వనస్థలిపురంలో నకిలీ డాక్టర్ అరెస్ట్
Published Fri, Jul 21 2017 4:36 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
హైదరాబాద్: వనస్థలిపురంలో నకిలీ డాక్టర్‌ను ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కొంత కాలంగా బ్రహ్మయ్య అనే వ్యక్తి సిద్దార్ధ పాలీ క్లినిక్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఎంబీబీఎస్ చేయకుండానే కొంతమందికి స్వతహాగా చికిత్స చేస్తున్నాడు. శుక్రవారం ఓ మహిళకి చికిత్స చేస్తుండగా బ్రహ్మయ్య అడ్డంగా దొరికిపోయాడు. క్లినిక్ మరో వ్యక్తిపై రిజిస్టరై ఉంది. ఎటువంటి అనుభవం లేకుండా క్లినిక్ నడిపిస్తున్నందుకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement