tiles company
-
శీతల దేశాల నేస్తం.. మార్కాపురం పలక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం అంటే.. అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది ‘పలక’. ఆ పలక మీద ఓనమాలు నేర్చుకున్న ఎన్నో చిట్టి చేతులు.. ఉన్నతస్థానాలకు చేరాయి. అలాగే ఎన్నో శీతల దేశాలు కూడా మార్కాపురం పలక(Markapuram Matti Palaka)లను అక్కున చేర్చుకున్నాయి. మన దేశంలో వీటిని అక్షరాలు దిద్దేందుకు వినియోగిస్తే.. శీతల దేశాల్లో గృహ నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల బయట గడ్డ కట్టే చలి ఉన్నా.. గదిలో మాత్రం వెచ్చగా ఉంటుంది. అందుకే వీటికి శీతల దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రాసుకునే పలకల నుంచి డిజైన్ స్లేట్స్ వైపు అడుగులు.. పలకల గనులు మార్కాపురంతో పాటు తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో హరియాణా, రాజస్థాన్ ప్రాంతాల్లో పలకల గనులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా మార్కాపురం నుంచే పలకలు ఎగుమతి అవుతుంటాయి. 80, 90 దశకాల్లో వ్యాపారం జోరుగా సాగింది. ఆ రోజుల్లో ఏ చిన్నారి చేతిలో చూసినా మార్కాపురం పలకే ఉండేది.ఈ ప్రాంతంలో 100కి పైగా గనుల్లో కార్యకలాపాలు సాగేవి. వేలాది మంది గడ్డపారలు, సుత్తులతో పలకలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా తీసేవారు. అయితే కాలక్రమేణా రాసుకునే పలకల వినియోగం తగ్గడంతో వ్యాపారులు, తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేశారు. గృహ నిర్మాణాల్లో ఉపయోగించేలా పలకల తయారీ మొదలుపెట్టారు. వీటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. చైనాతో పోటీ.. కరోనాతో డీలా అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, వియత్నాం, మలేసియా, సింగపూర్, ఇంగ్లండ్ తదితర దేశాలకు మార్కాపురం నుంచి పలకలను ఎగుమతి చేస్తుంటారు. క్రిస్మస్ వస్తుందంటే చాలు అమెరికా, ఇంగ్లండ్, రష్యా తదితరæ దేశాల్లో పాత డిజైన్ స్లేట్లను తొలగించి కొత్త వాటిని అమర్చుకుంటూ ఉంటారు. దీంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండేది. అదే సమయంలో చైనా కూడా భారీగా ఎగుమతులు మొదలుపెట్టారు. ఈ పోటీని తట్టుకుంటున్న సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం తలెత్తడంతో ఎగుమతులకు ఆటంకాలు ఎదురయ్యాయి.కరోనా తర్వాత ఈ పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింది. చాలా పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులతో మూతపడ్డాయి. కొందరు మాత్రమే ఎగుమతులు ప్రారంభించారు. మళ్లీ పుంజుకుంటున్న సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఎగుమతులపై పడింది. పలకల కంటైనర్లను సముద్రం ద్వారా పంపే ఖర్చు రెట్టింపు అయ్యింది. దీంతో ఎగుమతులు భారమయ్యాయని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కలిసొచ్చేనా.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. చైనాకు, ఆ దేశానికి మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. పోటాపోటీగా దిగుమతి సుంకాలను పెంచుకుంటున్నాయి. దీంతో అమెరికాలో చైనా పలకల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మళ్లీ మార్కాపురం పలకలకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వ భవనాలకు మార్కాపురం డిజైన్ స్లేట్స్‌ను ఉపయోగించాలి. అలాగే ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఉచితంగా పలకలు ఇవ్వాలి. దీని వల్ల వేలాది మంది కార్మి కులకు పని దొరకడంతో పాటు పరిశ్రమ పుంజుకుంటుంది. అలాగే పలకల ఫ్యాక్టరీల యజమానులకు సబ్సిడీపై రుణాలు అందించాలి. కరెంటు చార్జీలతో పాటు క్వారీ చార్జీలను తగ్గించి.. ప్రభుత్వం ఆదుకోవాలి. – బట్టగిరి తిరుపతిరెడ్డి, డిజైన్ స్లేట్ వ్యాపారి -
ఆగస్టు 4న రెండు ఐపీఓలు...
ముంబై: భారత్‌లో అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ ఫ్రాంచైజీ సంస్థ దేవయాని ఇంటర్నేషనల్ ఐపీఓకు సిద్ధమైంది. ఇష్యూ ఆగస్ట్ 4న మొదలై., అదే నెల ఆరవ తేదిన ముగుస్తుంది. ఐపీఓకు ధరల శ్రేణి రూ.86–90గా నిర్ణయించి మొత్తం రూ.1,838 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.440 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు 15 కోట్ల ఈక్విటీలను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి పెట్టారు. మొత్తం 165 షేర్లను కలిపి ఒక లాట్‌గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేకంగా 5.50 లక్షల ఈక్విటీలకు కేటాయించారు. సమీకరించిన నిధులను రుణాలను తీర్చేందుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. ఎక్సారో టైల్స్ ముంబై: గుజరాత్‌కు చెందిన వెర్టిఫైడ్ టెల్స్ తయారీ సంస్థ ఎక్సారో టైల్స్ ఐపీఓ ఆగస్ట్ 4న ప్రారంభం కానుంది. అదే నెల 6వ తేదీన ముగిస్తుంది. ధర శ్రేణి రూ.118–120గా నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా కంపెనీ 1,342,4000 తాజా షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్ దీక్షిత్‌కుమార్ పటేల్ 22.38 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి పెట్టారు. మొత్తం 125 షేర్లను కలిపి ఒక లాట్ నిర్ణయించారు. ఇన్వెస్టర్లు రూ.15వేలు చెల్లించి ఒక లాట్‌ను సొంతం చేసుకోవచ్చు. షేర్లను ఆగస్ట్ 16వ తేదిన ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. పంథోమత్ క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థ ఈ ఇష్యూకు లీడింగ్ బుక్ మేనేజర్‌గా వ్యవహరించనుంది. ఎక్సారో టైల్స్ 27 రాష్ట్రాల్లో విస్తరించింది. సుమారు 2000లకు పైగా డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. -
సిరామిక్ టైల్స్ షేర్లు గెలాప్
ముంబై: కోవిడ్-19 నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో టైల్స్ తయారీ కంపెనీల కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. దీనికితోడు ఇటీవల ఆర్థిక రికవరీ బలపడటం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయక ప్యాకేజీలు, చౌక వడ్డీ రేట్లు, రియల్టీ రంగ ప్రోత్సాహకాలు వంటి సానుకూల అంశాలు ఈ రంగానికి జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి టైల్స్ తయారీ లిస్టెడ్ కంపెనీల కౌంటర్లకు డిమాండ్ పెరిగినట్లు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ సిరామిక్ టైల్స్ కంపెనీల షేర్లు భారీ లాభాలతో దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం.. పథకాల ఎఫెక్ట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పట్టణ గృహకల్పనకు రూ. 18,000 కోట్లు అదనంగా కేటాయించారు. తద్వారా నిలిచిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. రియల్టీ రంగం పుంజుకుంటే.. స్టీల్, సిమెంట్, టైల్స్ తదితర అనుబంధ విభాగాలకూ డిమాండ్ పుడుతుందని తెలియజేశాయి. మరోపక్క చైనాపై యూఎస్, బ్రెజిల్ తదితర దేశాలు యాంటిడంపింగ్ డ్యూటీ విధించడం టైల్స్ పరిశ్రమకు బూస్ట్‌నిస్తున్నట్లు వివరించారు. చదవండి: (ఐషర్ మోటార్స్- ఐబీ రియల్టీ.. హైజంప్) షేర్ల జోరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కజారియా సిరామిక్స్ 4.7 శాతం జంప్‌చేసి రూ. 606 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. సెరా శానిటరీవేర్ షేరు 7.3 శాతం దూసుకెళ్లి రూ. 2,900 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2,937ను తాకింది. ఇది ఏడాది గరిష్టంకావడం గమనార్హం! ఈ బాటలో సొమానీ సిరామిక్స్ 9.4 శాతం ఎగసి రూ. 253 వద్ద ట్రేడవుతోంది. తద్వారా జనవరి 17న రూ. 252.50 వద్ద సాధించిన ఏడాది గరిష్టాన్ని అధిగమించింది. చదవండి: (చిన్న షేర్ల దన్ను- స్మాల్ క్యాప్ రికార్డ్) -
టైల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం
వనస్థలిపురం: రంగారెడ్డి జిల్లాలోని ఇంజపూర్ లో ఓ టైల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. వనస్ధలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్‌లో ఉన్న కృష్ణమ నాయుడు టైల్స్ కంపెనీలో టైల్స్ కట్ చేయడానికి ఉపయోగించే కెమికల్ డబ్బాలకు మంటలు అంటుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. మంటల ధాటికి అక్కడే ఉన్న యజమాని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.