
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్ చేసి వివాహితతో అసభ్యంగా మాట్లాడటమే కాక.. వేరే వారికి ఆమె నంబర్ ఇచ్చి వేధింపులకు గురి చేస్తోన్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాలు.. ఆదిభట్ల మున్సిపాలిటిలోని పటేల్ గూడకు చెందిన గడుసు నరసింహ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడు. వేర్వేరు నంబర్ల నుంచి ఆమెకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడేవాడు. ‘‘నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేస్తావా’’ అంటూ అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తూ.. వేధింపులకు గురి చేసేవాడు. అంతటితో ఊరుకోక ఇతరులకు వివాహిత నంబర్ ఇచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు.
అతడి తీరుతో విసిగిపోయిన సదరు మహిళ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి నిందితుడిని నరసింహంగగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం నరసింహంతో పాటు అతడికి సహకరించిన వారిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. మరో షాకింగ్ అంశం ఏంటంటే నరసింహం గత జూలైలో అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినప్పటికి అతడు తన వక్ర బుద్ధిని మార్చుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment