మాజీ నక్సలైట్ నయీం అనుచరుల్లో మరో ఇద్దరిని మంగళవారం వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: మాజీ నక్సలైట్ నయీం అనుచరుల్లో మరో ఇద్దరిని మంగళవారం వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి నయీం డ్రైవర్ శ్రీధర్ గౌడ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు...అతను ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని పట్టుకున్నారు. మంగళవారం ఉదయం ముగ్గురిని నుంచి పోలీసులు విచారిస్తున్నారు.
వనస్థలిపురంలోని నయీం గెస్ట్హౌస్పై సోమవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో రూ.38.50 లక్షల నగదు, 3 పిస్తోళ్లు, 22 రౌండ్ల బుల్లెట్లు, 25 సేల్స్ డీడ్ డాక్యుమెంట్లు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.