ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో భారత్ మూడో రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు గెలుచుకుంది
అష్గబాత్ (తుర్క్‌మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో భారత్ మూడో రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు గెలుచుకుంది. మహిళల పెంటాథ్లాన్ ఈవెంట్‌లో పూర్ణిమా హెంబ్రామ్ బంగారు పతకం నెగ్గింది.
ఐదు ఈవెంట్ల ఈ పోటీలో ఆమె 4,062 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల షాట్‌పుట్‌లో తేజిందర్ పాల్ సింగ్, మహిళల 3000 మీ. పరుగులో సంజీవని జాదవ్ చెరో రజతం గెలిచారు. మహిళల లాంగ్ జంప్‌లో నీనా వారకిల్ కాంస్యం నెగ్గింది.