బీఆర్ఎస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా అసలు కలిసి రావటంలేదు.. గత మూడు ఎన్నికల్లో కూడ ఒక్క సీటు మాత్రమే గెలుపోందింది. 2014, 2018 ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. ఈసారి కూడ అదే సెంటిమెంట్‌లో భాగంగా ఒక్క సీటు వచ్చిన రివర్స్‌గా అధికారం కోల్పోయింది గులాబీ పార్టీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రక్షాళన అవసరమని సొంత పార్టీ నేతలే నుంచే వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమాయనికి అయిన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి మారుతుందా?
రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లానే అని చెప్పాలి. ప్రతిసారి ఇక్కడి ఫలితాలు గులాబీ పార్టీ అధిష్టానంకు నిరాశ గురిచేస్తున్నాయి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌కు ఒక గుదిబండలాగా మారిందనే చెప్పాలి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లాంటి నేత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తామని శపథం చేసి మరి పది స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో గెలిపించడం బీఆర్ఎస్ పార్టీకి అసలు మింగుడుపడటంలేదు. సవాల్ చేసి మరి మాట నిలబెట్టుకున్నాడన్ వాదన బీఆర్ఏస్ పార్టీలో సైతం వ్యక్తమవుతుంది. ఇలాంటి పరిస్తితి ఉందంటేనే ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది.
గత మూడు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానానికి పరిమితమవుతూ వస్తుంది.. ఏమాత్రం మార్పు రావటంలేదు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఏమ్మేల్యే జలగం వెంకట్రావు గెలుపోందగా.. 2018 ఎన్నికల్లో సైతం అవే ఫలితాలు రిపిట్ అయ్యాయి. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే గెలుపొందారు. అయితే ఈసారి అయిన పరిస్థితి మెరుగుపడుతుందనుకున్న గులాబీ అధిష్టానానికి మళ్లీ దెబ్బ పడింది. అతి కష్టం మీద మళ్లీ ఉమ్మడి జిల్లాలో ఒకే స్థానం గెలుపొందింది.. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు.
అయితే ఏప్పుడు సెంటిమెంట్‌లో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒకే స్థానం వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న వాదన వినబడుతు వచ్చింది. దానిలో భాగంగానే 2014,2018లో ఓకే స్థానం గెలిచిన రాష్ట్రంలో అధికారంలో మాత్రం బీఆర్ఏస్ వచ్చింది. అయితే ఈసారి కూడ ఒకే స్థానం గెలిచిన రివర్స్‌గా బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. దీంతో అటు సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు ఇటు మళ్లీ ఒకే స్థానం గెలిచిందన్న భావన ఏర్పడిందన్న గుసగుసలు సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీని పూర్తిస్తాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు సొంత పార్టీ నేతలు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. భట్టి విక్కమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు బలమైన నేతలు మంత్రులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిల్లో జిల్లాలో బీఆర్ఎస్ బలం పెంచకొవాలంటే ఆషామాషీ వ్యవహరం కాదు.. జిల్లాలో నాయకత్వాన్ని మరింత గ్రౌండ్ లెవల్‌లో పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ ఖమ్మంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని జిల్లాలోని బీఆర్‌ఎస్ నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. ఇలానే వదిలిస్తే జిల్లాలో పార్టీ మరింత వీక్ అయ్యే పరిస్థితి ఉంది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌కు అసలు కలిసిరావటంలేదనే చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల సమయానికి అయిన గాడినపడుతుందో చూడాలి
ఇదీ చదవండి: భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు.. గంగుల
Comments
Please login to add a commentAdd a comment