
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తు పైనుంచి ఓ వ్యక్తి ప్రియురాలిని కిందకు నెట్టివేశాడు. తీవ్ర గాయలతో ఉన్న ఆ యువతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన సీమ, దిలీప్‌లు 15 రోజుల క్రితం నగరానికి వచ్చారు. వనస్థలిపురం శక్తినగర్‌లోని వాసవి నిలయం భవనం నిర్మాణం జరుగుతుంటే అందులో పనికి చేరారు. అయితే గురువారం సీమను దిలీప్ బిల్డింగ్‌పై నుంచి నెట్టివేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాని కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.