సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించేందుకు వీలుగా రెండు తెలుగు రాష్ట్రా ల అధికారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌తో అంతర్రాష్ట్ర బస్సులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి పునరుద్ధరించాలని రెండు వైపుల నుం చి ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రెండు రా ష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర సర్వీసుల సం ఖ్య, ఆయా బస్సులు తిరిగే కిలోమీటర్ల సం ఖ్యలో వ్యత్యాసం ఉండటంతో తెలంగాణ ఆర్టీసీ నష్టపోతోంది. ఈ నేపథ్యంలో ఆ సం ఖ్యను సమం చేస్తూ ఒప్పందం కుదుర్చుకు న్నాకే బస్సులు తిప్పాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఆ సంఖ్యను తేల్చేందు కు వారంలో సమావేశం కావాలని ఆదివారం నిర్ణయించగా, సోమవారమే భేటీ అవుదా మంటూ ఏపీ అధికారులు ఆదివారం రాత్రి పొద్దుపోయాక∙ప్రతిపాదించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశమై చర్చించారు. తెలంగాణ ప్రాం తంలో ఎక్కువ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు, ఎ క్కువ కి.మీ. తిప్పుతుండటంతో తమకు న ష్టం వస్తోందని, కాబట్టి ఇకపై ఆ సంఖ్య స మంగా ఉండేలా బస్సుల సంఖ్యను, అవి తెలంగాణ భూభాగంలో తిరిగే కి.మీ.ను తగ్గించాలని తెలంగాణ అధికారులు ఏపీ అధికారులకు ప్రతిపాదించారు.
తగ్గించాల్సిందే: మంత్రి పువ్వాడ
ఈ భేటీకి ముందు తెలంగాణ అధికారులు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను సంప్రదించారు. తెలంగాణ నుంచి ఏపీ కి 746 బస్సులు తిరుగుతుండగా, ఏపీ నుం చి తెలంగాణకు 1,006 బస్సులు (లాక్‌డౌన్‌కు పూర్వం) వస్తున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. తెలంగాణ బస్సు లు ఏపీలో 1,52,344 కి.మీ. తిరుగుతుంటే, ఏపీ బస్సులు తెలంగాణలో 2,64,275 కి. మీ. తిరుగుతున్నాయని చెప్పారు. దీంతో ఏపీ కూడా తెలంగాణ బస్సులు తిరుగుతు న్న పరిమాణంలోనే బస్సులను, అంతే సంఖ్యలో కి.మీ. మేర బస్సులు తిప్పాలని ప్రతిపాదించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ మేరకే ఏపీ అధికారు లకు ప్రతిపాదించారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి..: తెలంగాణ అధికారుల ప్రతిపాదనను పరిశీలించిన ఏపీ అధికారులు.. తాము బస్సుల సంఖ్యను తగ్గించటం కంటే, తెలంగాణ ఆర్టీసీ అంతమేర బ స్సుల సంఖ్యను పెంచుకుంటే సరిపోతుంద ని తెలిపారు. అయితే దీనికి తెలంగాణ అధికారులు సమ్మతించలేదు. అయితే, దీనిపై త మ స్థాయిలో సమాధానం చెప్పలేమని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, చర్చించి వివరాలను నాలుగైదు రోజుల్లో చెబుతామని ఏపీ అధికారులు చెప్పారు. దీంతో సమావేశం ముగిసింది. మరో వారంలో తదుపరి సమావేశం ఉండే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఈ భేటీలో టీఎస్‌ఆర్టీసీ ఈడీలు యాదగిరి, వినోద్‌కుమార్, సీటీఎం మునిశేఖర్, ఖమ్మం రీజినల్ మేనేజర్ మూర్తి, డీవీఎం సరిరామ్, ఏపీఎస్ ఆర్టీసీ నుంచి ఈడీలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్, సీటీఎం చిట్టిబాబు, విజయవాడ ఆర్‌ఎం నాగేంద్రప్రసాద్, డిప్యూటీ సీటీఎంలు నాథ్, సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment