
వనస్థలిపురంలో దారుణం!
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. నల్లగొండలో కిడ్నాప్ చేసిన ఓ యువకుడిని వనస్థలిపురం తీసుకొచ్చి దుండగులు హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
నల్లగొండలో శోభన్ అనే యువకుడిని బుధవారం రాత్రి కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతన్ని వనస్థలిపురం సహారా ఎస్టేట్ వద్దకు తీసుకొచ్చి హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఒకడిని రౌడీషీటర్ రాజేశ్‌గా గుర్తించారు. రాజేశ్‌పై గతంలో నాలుగు హత్యకేసులు ఉన్నాయి. శోభన్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బుధవారం ఇంటినుంచి వెళ్లిన తమ కొడుకు గురువారం నాటికి హత్య గురికావడం కుటుంబసభ్యులను కలిచివేస్తున్నది.