DCP venkateswara rao
-
వనస్థలిపురంలో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పనామా వద్ద ఉన్న రైతు చికెన్ బజార్లో పనిచేస్తోన్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గిరి అనే వ్యక్తి, చికెన్ షాపులో పనిచేస్తోన్న కృష్ణ చైతన్య(30) అనే వ్యక్తిని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేసి పరారయ్యాడు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేశాడు..
సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తిని కత్తితో దారుణంగా నరికి హత్య చేశారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివి.. పనామా వద్ద ఓ రైతు చికెన్ బజార్, లైవ్ ఫిష్ షాపులో పనిచేస్తున్నాడు. గిరి అనే వ్యక్తి అతని కత్తితో దారుణంగా హత్య చేసి నీళ్ల డ్రమ్‌లో వేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు గిరి పరారీలో ఉన్నాడు. మద్యం మత్తులో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఎల్బీ నగర్ డీసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మూడు మృతదేహాలు ఒకే పాడెపై ..
చందుర్తి(వేములవాడ): హైదరాబాద్‌లో భర్త చేతిలో హత్యకు గురైన జ్యోతి.. ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలను ఒకే పాడెపై ఉంచి మంగళవారం అంత్యక్రియలు జరిపారు. హైదరాబాద్ జిల్లెలగూడలో భర్త హరిందర్ చేతిలో భార్య జ్యోతి (32)తో పాటు ఇద్దరు పిల్లలు అభితేజ్(6), సహస్త్ర (4)లు సోమవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. జ్యోతి స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి. గ్రామానికి చెందిన అబ్బగోని వజ్ర–సత్తయ్యల రెండో కూతురు జ్యోతి. పోస్టుమార్టం అనంతరం ముగ్గురి మృతదేహాలను మంగళవారం ఇక్కడికి తీసుకొచ్చారు. మూడు మృతదేహాలను ఒకేపాడెపై కట్టి గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
భార్య నిలదీయడంతో ఉన్మాదిగా మారి...
హైదరాబాద్: భార్య తనను నిలదీస్తోందన్న ఆగ్రహం.. కన్నపిల్లలని కూడా చూడని ఉన్మాదం.. విచక్షణ మరిచిపోయిన క్షణికావేశం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. వ్యాపారం సరిగా సాగడం లేదని మానసికంగా కుంగిపోయిన హరీందర్ అనే వ్యక్తి.. దీనిపై భార్య నిలదీయడంతో ఉన్మాదిగా మారిపోయాడు. గాఢ నిద్రలో ఉన్న భార్యను, ఇద్దరు పిల్లలను గొంతుపిసికి చంపేశాడు. భార్య వేధింపులు భరించలేక ఆమెను హత్య చేశానని, తాను జైలుకు వెళితే పిల్లలేమవుతారోనని వారిని కూడా చంపేశానని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో ఈ దారుణం జరిగింది. తీవ్రంగా ఆవేశానికి లోనై.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కుల్కచర్లకు చెందిన మాలె హరీందర్ (38), మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బాలాజీనగర్‌కు చెందిన జ్యోతి (32)లకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. హైదరాబాద్‌లోని జిల్లెలగూడలోని సుమిత్ర ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు అభితేజ్ (6), సహస్ర (4). డెంటల్‌లో డిప్లొమా చేసిన హరీందర్ మలక్‌పేటలోని తిరుమల టవర్స్‌లో ఎస్డీఆర్ ల్యాబ్ పేరిట కృత్రిమ దంతాలు తయారుచేసే వ్యాపారం చేస్తున్నాడు. కానీ కొంతకాలంగా వ్యాపారం సరిగా నడవక.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. చివరికి ఇంటి అవసరాల కోసం కూడా బంధువులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ వ్యాపారం వదిలేసి, మరో పని చేయాలంటూ హరీందర్పై భార్య జ్యోతి కొద్దిరోజులుగా ఒత్తిడి చేస్తోంది. దీంతో కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆదివారం రాత్రి కూడా ఈ విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. తీవ్రంగా ఆవేశానికి లోనైన హరీందర్.. భార్యను చంపేసేందుకు సిద్ధమయ్యాడు. తాను జైలుకు వెళితే పిల్లల పరిస్థితి ఏమవుతుందోనని వారిని కూడా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. నిద్రలోనే గొంతు పిసికి.. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో హరీందర్ జ్యోతిని గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత పిల్లలు అభితేజ్, సహస్రలను కూడా గొంతు పిసికి చంపేశాడు. ఆరు గంటల సమయం వరకు ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత బయటికి వచ్చి.. భార్య వేధింపులు భరించలేక ఆమెను, పిల్లలను చంపేశానని పొరుగింటి వారితో చెప్పాడు. అనంతరం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ మన్మోహన్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హరీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తాత్కాలికంగా ఎదురైన ఇబ్బందులను ఎదుర్కోవడం చేతగాక తన కుమార్తెను, మనవళ్లను హరీందర్ హతమార్చాడంటూ జ్యోతి తండ్రి సత్తయ్య కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె ఆదివారం సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడిందని, వచ్చే వారం పుట్టింటికి వస్తానని చెప్పిందని.. ఇంతలోనే ఇలా జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరీందర్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. -
కట్టుకోబోయే వాడే కడతేర్చాడు
నాగోలు: కాబోయే భార్యను అనుమానంతోనే అంతం చేశాడు. నగరంలో సంచలనం రేపిన అనూష హత్య కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశాడు. ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గిరిజానగర్ తండాకు చెందిన అనూష (23) బీటెక్ పూర్తి చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం నగరంలో శిక్షణ తీసుకుంటూ హయత్‌నగర్‌లోని తన సోదరి వద్ద ఉంటోంది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి తండాకు చెందిన అంగోత్ మోతీలాల్ (24) అనూషకు దూరపు బంధువు. బీటెక్ పూర్తి చేసి శంషాబాద్‌లోని ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో టెలీకాలర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 2013 నుంచి అనుష, మోతీలాల్‌లు ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో ఇరు వర్గాలు ఒప్పుకుని నిశ్చితార్ధం చేశారు. కట్నం కింద 8 లక్షల నగదు ఇస్తామని ఒప్పుకున్నారు. అయితే అనూష కానిస్టేబుల్ శిక్షణ కోసం నగరానికి వెళ్లడం, ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన మోతీలాల్ ఆమె ఫోన్, వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించాడు. ఇంతలోనే అనూష తాను గర్భవతిని అని, పెళ్లి చేసుకోవాలని మోతీలాల్పై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో మోతీలాల్ ఇంటర్వ్యూ ఉందని గ్రామంలో ఉన్న అనూషను ఈ నెల 24న నగరానికి తీసుకొచ్చాడు. హయత్‌నగర్ పరిసర ప్రాంతాలలో తిరిగి మిధాని కాలనీలో నివాసముండే అనూష సోదరి చిట్టెమ్మ ఇంటికి వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సోదరి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో 28వ తేదీన మోతీలాల్ ఇంటికి వచ్చాడు. అప్పటికే అనూషపై అనుమానం పెంచుకున్న మోతీలాల్ గర్భం, వివాహం విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన మోతీలాల్ బండరాయితో అనూషపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అనూష అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు ఇంటికి రాకపోగా, ఇద్దరి ఫోన్లు ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో నగరంలో ఉండే సోదరుడు శ్రీకాంత్‌కు తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఇంటికి వెళ్లి పరిశీలించగా అనూష రక్తపుమడుగులో కనిపించింది. దీంతో శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు మోతీలాల్‌ను శనివారం సాగర్‌రింగురోడ్డులోని టీకేఆర్ కమాన్ వద్ద అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ రవిందర్‌రెడ్డి, హయత్‌నగర్ సీఐ సతీష్, జి.రామన్‌గౌడ్, పాల్గొన్నారు. ఎస్ఐ రాంలాల్ ప్రోద్బలంతోనే హత్య.. మోతీలాల్ సోదరుడు రాంలాల్ నగరంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడని, అతని మరదలిని మోతీ లాల్‌కు ఇవ్వడం కోసమే తన కూతురిని హత్య చేయిం చాడని అనూష తల్లిదండ్రులు డీసీపీ కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక రాంలాల్, శంకర్, చిన్నాల హస్తం ఉందని వాపోయారు. -
ప్రజాప్రతినిధుల ఇళ్లే టార్గెట్
బంజారాహిల్స్: ప్రజా ప్రతినిధులు, వారి సంబందీకుల ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. విశాఖ పట్నం పెందుర్తి కి చెందిన గౌరేష్ అలియాస్ పితాని ఆర్యన్ రెడ్డి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ బాపూనగర్‌లో ఉంటున్నాడు. 2013 నుంచి ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కిటికీలో నుంచి లోపలికి దూరి పూజామందిరాల్లో ఉన్న బంగారు, వెండి విగ్రహాలను ఎత్తుకెళ్లేవాడు. 2015 జనవరి 17న నెల్లూరు ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తనయుడు బొల్లినేని ధనుష్ శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించి పూజా మందిరంలో ఉన్న 43 తులాల లక్ష్మి విగ్రహంతోపాటు వజ్రాల చెవి రింగులు దోచుకెళ్లాడు. గత నెల 11న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఇంట్లో రూ.2 లక్షల విలువ చేసే పంచలోహ విగ్రహం, బంగారు పూత కలిగిన పెన్ను ఎత్తుకెళ్లాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 14లో వ్యాపారి డేగ విష్ణువర్ధన్‌రెడ్డి, చార్టెడ్ అకౌంటెంట్ రావి శేషగిరిరావు నివాసాల్లో విలువైన వాచీలు, మహాలక్ష్మి విగ్రహం, హోం థియేటర్ సామాగ్రి ఎత్తుకెల్లాడు. నిందితుడి నుంచి రూ.23.10 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మూడు నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2013లోనే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో రెండు దొంగతనం కేసులు, రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు కేసులు ఉన్నట్లు తెలిపారు. ఏసీపీ కేఎస్.రావు, ఇన్స్పెక్టర్ పూర్ణచందర్, డీఐ కె. ముత్తు, ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘ఆ ఘటనతోనే శిరీషకు మనస్తాపం’
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష మృతి ముమ్మాటికీ ఆత్మహత్యేనని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. కుకునూర్‌పల్లిలో జరిగిన ఘటనతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకుందని మంగళవారం ఆయన విలేకరులతో చెప్పారు. ఆమెపై అత్యాచారం జరిగిందా, లేదా అనేది ఫోరెన్సిక్ నివేదికతో తేలుతుందని, రిపోర్టు కోసం వేచిచూస్తున్నామన్నారు. శిరీష మృతి కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్లను విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు చేసిన దర్యాప్తు ప్రకారం శిరీష ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చినట్టు చెప్పారు. శిరీష తన ఫోన్లో పంపించిన గూగుల్ లోకేషన్‌ను పూర్తిగా పరిశీలించినట్టు వెల్లడించారు. శిరీష, రాజీవ్, శ్రావణ్, ప్రభాకర్‌రెడ్డి ఫామ్‌హౌస్ వెళ్లారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈనెల 12న అర్ధరాత్రి ఎస్సై గదిలోనే వీరందరూ ఉన్నట్టు ఆధారాలున్నాయని తెలిపారు. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఫామ్‌హౌస్ ఉందని, అక్కడి సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించినట్టు చెప్పారు. శిరీష బంధువులకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామన్నారు. రాజీవ్, శ్రావణ్లను రేపు కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. -
ఘరానా దొంగ.. ఖరీదైన దొంగ
పంజగుట్ట: పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న దొంగను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు పది లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన అబ్బూరి సోమయ్య అలియాస్ శ్రీకాంత్ చౌదరి అలియాస్ అక్కినేని అలియాస్ కార్తీక్ (35) 2007లో కుటుంబ సభ్యులతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి ఇతని నేరచరిత్ర ప్రారంభం అయింది. అదే ఏడాది మొట్టమొదటి దొంగతనం వైజాగ్‌లో చేసి పోలీసులకు చిక్కాడు. తరువాత త్రివేండ్రం, బెంగళూరు, చెన్నైతోపాటు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనిపై ఉన్న 41 కేసుల్లో కేవలం చెన్నైలోనే 17 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అక్కడి పోలీసులు ఇతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. కేవలం పదో తరగతి చదివిన సోమయ్య తెలుగు, తమిళం, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలడు. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని వారిని ప్రలోభపెట్టి బంగారు ఆభరణాలు, ఖరీదైన సెల్ఫోన్లు దొంగిలించుకొని పారిపోతాడు. ఇలా ఇతనిపై నర్సారావుపేట, విజయనగరం పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ఖరీదైన హాస్టళ్లలో ఉంటూ వ్యాపారవేత్తగా చెప్పుకొని పలువురితో స్నేహాలు చేసి, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ఐపాడ్లు కాజేస్తాడు. కారు డ్రైవింగ్ రాకపోవటంతో క్యాబ్‌లలో తిరుగుతూ డ్రైవర్ల దృష్టి మరల్చి వారి ఖరీదైన ఫోన్లు కూడా మాయం చేస్తుంటాడు. ఇతనికి దక్షిణ భారతదేశంలోని తెలియని దేవాలయం లేదు. ఆయా ఆలయాల ఉన్నతాధికారులతో ఇతనికి పరిచయాలున్నాయి. దొంగసొత్తు కొంత నేరుగా ఆయా ఆలయాల ఈవో వద్దకు వెళ్లి పరిచయం చేసుకొని చందాల రూపంలో సమర్పించి ఈవోల గదిలోనే బస చేస్తాడు. ఇతనికి అన్నింటికన్నా సేఫ్ ప్లేస్దేవాలయాల ఇఓల గదులే. సోమయ్యకు మద్యం అలవాటు లేదు. ఖరీదైన ఫోన్లు వాడుతూ అద్దె కార్లలో తిరుగుతూ జల్సా చేస్తుంటాడు. శ్రీనగర్‌కాలనీలో దొంగిలించిన సొమ్మును అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పంజగుట్ట పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇతని నుంచి 13 ల్యాప్‌టాప్‌లు, ఒక యాపిల్ ఐ పాడ్, 14 ఖరీదైన సెల్ఫోన్లు, ఐదు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని డీసీపీ తెలిపారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాలు తగ్గుముఖం
గోల్కొండ: ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం వల్ల నేరాలు తగ్గడంతో పాటు ప్రజలు, పోలీసుల మధ్య ఉన్న సంబంధాలు మరింత పటిష్టమయ్యాయని పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం గుడిమల్కాపూర్ కింగ్స్ ప్యాలెస్‌లో మసీదుల నిర్వహణ కమిటీలు, బస్తీ సంక్షేమ సంఘం, మైత్రీ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం నేరస్తుల ఆటను కట్టించేదిగా ఉందని, దీని వల్ల కాలనీలు, బస్తీలలో చోరీల సంఖ్య తగ్గిందని అన్నారు. చోరీలను పూర్తిగా నివారించేందుకు కాలనీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగరంలో సంచలనం సృష్టించిన దొంగతనాలు సీసీ టీవీ పుటేజిల కారణంగా ఛేదింపబడ్డాయని ఆయన అన్నారు. కాలనీలవారితో పాటు వ్యాపారులు ప్రార్థనా స్థలాల నిర్వహణ కమిటీల వారు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి సీసీ కెమెరాల కంపెనీల వారితో మాట్లాడి డబ్బును వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు ఒప్పించడం జరిగిందన్నారు. కాగా రంజాన్ మాసంలో మసీదుల నిర్వహణ కమిటీల వారు మసీదు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి కృషి చేయాలన్నారు. దీనికి బల్దియా వారితో పాటు అవసరమైతే స్థానిక పోలీసుల సహాయం కూడా తీసుకోవాలన్నారు. ఎంతో ఈ పవిత్రమైన ఈ మాసంలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మైత్రి సభ్యులు పోలీసులకు సహకరించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచే రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
నిత్యానందరెడ్డి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
-
నిత్యానందరెడ్డి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి నుంచి కాల్పుల ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు బుధవారం ఆయనను కలిసి వివరాలు తెలుసుకున్నారు. నిత్యానందరెడ్డి మాట్లాడుతూ 'నేను కారులో కూర్చోగానే ఫ్రంట్ డోర్ ద్వారా వచ్చిన ఆగంతకుడు నా గుండెపై గన్ గురి పెట్టి స్టార్ట్ ది కార్ అన్నాడు. నేను వెంటనే గన్ బారెల్ను పైకి లేపాను...అతను వెంటనే పైకి కాల్పులు జరిపాడు. అదే సమయంలో నా వద్ద ఉన్న పిస్టల్ తీసి కాల్పులకు ప్రయత్నించాను. కొద్దిదూరంలో ఉన్న నా సోదరుడు ప్రసాద్‌రెడ్డి వచ్చి ఆగంతకుడిని వెనకనుంచి పట్టుకున్నాడు. మా తమ్ముడి చెయ్యి కొరికి ఆగంతకుడు పరారయ్యాడు. సమీపంలో ఉన్న వాకర్స్ చేరుకోవడంతో ఆగంతకుడు ఏకే 47 గన్, బ్యాగు వదిలేసి వెళ్లాడు. నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి లేదు...నాకు ఎవరిపైనా అనుమానం లేదు' అన్నారు. కాగా అంతకు ముందు డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యానందరెడ్డిపై గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.