సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో కరోనా కలకం రేపుతోంది. ఈ ప్రాంతంలో ఇటీవల కరోనా కేసులు నమోదు కావడంతో.. అధికారులు 8 కాలనీలను కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించారు. కంటైన్‌మెంట్ జోన్లలో సోమవారం నుంచి వారం రోజుల పాటు రాకపోకలను బంద్ చేయనున్నారు. అలాగే ఈ 8 కాలనీల పరిసరాల్లో కఠిన అంక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వనస్థలిపురంలో మొత్తం 169 కుటుంబాలు హోం క్వారంటైన్‌లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
వనస్థలిపురం హుడాసాయినగర్, సుష్మాసాయినగర్, కమలానగర్, రైతుబజార్ సమీపంలోని ఏ, బీ టైప్ కాలనీలు, ఫేజ్-1 కాలనీ, సచివాలయ నగర్, ఎస్‌కేడీ నగర్, రైతుబజార్-సాహెబ్‌నగర్ రహదారిని కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించినట్టుగా అధికారులు తెలిపారు. కాగా, వనస్థలిపురం పరిధిలోని మూడు కుటుంబాలు కరోనా బారినపడగా.. ఇప్పటివరకు 9 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
Comments
Please login to add a commentAdd a comment