రూ. 29 లక్షల కేసు విషయంలో ఏఆర్‌ రెహ్మాన్‌పై ఫిర్యాదు | Surgeons Association Filed Complaint Against AR Rahman In Chennai Police Commissioner Office, Know Details - Sakshi
Sakshi News home page

Complaint On AR Rahman: రూ. 29 లక్షల కేసు విషయంలో ఏఆర్‌ రెహ్మాన్‌పై ఫిర్యాదు

Published Thu, Sep 28 2023 6:53 AM | Last Updated on Thu, Sep 28 2023 8:52 AM

Complaint Against AR Rahman - Sakshi

సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌పై చైన్నె పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వివరాలు.. శస్త్ర చికిత్స వైద్య నిపుణుల సంఘం 2018లో ఏఆర్‌ రెహ్మాన్‌తో ఒక సంగీత కచ్చేరిని నిర్వహించ తలపెట్టింది. అందుకు అడ్వాన్స్‌గా రహ్మాన్‌కు రూ.29.50 లక్షలు ఇచ్చారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ సంగీత కచ్చేరి రద్దు అయ్యింది.

కాగా రెహ్మాన్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ నగదును తమకు తిగిరి ఇవ్వలేదని, చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ వైద్య నిపుణుల సంఘం నిర్వాహకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఇటీవల ఏఆర్‌.రెహ్మాన్‌ చైన్నెలో నిర్వహించిన సంగీత కచ్చెరీ రసాభాసగా మారిన విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ రియాక్షన్‌ కోరుకుంటున్న 'పెదకాపు' హీరో)

పరిమితికి మించిన టిక్కెట్లు విక్రయించడం వల్ల టిక్కెట్లు కొనుగోలు చేసిన చాలా మంది సంగీత కచ్చేరి ఆవరణలోకి వెళ్లలేక అసంతృప్తితో వెనుదిరిగారు. ఈ వ్యవహారం పోలీసుల విచారణ వరకూ వెళ్లింది. ఆ సంఘటనపై ఏఆర్‌.రెహ్మాన్‌ క్షమాపణ చెప్పినా చాలా మంది సంగీత ప్రియులు ఆయనపై ఆసంతృప్తిని వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement