భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అత్యాచారాలను నిరోధించేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష విధించాలనే బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గురువారం మరో కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే యువతులకు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా నేర్పించాలని ఆయన స్పస్టం చేశారు. కరాటే వంటి విద్యలు నేర్చుకుంటే అత్యాచారాలు, ఇతర ప్రమాదాలనుంచి నుంచి యువతులు తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
అత్యాచారాలకు సంబంధించి కీలక బిల్లును ఆమోదించింనందుకు కృతజ్ఞతగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మహిళలు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైంగిక దాడులు, వేధింపులకు సంబంధించి చట్టపరమైన రక్షణల గురించి ప్రకటనలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా అందరికీ తెలియజేయాలని కోరారు. మైనర్లపై అత్యాచారం చేసిన వ్యక్తులు జీవించేందుకు అర్హత లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment