What Is Slap Kabaddi? Trending Game From Pakistan, Video Goes Viral - Sakshi
Sakshi News home page

#SlapKabaddi: పాకిస్తాన్‌ను షేక్‌ చేస్తున్న 'స్లాప్‌' కబడ్డీ.. వీడియో వైరల్‌

Published Wed, Jul 5 2023 6:54 PM

What Is Slap Kabaddi Trending Game From-Pakistan-Viral Now-A-Days - Sakshi

మన దేశంలో కబడ్డీ ఆటకు యమ క్రేజ్‌ ఉంది. ముఖ్యంగా కబడ్డీ వరల్డ్‌కప్‌ పోటీల్లో మన దేశం మూడుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఇండోర్‌ గేమ్‌గా పిలవబడే కబడ్డీ ఆటలో మనోళ్లు కింగ్‌ అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నారు. అటు వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లోనూ, మెడల్స్‌లోనూ మన దేశమే అగ్రస్థానంలో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశంలో కబడ్డీకి ఉన్న క్రేజ్‌ దృశ్యా ప్రో కబడ్డీ లీగ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రో కబడ్డీ లీగ్‌ తొమ్మిది సీజన్‌లు విజయవంతంగా పూర్తి చేసుకుంది.

అయితే ప్రస్తుతం పాకిస్తాన్‌లో  స్లాప్‌ కబడ్డీ(Slap Or Tappad) తెగ వైరల్‌ అవుతోంది. వినటానికి కొత్తగా ఉన్నా ఆటతీరు మాత్రం ‍కడుపుబ్బా నవ్వుకునేలా ఉంది. సాధారణంగా ఏడుగురు ఉండే కబడ్డీలా కాకుండా ఈ ఆట ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. ఒక ఆటగాడు కొట్టడం ద్వారా పాయింట్‌ను స్కోరు చేస్తాడు. మరో ఆటగాడు ఈ పాయింట్‌ని కోల్పొకుండా ప్రత్యర్థి నుంచి కాపాడుకుంటాడు. ఇందులో పంచ్‌లను ఫౌల్ లుగా పరిగణిస్తారు.

ఇప్పుడు ఈ  స్లాప్‌ కబడ్డీ  నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆటను చూడటానికి వచ్చిన వారి నుంచి వచ్చే డబ్బునే విజేతకి ఇస్తారు. ప్రస్తుతం స్లాప్‌ కబడ్డీకి పాకిస్తాన్‌లో ఎంతో ప్రజాదరణ ఉంది. ''ఒక ఆటగాడు తన ప్రత్యర్థిని ఎన్నిసార్లైనా కొట్టవచ్చు. ఇక్కడ సంఖ్య అంత ముఖ్యం కాదు. ఆటగాళ్లు గాయాలు తగలకుండా ప్రయత్నిస్తారు.'' అని పాకిస్థాన్‌ స్లాప్‌ ఆటగాడు ఒకరు మీడియాకు తెలిపారు.

చదవండి: Ashes 2023: అండర్సన్‌పై వేటు.. బ్రూక్‌కు ప్రమోషన్‌; మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు ఇదే

WI Vs IND 2023: దిగ్గజంతో చేతులు కలిపిన రోహిత్‌, విరాట్‌..

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement