పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
హైదరాబాద్: పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. ఆటోనగర్‌లోని జడ్జెస్ కాలనీలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న కె.మురళీ, ఎస్.కె.అజ్మరుల్లా, టి.శ్రీను, వి.దాసు లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.48 వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.