పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హిందీ వెర్షన్‌కు కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ కోసం విజయ్ థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. అయితే విజయ్ థాయ్‌లాండ్ ఎందుకోసం వెళ్లాడనేదానిపై నిర్మాత ఛార్మి స్పష్టత ఇచ్చారు. అక్కడ విజయ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు ఛార్మి తెలిపారు.
మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ చిత్రంలో విజయ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం విజయ్ చాలా కఠోర సాధన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజయ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణకు సంబంధించి ఛార్మి.. ఓ వీడియో కూడా విడుదల చేశారు. అందులో విజయ్‌కు శిక్షణ ఇస్తున్న ట్రైనర్‌ను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ట్రైనర్ మాట్లాడుతూ.. విజయ్ రోజుకు ఆరు గంటల పాటు సాధన చేస్తున్నట్టు తెలిపాడు. అలాగే ట్రైనింగ్ ఎలా సాగుతుందో వివరించాడు. అంతేకాకుండా జనవరి 20న ముంబైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్టు ఛార్మి వెల్లడించారు. మరోవైపు విజయ్ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకులు మందుకు రానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో.. విజయ్ సరసన ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఎజిబెల్లా, రాశీ ఖన్నా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment