నామినేషన్లకు 2 రోజులే.. ఇంకా సస్పెన్స్‌లో కాంగ్రెస్‌ పెండింగ్‌ సీట్లు | Suspense On Congress Karimnagar And Secunderabad Lok Sabha Candidates - Sakshi
Sakshi News home page

నామినేషన్లకు 2 రోజులే.. ఇంకా సస్పెన్స్‌లో కాంగ్రెస్‌ పెండింగ్‌ సీట్లు

Published Tue, Apr 23 2024 10:42 AM | Last Updated on Tue, Apr 23 2024 11:05 AM

Suspense On Congress Lok Sabha Candidates For Karimnagar And Secunderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో ఖమ్మం, కరీంనగర్‌, సికింద్రాబాద్‌ అభ్యర్థుల ఎంపిక విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై  భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగుళూరులో సమావేశమయ్యారు.

మరో వైపు, కరీంనగర్‌ అభ్యర్థిగా వెల్చాల రాజేందర్‌రావు నామినేషన్‌ వేయగా, పార్టీ ఆదేశించకుండా నామినేషన్‌ వేయడంపై ఆశావహుడు ప్రవీణ్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్‌ అభ్యర్థి విషయంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానం నాగేందర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేసీ వేణుగోపాల్‌ ఆదేశించారని.. లేని పక్షంలో అభ్యర్థిని మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement