సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎంఎంఏఎఫ్) ఆధ్వర్యంలో జరుగనున్న ఇంటర్నేషనల్ హెల్త్ స్పోర్ట్స్, ఫిట్‌నెస్ ఫెస్టివల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్టును బుధవారం ప్రకటించారు. ఈ జట్టులో తెలంగాణ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ (టీఎంఎంఏఎఫ్)కు చెందిన ఏడుగురు క్రీడాకారులకు చోటు దక్కింది.
ఫుర్కాన్ జునైదీ (57–61), రిషిరాజ్ (61–66), మీర్జా అస్లామ్ బేగ్ (57–61), మహేశ్ (74–44), సలేహ్ అల్ సాదీ (52–54), అవైజ్ ఖాన్ (52–54), సౌద్ అల్ ఖులాఖీ (66–70) రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టుకు మేనేజర్‌గా సయ్యద్ జలాలుద్దీన్ జఫర్ వ్యవహరించనున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చాంపియన్‌షిప్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment