రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపిక
రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపిక
Published Thu, Oct 13 2016 7:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
గుంటూరు స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు భాష్యం విద్యార్థులు ఎంపికయ్యారని భాష్యం విద్యాసంస్థల సీఈఓ భాష్యం హనుమంతరావు తెలిపారు. స్థానిక చంద్రమౌళి నగర్‌లోని భాష్యం మెయిన్ క్యాంపస్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఈనెల 2వ తేదీన జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో జరిగిన రైఫిల్ షూటింగ్ పోటీలలో తమ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. అండర్–19 విభాగంలో వై.శ్రీనిత్య (సీనియర్ బైపిసీ), ఎం.రిషిత (సీనియర్ ఎంపీసీ), వి.హర్షవర్ధన్ రెడ్డి(జూనియర్ బైపీసీ), ఎన్.వెంకట వరుణ్ సాయి(సీనియర్ ఎంపీసీ) ఎంపికైనట్టు తెలిపారు. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ప్రొద్దుటూరులో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొంటారని చెప్పారు.
Advertisement
Advertisement