రైఫిల్ షూటింగ్‌లో ప్రతిభ
గుంటూరు స్పోర్ట్స్: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇటీవల జరిగిన 62వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 రైఫిల్ షూటింగ్‌లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి 3 కాంస్య పతకాలు సాధించారు. యక్కలూరి శ్రీనిత్య బాలికల పిప్ సైట్ ఈవెంట్‌లో, ఎం.రిషిత ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో , బాలుర ఎయిర్ రైఫిల్ విభాగంలో హర్షవర్ధన్ రెడ్డి కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని మంగళవారం స్కూల్ గేమ్స్ కార్యదర్శి ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ ఎం.సంజీవరెడ్డి, డీబీఈఓ రామకృష్ణ పరమహంస అభినందించారు.