యూఎఫ్‌సీలో విజయం సాధించిన తొలి భారతీయ ఫైటర్‌గా రికార్డు
కెంటకీ: భారత్‌కు చెందిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి పూజా తోమర్ చరిత్ర లిఖించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్íÙప్ (యూఎఫ్‌సీ)లో విజయం అందుకున్న తొలి భారతీయ ఫైటర్‌గా రికార్డు నెలకొల్పింది. లూయిస్‌విలెలో జరిగిన ఈ పోటీల్లో పూజ 52 కేజీల స్ట్రా–వెయిట్ కేటగిరీలో 30–27, 27–30, 29–28తో బ్రెజిల్‌కు చెందిన రేయాన్నెపై గెలిచింది.
గట్టి పోటీ ఉండే యూఎఫ్‌సీలో ఇప్పటివరకు మన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులెవరూ కనీసం ఒకసారి కూడా నెగ్గలేకపోయారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల పూజ గతేడాది యూఎఫ్‌సీతో కాంట్రాక్టు కుదుర్చుకోవడంతోనే అతిపెద్ద మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్‌లో పోటీపడే అవకాశం పొందిన తొలి భారత మహిళగా ఘనత వహించింది. గతంలో పురుషుల విభాగంలో భారత్‌కు చెందిన అన్షుల్ జూబ్లీ, భరత్ ప్రపంచ స్థాయి యూఎఫ్‌సీలో పోటీ పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment