ముగిసిన రైఫిల్‌ షూటింగ్‌ | rifle shooting complete | Sakshi
Sakshi News home page

ముగిసిన రైఫిల్‌ షూటింగ్‌

Published Sun, Aug 21 2016 10:07 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM

ముగిసిన రైఫిల్‌ షూటింగ్‌ - Sakshi

ముగిసిన రైఫిల్‌ షూటింగ్‌

  • నేటితో ఎన్‌సీసీ శిక్షణ శిబిరం పూర్తి
  • తుని రూరల్‌ : 
    సంయుక్త వార్షిక ఎన్‌సీసీ శిక్షణ శిబిరం సోమవారంతో ముగుస్తుందని 18వ ఆంధ్రా బెటాలియన్‌ కమాండెంట్‌ కల్నల్‌ మోనీష్‌గౌర్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 13న రాజుపేట శ్రీప్రకాష్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో 16, 17, 18 బెటాలియన్ల జూనియర్, సీనియర్‌  క్యాడెట్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ శిబిరానికి తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలకు చెందిన 610 మంది బాలురు, 48 మంది బాలికలు వచ్చారన్నారు. ఆదివారంతో రైఫిల్‌ షూటింగ్‌ ముగిసిందని, సోమవారం శిక్షణ శిబిరం పూర్తవుతుందని చెప్పారు. శ్రీప్రకాష్‌ ఎన్‌సీసీ థర్డ్‌ ఆఫీసర్‌ ఎం.సతీష్, లెఫ్టినెంట్‌ రమణబాబు, చీఫ్‌ ఆఫీసర్‌ యు.మాచిరాజు, ట్రైనింగ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ ఎం.కృష్ణారావు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement