1,151 కోట్ల రుణం మంజూరు చేయగా, అందులోంచి రూ.1,029 కోట్లు మధుకాన్ సంస్థ తీసుకుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం పురోగతి లేక, పెద్దఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ గుర్తించింది. దీంతో కన్సార్షి యం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. జార్ఖండ్ హైకోర్టు సైతం సీబీఐని దర్యాప్తు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన సంగతి విదితమే. మనీ లాండరింగ్ కింద ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మధుకాన్ కాంట్రాక్టును జాతీయ రహ దారుల సంస్థ రద్దు చేయడంతోపాటు రూ.73.95 కోట్లను స్వాధీనం చేసుకుంది. చదవండి: యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్ -
బండి సంజయ్ ఖమ్మం పర్యటన పై మంత్రి పువ్వాడ స్పందన
-
'ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం..భయపడాల్సిందేమీ లేదు'
ఖమ్మం : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు వేస్తే డబ్బులు ఇస్తామంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం వైరాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాములు నాయక్..ఓటర్లకు డబ్బులు పంచాలని బహిరంగంగానే నేతలకు సూచించారు. ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నా..'ఓటు వేస్తే డబ్బులు ఇస్తాం' ఇందులో భయపడాల్సిన పనేం లేదని పేర్కొన్నారు. ‘ఓటర్లను ఏ, బీ, సీ, డీ గా విభజించండి. వారిలో ఓటు వేయరనుకునే వాళ్లను, అనుమానం ఉన్నవాళ్లను గుర్తించండి. వారికి డబ్బులు పంపిణీ చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌హల్‌గా మారాయి.డబ్బుతో ఓటర్లను మభ్య పెడుతున్నారంటూ ఎమ్మెల్యే రాములు నాయక్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రేపు (ఆదివారం)ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్ జరగనుంది. చదవండి : (ఎమ్మెల్సీ ఎన్నికలు: ఈ విషయాలు తెలుసా?) (తెలంగాణ అసెంబ్లీ గరంగరం!) -
‘టీఆర్ఎస్పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం’
సాక్షి, ఖమ్మం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్‌తో కలిసి బండి సంజయ్ శుక్రవారం ఖమ్మంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం కార్పొరేషన్లో కాషాయ జెండా ఎగరవేసి తీరుతామన్నారు. బీజేపీని విమర్శించడానికి మంత్రికి సిగ్గుండాలంటూ ఆయన మండిపడ్డారు. నాలుగేళ్లలో నాలుగు పార్టీలు మారిన మంత్రి పువ్వాడ.. తమకు నీతులు చెప్పుతారా అంటూ నిప్పులు చెరిగారు. (చదవండి: 'ఎన్ని యాగాలు చేసినా ఆయన పాపాలు పోవు') ‘‘నీ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసు.. అక్రమ భూములను రెగ్యులర్ చేయించుకోవడానికి టీఆర్ఎస్లోకి చేరారు. మెడికల్ కాలేజీ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆయన అక్రమాలన్ని బయట పెడతాం. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పాలన పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఎప్పుడు ప్రభుత్వం పడి పోతుందో తెలియదు. వచ్చే రెండేళ్లు కొనసాగడం కష్టమే. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం.. రెండు చోట్ల విజయవంతం అయింది. తర్వాత ఖమ్మం కార్పొరేషన్లో వ్యాక్సిన్ ప్రయోగించ బోతున్నాం. తెలంగాణలో మంత్రులందరూ డమ్మిలేనంటూ’’ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.(చదవండి: 'బండి సంజయ్ ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది') -
ఖమ్మంలో కొత్త ‘రాజకీయం’
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం లోక్‌సభ రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అధికార టీఆర్ఎస్లో చోటుచేసుకున్న పరిణామాలకు తోడు లోక్‌సభ ఎన్నికల వేళ మారుతున్న సమీకరణలు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలంతా ఒకే గూటికి చేరుతుండటం, అంద రూ గులాబీ కండువాలు కప్పుకోవడం చర్చనీయాంశమవుతోంది. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు చేరిక ఖమ్మం గులాబీ దండు రాజకీయాన్ని అనూ హ్య మలుపు తిప్పింది. టీడీపీలో ఉన్నన్ని రోజులు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావులు బద్ధవిరోధులుగా పనిచేశారు. రెండు గ్రూపులు నిత్యం కలహాలతో కాలం వెళ్లబుచ్చేవి. కానీ, ఇప్పు డు తుమ్మల, నామా ఒకే ఒరలో ఇమడాల్సిన పరిస్థితి. ఉప్పు, నిప్పులా టీడీపీ రాజకీయాలు చేసిన ఆ ఇద్దరు ఇప్పుడు టీఆర్ఎస్ నీడలో మళ్లీ పనిచేయాల్సి వస్తోంది. ఇక ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ కూడా రాజకీయాల్లో నామాకు ప్రత్యర్థిగానే ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ ఖమ్మం స్థానం నుంచి తలపడగా నామాపై పువ్వాడ గెలు పొందారు. ఇప్పుడు నామా టీఆర్ఎస్లో చేరడం, ఆ చేరిక కార్యక్రమానికి పువ్వాడ కూడా హాజరవడం గమనార్హం. ఖమ్మం రాజకీయాలను పరిశీలిస్తే గతం లో జలగం సోదరులకు, తుమ్మలకు మధ్య రాజకీయ వైరం ఉండేది. జలగం ప్రసాదరావు, వెంకట్రావులు తుమ్మలకు ప్రత్యర్థులుగా వ్యవహరించేవారు. ప్రసాదరావు, వెంకట్రావులతో పాటు తుమ్మల కూడా ఇప్పటికే కారు ప్రయాణంలో రాజకీయాలు చేస్తున్నా రు. ఇక, పువ్వాడ అజయ్‌కుమార్‌పై వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు ప్రత్యర్థులు ఆయన పనిచేస్తున్న పార్టీలోనే చేరారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ అప్పటి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావుపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాతి పరిణామాల్లో తుమ్మల ఎమ్మెల్సీగా ఎన్నికయి మంత్రి పదవి చేపట్టడంతో పాటు పాలేరు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌పై పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు ఇప్పుడు టీఆర్ఎస్లో చేరి ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. తేలని కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం జరుగుతుందేమో అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కూడా ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ టికెట్ కోసం కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు కూడా యత్నిస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన పోట్ల నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. -
చండ్రుగొండ పీహెచ్‌సీకి జాతీయ అవార్డు
సాక్షి, చండ్రుగొండ: చండ్రుగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా పీహెచ్సీలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. తొలుత ఎంపీపీ బాలునాయక్, జెట్పీటీసీ సభ్యులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కేక్‌కట్ చేసి వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రికార్డుల నిర్వహణ, డెలివరీలు, వ్యాక్సిన్స్, పారిశుద్ధ్యం, గర్భిణుల పట్ల సిబ్బంది తీసుకున్న చొరవ ఇలా అనేక కోణాల్లో జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ పరిశీలించన సర్వేలో చండ్రుగొండ పీహెచ్‌సీకి జాతీయస్థాయిలో 86 మార్కులు రావడం విశేషం. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ సీతారాంప్రసాద్, హోమియో డాక్టర్ ప్రవీణకుమార్, డాక్టర్ భవ్య, ఎస్ఐ కడారి ప్రసాద్, ఎంఈఓ ఝంకీలాల్, ఉపసర్పంచ్ బాబురావు, నాయకులు సారేపల్లి శేఖర్, పులి సత్యం, తుమ్మలపల్లి సురేష్, డి.మల్లేష్, పకీర్కుమార్, కిరణ్‌రెడ్డి, బాబ పాల్గొన్నారు. -
భద్రాద్రిలో ‘ముక్కోటి’ అధ్యయనోత్సవాలు
సాక్షి, భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం అయ్యాయి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా శ్రీరామ దివ్య క్షేత్రం రామనామ సంకీర్తనలతో మార్మోగుతోంది. వేడుకల్లో భాగంగా తొలుత పగల్‌పత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మంగళవారం మత్స్యావతారం, 20న కూర్మావతారం, 21వరాహావతారం, 22న నృసింహావతారం, 23న వామన, 24న పరుశురామ, 25న శ్రీరామావతారం, 26న బలరామ, 27న శ్రీ కృష్ణావతారంలో దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నుంచి జనవరి 8 వరకు నిత్య కల్యాణాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రభాకర శ్రీనివాస్, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. జనవరి 13న విశ్వరూప సేవ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించే తెప్పోత్సవానికి హంసవాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. రామాలయాన్ని సోమవారం రాత్రే విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్తర ద్వార దర్శనానికి రూ.1000, రూ.500, రూ.250 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. -
సిండి‘కేటు’ దోపిడీ
మద్యం డాన్ల రహస్య సమావేశం? ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయం మామూళ్ల మత్తులో ఎక్సైజ్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు యథేచ్ఛగా కల్తీ మద్యం.. బెల్ట్‌షాపులు ఖమ్మం క్రైం: మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనలను పక్కనపెట్టి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం సిండికేట్‌కు తలుపులు బార్లా తీస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన ఎక్సైజ్ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇష్టానుసారం ధరలు జిల్లాలో 148 మద్యం దుకాణాలు ఉన్నాయి. మొదట్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు, మూడు నెలలపాటు దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా అమలు చేసింది. అప్పుడు ఎక్సైజ్ సిబ్బందికి పైసా మామూళ్లు ఇవ్వని వ్యాపారులు ఇప్పుడు మామూళ్లతో ముంచెత్తుతున్నారు. ‘మామూళ్లు ఇవ్వండి మీ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోండి’ అని ఎక్సైజ్ అధికారులు ఓపెన్‌గానే అంటున్నట్లు సమాచారం. వేసవికాలం కావడంతో మద్యం ప్రియులు బీర్లను ఎంచుకుంటున్నారు. ఇదే అదనుగా ఒక్కో బీరు బాటిల్‌పై రూ.15 నుంచి రూ.25 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. లిక్కర్ సీసాను రూ.10 నుంచి రూ.15 వరకు అధిక ధరకు అమ్ముతున్నారు. సిండికేట్ల పండగ సిండికేట్లు పండగ చేసుకుంటున్నారు. నిన్నటి వరకు ఎక్సైజ్‌శాఖ డెరైక్టర్‌గా పనిచేసిన అకున్ సబర్వాల్ వేరేశాఖకు బదిలీ కావడంతో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ సిబ్బందికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా మద్యం సిండికేట్‌కు తలుపులు బార్లా తీయాలని కొంతమంది మద్యం డాన్లు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు రహస్య సమావేశం కూడా నిర్వహించారని సమాచారం. ఈ సిండికేట్ అమలుకావడానికి కొంతమంది ఎక్సైజ్ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. యథేచ్ఛగా పర్మిట్ రూమ్‌లు ఇష్టానుసారంగా పర్మిట్ రూమ్‌లు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకే మద్యం దుకాణాలు తెరుస్తున్నారు. రాత్రి 10 గంటలకు మూయాల్సిన షాపులను అర్ధరాత్రి వరకూ కొనసాగిస్తున్నారు. ఖమ్మం త్రీటౌన్ టింబర్ డిపో రోడ్డులోని ఓ మద్యం షాప్ చుట్టూ పర్మిట్ దుకాణాలు ఏర్పాటైనా ఎక్సైజ్ సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇలా ఎన్నో ఉన్నా పట్టించుకునే వారే లేకపోవడం గమనార్హం. కల్తీ విక్రయాలు జిల్లావ్యాప్తంగా 46 బార్లుండగా వాటిలో ఖమ్మంలోనే 42 ఉన్నాయి. మిగిలినవి ఇల్లెందు, కొత్తగూడెంలో ఉన్నాయి. కొన్ని బార్లలో కల్తీ మద్యం విక్రయిస్తూ దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఉదాహరణకు ఓ మద్యంప్రియుడు రూ.1500 బాటిల్ ఆర్డర్ చేస్తే మొదటి పెగ్గు వరకు అనుమానం రాకుండా తెచ్చి ఆ తర్వాత ఆ కాస్ట్లీ మద్యంలో చీప్‌లిక్కర్ కలిపి ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని బార్లలో నాణ్యతలేని తినుబండారాలను అమ్ముతూ మద్యం ప్రియుల ఆరోగ్యాన్నీ పాడు చేస్తున్నట్లు వినికిడి. గల్లీకో బెల్ట్‌షాప్ గల్లీకో బెల్ట్షాప్ను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నా..ఈ బెల్ట్‌షాప్‌ల వల్ల ప్రభుత్వాదాయానికి గండిపడుతున్నా ఎక్సైజ్‌శాఖ పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయా ప్రాంతంలో ఉన్న వైన్‌షాప్‌ల యజమానులే బెల్ట్‌షాపులకు మద్యం పంపిస్తున్నట్లు సమాచారం. ఈ బెల్ట్‌షాపుల నుంచి ఎక్సైజ్ సిబ్బందికి భారీగానే ముడుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.