
జీవిత లక్ష్యం నెరవేర్చుకున్నాడు
బీజింగ్: మార్షల్ ఆర్ట్స్ ప్రముఖ హీరో జాకీ చాన్ కొత్తగా యాక్టింగ్ స్కూల్(ఫిల్మ్ అండ్ టెలివిజన్)ను ప్రారంభించాడు. ఈ విషయాన్ని సినా అనే వెబ్ పోర్టల్ తెలిపింది. ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో కూడా ఇదే విషయాన్ని తెలిపారు. వుహాన్ అనే నగరంలో ఈ స్కూల్ను అంగరంగ వైభవంగా ప్రారంభించినట్లు తెలిసింది.
తన జీవిత కాలంలో యాక్టింగ్ స్కూల్ను స్థాపించడంలో ఒక భారీ లక్ష్యమని, దానిని ఆయన నెరవేర్చుకున్నారని మీడియా సంస్థ తెలిపింది. చైనాలోని ప్రముఖ నటులందరితో కలిసి ఆయన స్కూల్ ప్రారంభకార్యక్రమానికి విచ్చేరని ప్రముఖ దర్శకుడు జియాగాంగ్, నటుడు లిబింగ్ బింగ్ కూడా హాజరయ్యారు. ఈ స్కూల్ లో నటన, యానిమేషన్, డిజిటల్ మీడియా పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తారు.