వనస్థలిపురం: రంగారెడ్డి జిల్లాలోని ఇంజపూర్ లో ఓ టైల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. వనస్ధలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్లో ఉన్న కృష్ణమ నాయుడు టైల్స్ కంపెనీలో టైల్స్ కట్ చేయడానికి ఉపయోగించే కెమికల్ డబ్బాలకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది.
మంటల ధాటికి అక్కడే ఉన్న యజమాని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టైల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం
Published Sun, Aug 13 2017 8:23 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
Advertisement
Advertisement