
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురంలోని ఓ టైర్ల గోదాంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లలో ఘటనా స్థలానికి చేరుకొని అంతకంతకూ రెట్టింపవుతున్న మంటలను ఆర్పివేశారు. దీంతో గోదాం చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. గోదాం పక్కనే నివాముండే ప్రజలు ప్రాణభయంతో సమీపంలోని అపార్ట్‌మెంట్లలోకి పరుగులు తీశారు. నల్లని పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment