సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం రాజకీయాలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. పాలేరు టికెట్ విషయంలో తుమ్మలకు భరోసా లభించినట్లు సమాచారం. ఈ నెల 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరనున్నట్లు తెలిసింది. ‘తుమ్మలన్న రా.. కదిలిరా.. జనమంతా ప్రభంజనంలా నీ వెంటే’ అంటూ ఖమ్మం నగరంలో ఫ్లెక్సీ వెలిసింది.
ఇప్పటికే కాంగ్రెస్‌లోకి రావాలని తుమ్మల నాగేశ్వరావును పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తుమ్మల ఇంటికి వెళ్లిన పొంగులేటి తాజా పరిణామాలపై చర్చించారు. తుమ్మల ఇంటికి పొంగులేటి వెళ్లడం ఆసక్తికర పరిణామమే.
ఎందుకంటే ఈ ఇద్దరూ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. ఇంతకాలం మాట్లాడుకోలేదు. అలాంటిది నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. అదీ.. బీఆర్‌ఎస్ అసంతృప్తి నేపథ్యంతోనే కావడం గమనార్హం. ఎట్టిపరిస్థితుల్లో ఖమ్మం కంచుకోటను వదులుకోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బలమైన నేతలను ఒకే గూటికి తెచ్చి.. కలిసి పని చేయడం ద్వారా విజయం అందుకోవాలని భావిస్తోంది. మరో వైపు ఇవాళ తుమ్మలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
చదవండి: ‘జమిలి’తో మరింత జోష్!
Comments
Please login to add a commentAdd a comment