రోబో సోఫియాతో హీరో డేటింగ్‌..!! | Will Smith Disastrous Date With Robot Sophia | Sakshi
Sakshi News home page

రోబో సోఫియాతో హీరో డేటింగ్‌..!!

Published Fri, Mar 30 2018 5:17 PM | Last Updated on Fri, Mar 30 2018 7:25 PM

Will Smith Disastrous Date With Robot Sophia - Sakshi

రోబో సోఫియాకు ముద్దు ఇవ్వబోయిన హీరో విల్‌ స్మిత్‌ (యూట్యూబ్‌ ఫొటో)

కేమన్‌ ద్వీపం : హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ రోబో సోఫియాతో డేటింగ్‌కు వెళ్లారు. కేమన్‌ ద్వీపాల్లో సోఫియాతో గడిపిన క్షణాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు స్మిత్‌. మాటలతో ఆమెను పడేయాలనుకుని స్మిత్‌ వేసిన ఎత్తులు సోఫియా ముందు పారలేదు.

స్మిత్‌ : చాలా కాలం నుంచి నిన్ను కలవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరిందంటూ వైన్‌ను సోఫియా ఇచ్చేందుకు ప్రయత్నం.
సోఫియా : వైన్‌ను తీసుకోలేదు. నాకూ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది.
స్మిత్‌ : జోక్‌ చెప్పడానికి యత్నం..
సోఫియా : హ్యూమర్‌ నాకు నచ్చదు
స్మిత్‌ : రోబో ఇష్టపడే మ్యూజిక్‌ ఏంటి?
సోఫియా : నన్ను సిలికాన్‌, ప్లాస్టిక్‌, కార్బన్‌ ఫైబర్లతో తయారు చేశారు. ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ అంటే నాకు ఇష్టం. హిప్‌-హాప్‌ మ్యూజిక్‌ కూడా వింటుంటాను.
స్మిత్‌ : నా సినిమాల్లోని పాటలంటే నీకు ఇష్టమేనా?
సోఫియా : నేను మీ పాటలు విన్నాను. కానీ అవి నాకు నచ్చలేదు.
స్మిత్‌ : కొద్దిగా ముందుకు జరిగి ముద్దు పెట్టబోయారు.
సోఫియా : వద్దని వారించి.. మిమ్మల్ని నేను స్నేహితుడిగా భావిస్తున్నాను అంటూ కన్నుగీటింది.

హాంకాంగ్‌కు చెందిన హాన్‌సన్‌ రోబోటిక్స్‌ సోఫియాను తయారు చేసింది. మనుషుల హావభావాలను తెలుసుకుని మసులుకునేలా అభివృద్ధి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement