చేరుపల్లి వివేక్ తేజకు సింగపూర్లో సత్కారం | telangana cultural society singapore Honors Cherupalli vivek | Sakshi

చేరుపల్లి వివేక్ తేజకు సింగపూర్లో సత్కారం

Aug 7 2017 10:53 PM | Updated on Sep 17 2017 5:16 PM

చేరుపల్లి వివేక్ తేజకు సింగపూర్లో సత్కారం

చేరుపల్లి వివేక్ తేజకు సింగపూర్లో సత్కారం

నల్గొండకు చెందిన ప్రపంచ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ చేరపల్లి వివేక్‌ తేజను తెలంగాణ కల్చరల్‌ సొసైటీ సింగపూర్‌(టీసీఎస్‌ఎస్‌) కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

నల్గొండకు చెందిన ప్రపంచ మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌ చేరపల్లి వివేక్‌ తేజను తెలంగాణ కల్చరల్‌ సొసైటీ సింగపూర్‌(టీసీఎస్‌ఎస్‌) కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. వివేక్‌ తేజ మార్షల్‌ ఆర్ట్స్‌లో ఇప్పటి వరకు 27 బంగారు, 18 రజిత, 16 కాంస్య పతాకాలు గెలుపొందారు. ప్రపంచ స్థాయిలో ఇంకా రాణించి భారతదేశం పేరు మారు మ్రోగించాలని టీసీఎస్‌ఎస్‌ సభ్యులు ఆకాంక్షించారు. ఈ నెల 12న ఇండో నేషియాలో జరగబోయే మార్షల్‌ ఆర్ట్స్‌లో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంగా అక్కడ విజయ కేతనం ఎగురవేసి తెలంగాణ కీర్తిని చాటాలని ఆకాక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెద్ది శేఖర్‌ రెడ్డి, బూర్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌ రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శి ఎల్లా రామ్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చిల్క సురేశ్‌, గార్లపాటి లక్ష్మారెడ్డి, శివ రామ్‌, చెట్టి పల్లి మహేష్‌, ఆర్‌.సి.రెడ్డి, దామోదర్‌ ఇతర సభ్యులు గొనె నరేందర్‌, అనుపురం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement