భారత రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్... అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ: భారత రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్... అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. భారత్ నుంచి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
మ్యూనిచ్‌లో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో రణ్‌ధీర్‌కు 25 ఓట్లకు గాను 22 ఓట్లు పడ్డాయి. ఐఎస్‌ఎస్‌ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్‌లో కూడా రణ్‌ధీర్ సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. మొత్తం 293 ఓట్లలో 145 ఓట్లు సాధించారు.