
ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేను!
ప్రియాంకా చోప్రా ఇంజినీర్ లేక క్రిమినల్ సైకాలజిస్ట్ అవ్వాలనుకున్నారు.
బాలీవుడ్ హీరోయిన్స్‌లో ప్రియాంకా చోప్రా సమ్‌థింగ్ స్పెషల్. ఎప్పుడూ కూల్ అండ్ కామ్‌గోయింగ్‌గా కనిపించే ఈ వర్క్‌హాలిక్ గురించి ఆసక్తికరమైన పది విషయాలు...
ప్రియాంకా చోప్రా ఇంజినీర్ లేక క్రిమినల్ సైకాలజిస్ట్ అవ్వాలనుకున్నారు. అయితే, ఈ రెండూ కాకుండా మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సినిమాల్లోకి రావడం, పెద్ద స్టార్ అయిపోవడం తెలిసిందే.కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. అలాగే, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్, కథక్ కూడా నేర్చుకున్నారు. ప్రియాంక చోప్రా తండ్రి ఆర్మీలో పని చేసేవారు. ఆయనకు పాడడమంటే ఇష్టం. తండ్రి ప్రోత్సాహంతోనే ప్రియాంక పాటలు పాడడం నేర్చుకున్నారు.ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ప్రియాంకను ముద్దుగా ‘సన్‌షైన్’ అని, ‘మిమీ’ అని పిలుస్తారు. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ‘పిగ్గీ చాప్స్’, ‘పీసీ’ అని పిలుస్తుంటారు. అభిషేక్ బచ్చన్ అయితే ఆమెను ‘బ్లఫ్ మాస్టర్’ అని సరదాగా పిలుస్తారు.
చిన్నప్పుడు ప్రియాంక ఆస్త్మా వ్యాధితో చాలా బాధపడేవారట. ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేనని పెద్దయ్యాక పలు సందర్భాల్లో ప్రియాంక పేర్కొన్నారు.జంక్ ఫుడ్స్‌లో ప్రియాంకకు పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. అలాగే, చాక్లెట్స్ అంటే చాలా ప్రీతి. బయటికెళ్లేప్పుడు బ్యాగులో అవి ఉండేలా చూసుకుంటారు.అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహించిన ‘హమ్‌రాజ్’ చిత్రం ద్వారా ప్రియాంక హిందీ రంగప్రవేశం చేయాల్సింది. కానీ, ‘కహో నా ప్యార్ హై’ విజయంతో బోల్డంత క్రేజ్ తెచ్చుకున్న అమీషా పటేల్ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నారు. ఆ తర్వాత ‘ది హీరో’ చిత్రం ద్వారా ఆమె కథానాయిక అయ్యారు. అంతకు ముందే ‘తమిళన్’ అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమయ్యారామె.
మూగజీవాలంటే ప్రియాంకకు ఎంతో మమకారం. అందుకే, రాంచీలోని బిర్సా బయాలజికల్ పార్క్‌లోని సుందరి అనే సింహాన్నీ, దుర్గ అనే పులినీ దత్తత తీసుకున్నారామె. వాటి ఆహారం, ఆరోగ్యం ఇత్యాది ఖర్చులన్నీ ప్రియాంకే భరిస్తారు.ఫొటోగ్రఫీ అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఎప్పుడో ముచ్చటపడి నికాన్-డి90 కెమేరా కొనుక్కున్నారు. అవుట్‌డోర్ షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు కంటికి నచ్చిన ప్రతి దృశ్యాన్నీ తన కెమేరాలో బంధిస్తారామె. తాత, అమ్మమ్మ, నాయనమ్మ... ఇలా నాటి తరం నుంచి నేటి తరంలో తన కుటుంబానికి చెందిన అందరి ఫొటోలనూ భద్రంగా దాచుకోవడం ప్రియాంక అలవాటు.
‘వక్త్: ది రేస్ ఎగైన్ట్స్ టైమ్’ సినిమా కోసం ‘డూ మీ ఎ ఫేవర్... లెటజ్ ప్లే హోలీ..’ అనే పాట కోసం డ్యాన్స్ చేస్తున్నప్పుడు పొరపాటున ప్రియాంక కరెంటు తీగ మీద కాలేశారు. షాక్ కొట్టడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ఆ రోజంతా ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆ షాక్‌ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె చెబుతుంటారు. ఇటలీలోని ‘సాల్వటోర్ ఫైమో మ్యూజియమ్’లో ప్రియాంక ముద్రలు ఉన్నాయి. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి ప్రియాంకే కావడం విశేషం. హాలీవుడ్ తారలు మార్లిన్ మన్రో, డ్రూ బ్యారీమోర్ తదితరుల పాదముద్రలు ఆ మ్యూజియమ్‌లో ఉన్నాయి. ఇలా పాదముద్రలు భద్రపరిచిన ప్రముఖులకు ఆ మ్యూజియమ్‌వారు ప్రత్యేకంగా పాదరక్షలు తయారు చేసి ఇస్తారు. అది లిమిటెడ్ ఎడిషన్. ఆ పాదరక్షలను పోలినవి ప్రపంచంలో ఎక్కడా ఉండవు.