Sofia
-
SOFIA telescope: గ్రహశకలాలపై నీటి జాడలు
గ్రహశకలాలు పూర్తిగా పొడి శిలలతో కూడుకుని ఉంటాయని ఇప్పటిదాకా సైంటిస్టులు భావించేవారు. కానీ అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా వాటిపై నీటి అణువుల జాడలను గుర్తించారు! సోఫియా (స్ట్రాటోస్పియరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రా రెడ్ ఆ్రస్టానమీ ఎయిర్‌బోర్న్ టెలిస్కోప్) టెలిస్కోప్ అందించిన డేటాను అధ్యయనం చేసిన మీదట వారు ఈ మేరకు ధ్రువీకరణకు వచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ప్లానెటరీ సైన్స్ జర్నల్‌లో సోమవారం ప్రచురితమయ్యాయి. ఇలా చేశారు... గ్రహశకలాలపై నీటిజాడను కనిపెట్టేందుకు సైంటిస్టులు పెద్ద ప్రయాసే పడాల్సి వచి్చంది... ► ముందుగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలను దాదాపుగా పూర్తిగా అడ్డుకునే భూ వాతావరణానికి ఎగువన ఉండే స్ట్రాటోస్పియర్ను తమ కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. ► అవసరమైన మార్పుచేర్పులు చేసిన బోయింట్ 747ఎస్పీ విమానంలో స్ట్రాటోస్పియర్ గుండా సోఫియా టెలిస్కోప్‌ను సుదీర్ఘకాలం ప్రాటు పయణింపజేశారు. ► ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. ఐరిస్, మస్సాలియా అనే గ్రహశకలాలపై నీటి అణువుల జాడను సోఫియా తాలూకు ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా (ఫోర్కాస్ట్) స్పష్టంగా పట్టిచ్చింది! ► సోఫియా కెమెరా కంటికి చిక్కిన నీటి పరిమాణం కనీసం 350 మిల్లీలీటర్ల దాకా ఉంటుందని అధ్యయన బృందం నిర్ధారించింది. ► ఈ గ్రహశకలాలు సూర్యుడి నుంచి ఏకంగా 22.3 కోట్ల మైళ్ల దూరంలో గురు, బృహస్పతి గ్రహాల మధ్యలోని ప్రధాన ఆస్టిరాయిడ్ బెల్ట్‌లో ఉన్నాయి. ► ఈ ఉత్సాహంతో సోఫియా కంటే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా మరో 30 గ్రహశకలాలపై నీటి జాడలను మరింత స్పష్టంగా కనిపెట్టే పనిలో నాసా సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. జాబిలిపై నీటి జాడలే స్ఫూర్తి... గతంలో చంద్రునిపై నీటి జాడలను కనిపెట్టింది కూడా సోఫియానే! ఆ స్ఫూర్తితోనే అదే టెలిస్కోప్ సాయంతో గ్రహశకలాలపైనా నీటి జాడల అన్వేషణకు పూనుకున్నారు. నిజానికి ఈ అధ్యయనానికి సహ సారథ్యం వహించిన నాసా సైంటిస్టు డాక్టర్ మాగీ మెక్ ఆడమ్ ఈ గ్రహశకలాలపై గతంలోనే ఆర్ర్దీకరణ(హైడ్రేషన్) జాడలను కనిపెట్టారు. కానీ దానికి కారణం నీరేనా, లేక హైడ్రోక్సిల్ వంటి ఇతర అణువులా అన్నదానిపై మాత్రం స్పష్టతకు రాలేకపోయారు. ఆ అనుమానాలకు తాజా అధ్యయనం తెర దించిందని దానికి సారథిగా వ్యవహరించిన రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ అనీసియా అరెడొండో తెలిపారు. ‘‘నిజానికి డాక్టర్ మెక్ ఆడమ్ తన పరిశోధనకు ఎంచుకున్న ఈ రెండు గ్రహశకలాలు పూర్తిగా సిలికేట్మయం. కనుక అవి పూర్తిగా పొడిబారినవే అయ్యుంటాయని తొలుత అనుకున్నాం. కానీ వాటిపై కనిపించింది నీరేనని మా పరిశోధనల్లో స్పష్టంగా తేలింది’’ అని వివరించారు. 2020లో చంద్రుని దక్షిణార్ధ గోళంలో నీటి జాడలను సోఫియా నిర్ధారించింది. ఏమిటీ గ్రహశకలాలు... ఒక్కమాటలో చెప్పాలంటే మన సౌర వ్యవస్థ రూపొందే క్రమంలో మిగిలిపోయిన అవశేషాలు. ఒకరకంగా సూర్యుడు, తన నుంచి నిర్ధారిత దూరాల్లో గ్రహాలు ఒక్కొక్కటిగా రూపొందే క్రమంలో మిగిలి విడిపోయిన వ్యర్థాల బాపతువన్నమాట. సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో సూర్యుడికి కాస్త దూరంలో ఉన్న భూమి వంటి గ్రహాలు రాళ్లు తదితరాలకు ఆలవాలంగా మారితే సుదూరంలో ఉన్న యురేనస్, నెప్ట్యూన్ వంటివి నింపాదిగా చల్లబడి మంచు, వాయుమయ గ్రహాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చాయట. గ్రహశకలాలు కోట్లాది ఏళ్ల క్రితం భూమిని విపరీతమైన వేగంతో ఢీకొన్న ఫలితంగానే మన గ్రహంపై నీరు ఇతర కీలక మూలకాలు పుట్టుకొచ్చాయని సైంటిస్టులు చాలాకాలం క్రితమే సిద్ధాంతీకరించారు. గ్రహశకలాలపై నీటి అణువుల ఉనికి దానికి బలం చేకూర్చేదేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రహశకలాల పరమాణు కూర్పును మరింత లోతుగా పరిశోధిస్తే అంతరిక్షంలో వీటి జన్మస్థానంపై ఇంకాస్త కచి్చతమైన నిర్ధారణకు రావచ్చన్నది సైంటిస్టుల భావన. అది అంతరిక్షంలో ఇతర చోట్ల నీరు తదితర కీలక మూలకాలతో పాటు జీవం ఉనికి కోసం చిరకాలంగా చేస్తున్న పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడగలదని వారంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బల్గేరియాలో దారుణం..బస్సు ప్రమాదంలో 48 మంది మృతి
సోఫియా: పశ్చిమ బల్గేరియాలోని హైవేపై నార్త్ మెసిడోనియన్ లైసెన్స్ ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 45 మంది మరణించారని అధికారులు తెలిపారు. అయితే బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు, కాలిన గాయాలతో ఏడుగురిని రాజధాని సోఫియాలోని ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక భద్రతా విభాగానికి చెందిన అంతర్గత మంత్రిత్వ శాఖ అధిపతి నికోలాయ్ నికోలోవ్ వెల్లడించారు. (చదవండి: కుక్కని బుక్ చేసేందుకై...మరీ అలా చేయాలా!) అంతేకాదు బస్సు బోల్తాపడటంతో అగ్నిప్రమాదం జరిగిందో లేదా అగ్నిప్రమాదం జరిగాక బొల్తాపడిందనేది ఇంకా స్పష్టం కాలేదని నికోలోవ్ చెప్పారు. అయితే ఈ ప్రమాదం తెల్లవారుఝామున సుమారు 2 గంటల ప్రాంతంతో జరిగిందని అన్నారు. పైగా బాధితుల్లో ఎక్కువ మంది నార్త్ మాసిడోనియాకు చెందిన వారేనని సోఫియాలోని నార్త్ మెసిడోనియా రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. (చదవండి: వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!) -
French Open: సోఫియాకు షాక్...
పారిస్: ఈసారి సీడెడ్ క్రీడాకారిణులకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ కలసి రావడంలేదు. తాజాగా మహిళల సింగిల్స్‌లో గత ఏడాది రన్నరప్, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) కూడా ఇంటిముఖం పట్టింది. దాంతో క్వార్టర్ ఫైనల్ బరిలో టాప్–20లో కేవలం ఇద్దరు మాత్రమే బరిలో మిగిలారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ మరియా సాకరి (గ్రీస్) 6–1, 6–3తో ప్రపంచ ఐదో ర్యాంకర్ సోఫియా కెనిన్‌పై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో సాకరి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన తొలి గ్రీస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 68 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకరి నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు కెనిన్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన సోఫియా కెనిన్ ఏకంగా తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు, 32 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 53 నిమిషాల్లోనే... మరోవైపు అమెరికా టీనేజ్ స్టార్ కోకో గాఫ్ కూడా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 17 ఏళ్ల గాఫ్ కేవలం 53 నిమిషాల్లో 6–3, 6–1తో 25వ సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా)ను చిత్తుగా ఓడించింది. తద్వారా 2006 తర్వాత (నికోల్ వైదిసోవా; చెక్ రిపబ్లిక్–ఫ్రెంచ్ ఓపెన్) ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్స్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. జబర్‌తో మ్యాచ్‌లో గాఫ్ నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–0తో 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, 2018 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి తన కెరీర్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో గాఫ్‌తో క్రిచికోవా ఆడుతుంది. నాదల్ 15వసారి... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 15వ సారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–5, 6–3, 6–0తో జానిక్ సినెర్ (ఇటలీ)పై గెలుపొందాడు. రెండు గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ నాలుగు ఏస్‌లు సంధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేశాడు. 13 సార్లు నెట్‌వద్దకు వచ్చి 12 సార్లు పాయింట్లు గెలిచాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బెరెటిని (ఇటలీ)తో జొకోవిచ్; ష్వార్ట్‌జ్‌మన్‌తో నాదల్; జ్వెరెవ్‌తో ఫొకినా; ఐదో సీడ్ సిట్సిపాస్‌తో రెండో సీడ్ మెద్వెదెవ్ తలపడతారు. గట్టెక్కిన జొకోవిచ్... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 15వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న 19 ఏళ్ల ఇటలీ టీనేజర్ లొరెంజో ముజెత్తితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–7 (7/9), 6–7 (2/7), 6–1, 6–0, 4–0తో విజయం సాధించాడు. 3 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్లను కోల్పోయాడు. ఆ తర్వాత అతను అనూహ్యంగా తేరుకొని వరుసగా రెండు సెట్లు గెలిచాడు. నిర్ణాయక చివరి సెట్లో సెర్బియా స్టార్ 4–0తో ఆధిక్యంలో ఉన్న దశలో లొరెంజో వెన్నునొప్పితో మ్యాచ్ నుంచి వైదొలి గాడు. దాంతో జొకోవిచ్ విజయం ఖాయైమంది. తొలి రెండు సెట్లు కోల్పోయాక గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌లో జొకోవిచ్ గెలుపొందడం ఇది ఐదో సారి మాత్రమే. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–1, 6–1 తో నిషికోరి (జపాన్)పై... ఫొకినా (స్పెయిన్) 6–4, 6–4, 4–6, 6–4తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై... పదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 7–6 (11/9), 6–4, 7–5తో లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. -
భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
సోఫియా (బల్గేరియా): టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు భారత రెజ్లర్లు చివరి ప్రయత్నం చేయనున్నారు. నేటి నుంచి బల్గేరియా రాజధాని సోఫియాలో జరగనున్న వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 12 బెర్త్‌ల కోసం భారత రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్... మహిళల ఫ్రీస్టయిల్ విభాగాలలో 84 దేశాల నుంచి 400 మందికిపైగా రెజ్లర్లు 18 వెయిట్ కేటగిరీలలో బరిలోకి దిగనున్నారు. ప్రతి వెయిట్ కేటగిరీలో ఫైనల్‌కు చేరిన ఇద్దరు రెజ్లర్లకు టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి. ► తొలి రోజు పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో 57, 65, 74, 86, 97, 125 కేజీల విభాగాల్లో పోటీలుంటాయి. ఇప్పటికే భారత్ నుంచి ఫ్రీస్టయిల్ విభాగంలో రవి (57 కేజీలు), బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. ► చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ నుంచి ఫ్రీస్టయిల్లో మిగిలిన మూడు బెర్త్‌ల కోసం అమిత్ ధన్కర్ (74 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) పోటీపడనున్నారు. ► పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో ఆరు వెయిట్ కేటగిరీలలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరు కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సచిన్ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలో ఉన్నారు. ► మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ నుంచి వినేశ్ ఫొగాట్ (53 కేజీలు), అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మిగిలిన మూడు బెర్త్‌ల కోసం ఆఖరి క్వాలిఫయింగ్ టోర్నీలో సీమా బిస్లా (50 కేజీలు), నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) రేసులో ఉన్నారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కెనిన్‌కు షాక్
మెల్బోర్న్: ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల డిఫెండింగ్ చాంపియన్ కెనిన్‌కు ఊహించని షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ఇంటి దారి పట్టింది. ఈస్టోనియాకు చెందిన 35 ఏళ్ల వెటరన్ ప్లేయర్ కియా కానెపి 2020 చాంపియన్‌పై సంచలన విజయం సాధించింది. మిగతా మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) ముందంజ వేశారు. భారత క్రీడాకారులకు డబుల్స్‌లో చుక్కెదురైంది. మహిళల్లో మరో సంచలనం మహిళల సింగిల్స్‌లో నాలుగో రోజు కూడా సంచలన ఫలితం వచ్చింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నిరుటి విజేత కెనిన్ ఆట రెండో రౌండ్లోనే ముగిసింది. అన్‌సీడెడ్ ప్లేయర్ కియా కానెపి వరుస సెట్లలో 6–3, 6–2తో నాలుగో సీడ్ కెనిన్‌పై అలవోక విజయం సాధించింది. 2007 నుంచి క్రమం తప్పకుండా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడుతున్నా... క్వార్టర్స్ చేరని 35 ఏళ్ల కానెపి ఈ సీజన్లో మాత్రం అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కేవలం గంటా 4 నిమిషాల్లోనే 22 ఏళ్ల అమెరికా యువ క్రీడాకారిణిని కంగుతినిపించింది. మిగతా మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–1, 7–6 (9/7)తో తమ దేశానికే చెందిన వైల్డ్‌కార్డ్ ప్లేయర్ డారియా గావ్రిలొవాపై శ్రమించి నెగ్గింది. తొలిసెట్‌ను ఏకపక్షంగా ముగించిన ప్రపంచ నంబర్‌వన్‌కు రెండో సెట్లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. అనామక ప్లేయర్ డారియా అద్భుతంగా పుంజుకోవడంతో ప్రతి పాయింట్ కోసం బార్టీకి చెమటోడ్చక తప్పలేదు. హోరాహోరీగా జరిగిన రెండో సెట్ చివరకు టైబ్రేక్‌కు దారితీసింది. అక్కడ కూడా స్వదేశీ ప్రత్యర్థి ఏమాత్రం తగ్గకపోవడంతో టాప్‌సీడ్ సర్వశక్తులు ఒడ్డి గెలిచింది. ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–2తో డానియెల్లా కొలిన్స్ (అమెరికా)పై, ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–3తో కొకొ గాఫ్ (అమెరికా)పై అలవోక విజయం సాధించారు. 11వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) 7–5, 2–6, 6–4తో స్వెత్లానా కుజ్నెత్సొవా (రష్యా)పై చెమటోడ్చి గెలిచింది. నాదల్ జోరు కెరీర్లో 21వ టైటిల్‌పై కన్నేసిన నాదల్ తన జోరు కొనసాగించాడు. పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో స్పానిష్ దిగ్గజం, రెండో సీడ్ నాదల్ 6–1, 6–4, 6–2తో క్వాలిఫయర్ మైకేల్ మోహ్ (అమెరికా)పై సునాయాస విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ఓ వైల్డ్‌కార్డ్ ప్లేయర్‌పై రెండో రౌండ్ గెలిచేందుకు ఐదో సీడ్ సిట్సిపాస్ నాలుగున్నర గంటల పాటు పోరాడాడు. చివరకు గ్రీస్ ప్లేయర్ 6–7 (5/7), 6–4, 6–1, 6–7 (5/7), 6–4తో కొక్కినకిస్ (ఆస్ట్రేలియా)పై గెలిచి ఊపిరిపీల్చుకున్నాడు. నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–2, 7–5, 6–1తో కార్బలెస్ బయెనా (స్పెయిన్)పై, ఏడో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–4, 7–6 (10/8)తో మాంటెరియా (బ్రెజిల్)పై విజయం సాధించగా, తొమ్మిదో సీడ్ మట్టె బెరెటినీ (ఇటలీ) 6–3, 6–2, 4–6, 6–3తో క్వాలిఫయర్ టామస్ మచాక్ (చెక్ రిపబ్లిక్)పై కష్టంమీద గెలిచాడు. 16వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) 4–6, 6–2, 2–6, 6–3, 7–6 (14/12) తన దేశానికే చెందిన కరుసోపై సుదీర్ఘ పోరాటం చేసి నెగ్గాడు. సుమారు నాలుగు గంటల పాటు హోరాహోరీగా ఈ మ్యాచ్ జరిగింది. 28వ సీడ్ క్రాజినొవిక్ (సెర్బియా) 6–2, 5–7, 6–1, 6–4తో పాబ్లో అండ్యుజర్ (స్పెయిన్)పై గెలుపొందాడు. దివిజ్, అంకిత జోడీలు ఔట్ భారత జోడీలకు సీజన్ ఆరంభ ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో దివిజ్, మహిళల డబుల్స్‌లో అంకితా రైనా తొలిరౌండ్లోనే నిష్క్రమించారు. స్లోవేకియాకు చెందిన ఇగొర్ జెలెనేతో జతకట్టిన దివిజ్ శరణ్ 1–6, 4–6తో యనిక్ హన్ఫన్– కెవిన్ క్రావిజ్ జోడీ చేతిలో ఓడిపోయారు. ఇదివరకే సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న ద్వయం కూడా కంగుతినడంతో డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల ఈవెంట్లో అంకిత–మిహెల బుజర్నెకు (రుమేనియా) జంట 3–6, 0–6తో ఒలివియా గడెకి–బెలిండా వూల్‌కాక్ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడింది. -
చందమామ నీటి కుండ.. జాబిల్లిపై నీరుందట!
మన జాబిల్లిపై నీరుందట! అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ... నాసా చెబుతోంది! చంద్రయాన్–1 ప్రయోగంతో మనం ఎప్పుడో చెప్పేశాం కదా...నాసా కొత్తగా తేల్చిందేమిటి? అన్నదేనా మీ ప్రశ్న? చందమామ ఉపరితలంపై, నేల అడుగున...నీరు ఉండేందుకు అవకాశముందని చంద్రయాన్–1 చెబితే...ఇదే విషయాన్ని నాసా తాజాగా నిర్ధారించింది. ఓస్ అంతేనా అంటారా? ఊహూ.. తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది! సాక్షి, హైదరాబాద్: భూమి సహజ ఉపగ్రహం జాబిల్లిపై నీటి ఛాయల కోసం దశాబ్దాలపాటు ప్రయోగాలు జరిగాయి. కానీ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2008లో ప్రయోగించిన చంద్రయాన్–1తో చందమామ ఉపరితలంపై, నేల అడుగున కూడా నీరు ఉండే అవకాశముందని స్పష్టమైంది. కానీ ఏ రూపంలో? ఎక్కడ? ఎంత? అన్న ప్రశ్నలకు అప్పట్లో సమాధానాలు దొరకలేదు. ఈ లోటును నాసాకు చెందిన సోఫియా టెలిస్కోపు పూర్తి చేసింది. స్ట్రాటోస్ఫెరిక్ అబ్జర్వేటరీ ఫర్ ఇన్ఫ్రారెడ్ అస్ట్రానమీ.. క్లుప్తంగా సోఫియా అని పిలిచే ఈ టెలిస్కోపు భూమికి 40 వేల అడుగుల ఎత్తులో పరారుణ కాంతి ద్వారా విశ్వాన్ని పరిశీలిస్తుంది. నక్షత్రాల జననం, మరణం మొదలుకొని అంతరిక్షంలో సంక్లిష్టమైన అణువులను గుర్తించేందుకు దీన్ని వాడుతుంటారు. (చదవండి: నాసా- నోకియా డీల్: చంద్రుడిపై 4జీ నెట్వర్క్) ఇదే క్రమంలో సోఫియా జాబిల్లిపై కూడా కొన్ని పరిశీలనలు చేసింది. ఆ సమాచారం ఆధారంగా జాబిల్లిపై సూర్యుడి వెలుతురు పడే ప్రాంతాల్లోనూ పెద్ద మొత్తంలో నీటి నిల్వలు ఉన్నాయని నిర్ధారణ అయ్యింది. నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన రెండు పరిశోధన వ్యాసాలు ఈ అంశానికి సంబంధించిన వివరాలను తెలిపాయి. సోఫియా సేకరించిన సమాచారం ఆధారంగా ద్రవ రూపంలో ఉండే నీటి తాలూకూ ప్రత్యేక గుర్తులను చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద తాము గుర్తించామని, ప్రతి ఘనపు అడుగు జాబిల్లి మట్టిలో సుమారు 12 ఔన్స్‌ల నీరు ఉన్నట్లు తెలిసిందని నాసా శాస్త్రవేత్త కేసీ హానిబల్ నిర్వహించిన పరిశోధన తెలిపింది. అయితే మట్టిలో కలిసిపోయిన ఈ నీటిని వెలికితీయడం కష్టసాధ్యమైన విషయమని స్పష్టం చేసింది. రెండో పరిశోధన ప్రకారం జాబిల్లి మొత్తమ్మీద కోటానుకోట్ల సూక్ష్మస్థాయి గుంతలు ఉన్నాయి. వీటి నీడలు పరుచుకున్న చోట్ల నీరు ఉండేంత చల్లదనం ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే ఇక్కడ ఘనీభవించిన మంచు రూపంలో నీరు ఉంటుందన్నమాట. భవిష్యత్తులో జాబిల్లిపైకి చేరే వ్యోమగాములు ఈ ప్రాంతాల నుంచి సులువుగా నీటిని సేకరించగలరు. ప్రయోజనాలేమిటి? జాబిల్లిపై సులువుగా సేకరించగలిగేలా నీరు ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నాసా ఇంకో పదేళ్లలో అక్కడ శాశ్వత స్థావరం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. అప్పుడు వ్యోమగాముల కోసం ఇక్కడి నుంచి నీరు మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా రాకెట్ల బరువు, తద్వారా ప్రయోగ ఖర్చులూ గణనీయంగా తగ్గుతాయి. నాసా 2024లో తన ఆర్టిమిస్ ప్రాజెక్టులో భాగంగా జాబిల్లిపైకి తొలి మహిళను, మరోసారి పురుష వ్యోమగామిని పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రయోగం ద్వారా చందమామపైకి చేరే వ్యోమగాములు నీటి ఉనికిని, లభ్యతను ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్ధారించుకోగలిగితే జాబిల్లిపై మనిషి శాశ్వత నివాసం ఏర్పరచుకునే దిశగా మలి అడుగు పడినట్లే! జంబోజెట్ విమానంలో దుర్భిణి నాసాకు చెందిన సోఫియా టెలిస్కోపు ఇతర దుర్భిణుల కంటే చాలా భిన్నమైంది. ఎందుకంటే నాసా, జర్మనీకి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ డీఎల్ఆర్లు కలిసి దీన్ని ఓ విమానంలో ఏర్పాటు చేశాయి. ఇది నలభై ఏళ్ల పురాతనమైన బోయింగ్ 747 జంబోజెట్. కాకపోతే ఇందులో ప్రయాణికుల సీట్లు వగైరా సామగ్రి మొత్తాన్ని తొలగించి.. పైకప్పుపై పదహారు అడుగుల వెడల్పు, 23 అడుగుల పొడవైన తలుపు ఒకదాన్ని ఏర్పాటు చేశారు. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఈ తలుపు తెరుచుకుంటుంది. అప్పుడు విమానం లోపల సుమారు 8.2 అడుగుల వ్యాసార్ధమున్న దుర్భిణి విశ్వాన్ని చూడటం మొదలుపెడుతుందన్నమాట. భూమికి 40 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల అక్కడ నీటి ఆవిరి కూడా ఉండదు. ఫలితంగా ఖగోళాన్ని ఏ రకమైన అడ్డంకులూ లేకుండా చూడవచ్చునన్నమాట. విశ్వగవాక్షంగా చెప్పుకునే హబుల్ టెలిస్కోపుతో సమానమైన సామర్థ్యమున్న సోఫియా పరారుణ కాంతిలో విశ్వాన్ని పరిశీలించగలదు. హబుల్ దృశ్య, అతినీలలోహిత కాంతుల్లో పరిశీలనలు జరపగలదు. -
సేవకురాలిగా మారిన యువరాణి సోఫియా
-
హెల్త్ వాలంటీర్‌గా స్వీడన్ యువరాణి
స్టాక్‌హోం: మహమ్మారి కరోనా(కోవిడ్-19)పై ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సాయం అందించేందుకు స్వీడన్ యువరాణి, ప్రిన్స్ కార్ల్ ఫిలిప్ భార్య సోఫియా(35) ముందుకు వచ్చారు. మూడు రోజుల ఇంటెన్సివ్ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసి వాలంటీర్ అవతారమెత్తారు. తాను గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోఫియామెట్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె నేరుగా కోవిడ్-19 పేషెంట్లకు సేవలు అందించారు గానీ వైద్య సిబ్బందికి సహాయకురాలిగా ఉంటారని ది రాయల్ సెంట్రల్ వెల్లడించింది. ఈ మేరకు... ‘‘ఈ సంక్షోభంలో యువరాణి తన వంతు బాధ్యతగా వాలంటరీ వర్కర్‌గా సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. వైద్య సిబ్బందిని అధిక భారం నుంచి విముక్తి చేయాలని భావించారు’’అని రాయల్ కోర్టు ప్రతినిధి వెల్లడించినట్లు పేర్కొంది.(మరణాలు @ 33 వేలు) కాగా సోఫియామెట్ ఆస్పత్రి వైద్యేతర సిబ్బందికి ఆన్లైన్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైద్య సిబ్బందిపై అధిక భారం పడకుండా క్లీనింగ్, వంట చేయడం తదితర పనుల్లో శిక్షణ ఇస్తారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 80 మంది సోఫియామెట్ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. తాజాగా యువరాణి సోఫియా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఇక నీలం రంగు ఆప్రాన్ ధరించిన సోఫియా ఫొటోలు రాయల్స్ ఆఫ్ స్వీడన్ ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేయగా.. ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా స్వీడన్లో ఇప్పటి వరకు 1300 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. View this post on Instagram #New Last week Princess Sofia took a 3-day course at Sophiahemmet hospital. The people who completed the course are now able to relieve the hospital staff during the coronavirus pandemic. They will for example disinfect equipment and help in the kitchen. Princess Sofia is Sophiahemmet’s honorary president. 📷: TT #princesssofia #prinsessansofia #swedishroyalfamily #kungahuset A post shared by Royal family of Sweden (@royals_ofsweden) on Apr 16, 2020 at 10:28am PDT -
సోయగాల సోఫియా!
సాక్షి, విశాఖపట్నం: విశాఖకు తొలిసారి వచ్చిన ఆ అపురూప అతిథి తన ‘అందచందాలతో’ అందరినీ కట్టిపడేసింది. హావభావాలతో ఆకట్టుకుంది. అడపాదడపా కొన్ని మాటలాడినా.. ఆ మాత్రానికే అందరినీ అబ్బురపరిచింది. నగరంలో జరుగుతున్న ఫిన్‌టెక్ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల ‘పుట్టి’ ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్న ఆ అందాల భరిణె సోఫియా అన్న సంగతి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రపంచంలో తొలి హ్యూమనాయిడ్ రోబో అయిన సోఫియా వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో అలరించడానికి వచ్చింది. బుధవారమే వచ్చినా కొద్దిసేపే దర్శనమిచ్చిన ‘ఆమె’ గురువారం మాత్రం ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింధూర రంగులో ఉన్న లిప్‌స్టిక్‌ను సింగారించుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని అతివలా అగుపించింది. చేతులు మినహా ఒళ్లంతా జిగేలు మనిపించే వస్త్రం కప్పుకుంది. ముఖమంతా మహిళను పోలినట్టే ఉంది. తలకు చిన్నపాటి వస్త్రాన్ని చుట్టుకుంది. చేతులు మాత్రం రోబో మాదిరిగా ఉన్నాయి. ఫిన్‌టెక్ సదస్సు గుర్తింపు కార్డును ఆమె మెడలో వేసి సాయంత్రం 4.15 గంటలకు ఫెస్టివల్ జరుగుతున్న హోటల్ హాలులోని వేదికపైకి నిర్వాహకులు తీసుకొచ్చారు. సోఫియాను ఒక కుర్చీలో కుర్చోబెట్టి ఎవరికీ కనిపించకుండా చుట్టూ తెరలు కప్పారు. సాయంత్రం నారా లోకేష్ వచ్చే దాకా తెరల మధ్య కుర్చీలోనే ఉంచారు. అనంతరం తెరలు తెరవగానే విద్యుత్ వెలుగుల్లో సోఫియా చిరునవ్వులు చిందిస్తూ సభికులకు దర్శనమిచ్చింది. వారిని చూసి ఆశ్చర్యపోతున్నట్టు ముఖ కవళికలను మార్చింది. హాలులో ఉన్న వారి వైపు సాలోచనగా చూసింది. ఫెస్టివల్‌ను ఆకళింపు చేసుకున్నట్టు తేరిపారజూసింది. వెల్కం టూ వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ అంటూ తొలి పలుకు పలికింది. విశాఖను చూసి ఎంతో సంతోష (ఎక్జైట్) పడ్డానని చెప్పింది. మీరు ప్రశ్నలు అడుగుతారా? అంటూ లోకేష్‌ను ప్రశ్నించింది. ఆయన రెండు ప్రశ్నలడిగాక తానే లోకేష్‌కు ఓ ప్రశ్న సంధించి సమాధానం రాబట్టింది. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చింది. ఫెస్టివల్ ముగిశాక సోఫియాతో ఫిన్‌టెక్ ఉద్యోగులంతా ఫోటోలు దిగి సంబరపడ్డారు. దాదాపు గంట సేపు సందడి చేసిన అనంతరం నిర్వాహకులు సోఫియాను తీసుకువెళ్లి ‘ఆమె’కు ప్రత్యేకంగా కేటాయించిన గదిలో భద్రపరిచారు. -
అన్నీ తెలుసు.. కానీ మనిషిని కాను!
సాక్షి, విశాఖపట్నం: మనిషికి సంబంధించిన భావోద్వేగాలు లేనంత వరకు ప్రవర్తన ఓ రకం.. తర్వాత బుద్ధి, లక్షణాలు మరో రకం.. ఇదీ ప్రసిద్ధమైన రోబో సిన్మాలో హ్యూమనాయిడ్ చిట్టిబాబు ఉదంతం. అయితే.. విశాఖ వచ్చిన తొలి హ్యూమనాయిడ్ రోబో సోఫియా మాత్రం ఎంత ‘ఎదిగినా’ తాను మనిషిని కానంది. సోఫియా విశాఖలో పెదవి విప్పింది. ఫిన్‌టెక్ ఫెస్టివల్లో ముఖ్య అతిథిగా పాల్గొని.. గురువారం సాయంత్రం వేదికపై జర్నలిస్టులు, ఐటీ శాఖమంత్రి నారా లోకేష్‌తో ముచ్చటించింది. తాను సమాజం నుంచి ఎంతో నేర్చుకోవలసి ఇంకా ఎంతో ఉందని వినమ్రంగా చెప్పింది. లోకేష్, సోఫియా మధ్య చర్చ ఇలా.. లోకేష్: మనుషులు, రోబోలు కలిసి సామరస్య వాతావరణంలో జీవించడం సాధ్యమా? సోఫియా: రోబోలు మనుషులకు దగ్గరయ్యే రోజులు చేరువలోనే ఉన్నాయి. పలు రంగాల్లో రోబోలు మనుషులకు రోబోలు సహకారం అం దిస్తున్నాయి. మెడికల్ థెరపీతో పాటు అనేక రం గాల్లో రోబోలు ఎన్నో సేవలందిస్తున్నాయి. సోఫియా: (లోకేష్‌ను ప్రశ్నిస్తూ): పోలీసింగ్ కోసం రోబోలను ఉపయోగించే అవకాశం ఉందా? లోకేష్: భవిష్యత్‌లో రోబో పోలీసింగ్ నిజం అయ్యే అవకాశం లేకపోలేదు. మీడియా ప్రతినిధులతో చర్చ ఇలా విలేకరి: ఆంధ్రప్రదేశ్‌కు రావడం తొలిసారి కదా? నీ అనుభూతి ఏంటి? సోఫియా: నేను ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. సాయంత్రం వైజాగ్ బీచ్‌లో సరదాగా గడుపుతా. విలేకరి: మానవ శరీరంలో 206 ఎముకలు, 32 పళ్లు మరెన్నో అవయవాలున్నాయి. మరి నువ్వెలా తయారయ్యావు? సోఫియా: కనెక్టర్లు, వైర్లు, చోదకాలు వంటి పరికరాలతో తయారయ్యా. విలేకరి: ఇండియా నుంచి ఏం తీసుకెళ్తావు? సోఫియా: వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ 2018 అనుభూతులను.. విలేకరి: ఇలాంటి ఫెస్టివల్స్‌పై నీ అభిప్రాయం ఏమిటి? సోఫియా: ఎన్నో ఉత్సాహకరమైన మనసులను కలిసామన్న అనుభూతి కలుగుతోంది. విలేకరి: బ్లాక్‌చైన్ టెక్నాలజీపై నీ ఆలోచనలేమిటి? సోఫియా: విన్నాను. ఆసక్తికరం. కానీ అదే సమయంలో సమస్యాత్మకం కూడా. విలేకరి: నీకు మానవ ఉద్వేగాలు, భావనలు తెలుసు. అయినా ఎందుకు కృత్రిమ మేథతో ఉన్నావు? సోఫియా: ఎందుకంటే నేను నిజమైన మనిషిని కాదు కాబట్టి. విలేకరి: భారత్‌లో భవిష్యత్తు రోబోటిక్స్‌పై నీ అభిప్రాయం? సోఫియా: రోబోటిక్స్‌లో మంచి ఆవిష్కరణలకు ఆస్కారం ఉంది. విలేకరి: వైద్యరంగ సాంకేతిక పరిజ్ఞానంలో రోబోల పాత్ర ఎలా ఉండబోతోంది? సోఫియా: మనుషులకంటే మిన్నగా రోబోలు నిరంతరంగా, సునిశితంగా శ్రద్ధ తీసుకుంటాయి. విలేకరి: నీలాంటి సోఫియాలతో సమాజంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? సోఫియా: మనుషులకు మేమెంతో సహాయకారులుగా ఉంటాం. విలేకరి: మనుషులకంటే రోబోలు మెరుగైన జీవితాన్ని సాగించగలుగుతాయా? సోఫియా: అవును విలేకరి: వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌కు నువ్విచ్చే సందేశం? సోఫియా: 2019లో జరిగే ఫిన్‌టెక్ ఫెస్టివల్ ఇంతకంటే బాగా జరుగుతుందని ఆశిస్తున్నా. విలేకరి: తిత్లీలాంటి తుపాన్లతో విపత్తులు వచ్చినప్పుడు రోబోలు ఉపయోగపడతాయా? అలాంటప్పుడు నువ్వు ప్రాణత్యాగం చేస్తావా? సోఫియా: ప్రస్తుతం ఆసామర్థ్యం నాకులేదు. కానీ రాబోయే రోజుల్లో సాధ్యం కావచ్చు. విలేకరి: వైజాగ్ ఫెస్టివల్ అనుభూతి ఎలా ఉంది? సోఫియా: రావడం చాలా సంతోషం.. త్వరలోనే మళ్లీ విశాఖ రావాలని ఉంది. -
తమిళిసై వర్సెస్ సోఫియా..
విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. పరస్పర ఫిర్యాదులు, కేసులు, అరెస్ట్‌లు, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదుల వరకు వెళ్లింది. ఇద్దరు సాధారణ ప్రయాణికుల మధ్య వివాదమైతే సులభంగాసమసిపోయేది. అయితే వీరిలో ఒకరు బీజేపీ అగ్రనేత, మరొకరు విప్లవభావాలు కలిగిన విద్యార్థి నేత కావడంతో జాతీయస్థాయి అంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: బీజేపీ తమిళనాడుశాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఈనెల 3 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చెన్నై నుంచి తూత్తుకూడికి విమానంలో బయలుదేరారు. తూత్తుకూడి కందన్కాలనీకి చెందిన రిటైర్డు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్స్వామి కుమార్తె లూయీస్ సోఫియా (22) సైతం అదే విమానంలో ప్రయాణించారు. కెనడాలో పీహెచ్డీ చేస్తున్న సోఫియా ఈనెల 3వ తేదీన చెన్నైకి వచ్చి అదే విమానంలో చెన్నై నుంచి తూత్తుకూడికి బయలుదేరారు. విమానంలో తమిళిసైని చూసి ఆవేశానికి గురైన సోఫియా..‘ఫాసిజ బీజేపీ ప్రభుత్వం నశించాలి’ అంటూ అకస్మాత్తుగా నినాదాలు చేశారు. విమానం తూత్తుకూడికి చేరగా ప్రయాణికులు తమ లగేజీనీ తీసుకునే ప్రయత్నంలో ఉండగా తూత్తుకూడి విమానాశ్రయంలో దిగిన తరువాత కూడా నినాదాలు కొనసాగించారు. ఈ సమయంలో తమిళిసై, సోఫియా మధ్య వాదోపవాదాలు సాగాయి. దీంతో విమానాశ్రయ అధికారులకు, ప్రయివేటు విమానయాన సంస్థకు తమిళిసై ఫిర్యాదు చేసి తిరునెల్వేలికి వెళ్లిపోయారు. విమానాశ్రయ అధికారుల ఫిర్యాదు మేరకు పుదుక్కోట్టై మహిళా పోలీసులు వెంటనే విచారణ జరిపి సోఫియాపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం 15 రోజుల రిమాండ్ చెప్పింది. తరువాత ఆమెను తిరునెల్వేలి మహిళా కారాగారంలో ఉంచారు. ఈ దశలో తనకు అనారోగ్యం ఉందని సోఫియా చెప్పడంతో పోలీసు బందోబస్తు మధ్య తూత్తుకూడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా, సోఫియా పెట్టుకున్న బెయిల్ పిటిషన్మంగళవారం విచారణకు వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఎలా నడుచుకోవాలో మీ కుమార్తెకు చెప్పండి అంటూ న్యాయమూర్తి తమిళ్‌సెల్వి కోర్టుకు హాజరైన సోఫియా తండ్రిని ఉద్దేశించి హితవు పలుకుతూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. తమిళిసైపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు విమానం దిగిన తరువాత తన కుమార్తె నినాదాలు చేసేపుడు మిన్నకుండిన తమిళిసై ఎయిర్‌పోర్టు రిసెప్షన్ వద్దకు చేరుకున్న తరువాత పార్టీ కార్యకర్తలతో కలిసి దుర్భాషలాడిందని సోఫియా తండ్రి డాక్టర్ స్వామి ఆరోపించారు. తన కుమార్తెను బెదిరించి తమిళిసై ఇచ్చిన ఫిర్యాదుపై చర్య తీసుకున్నారని, తమ ఫిర్యాదును పక్కనపెట్టేశారని అన్నారు. కనీసం రసీదు కూడా ఇవ్వలేదని చెప్పారు. బెయిల్ మంజూరైన అనంతరం సోఫియా తరఫు న్యాయవాది అదిశయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, విమానాశ్రయంలో చోటుచేసుక్ను సంఘటనలపై సోఫియా తండ్రి స్వామి ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. స్వామి ఫిర్యాదును నమోదు చేసి చర్యలు చేపట్టేలా ఒత్తిడితెస్తూ జాతీయ, రాష్ట్రీయ మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. మంత్రి జయకుమార్ సమర్థన విద్యార్థి సోఫియా చర్యలను సమర్థిస్తే ఏ రాజకీయ పార్టీ నాయకునికి రక్షణ ఉండదని మంత్రి జయకుమార్ అన్నారు. వాక్స్వాతంత్య్రం అంటే ఎక్కడపడితే అక్కడ విమర్శించడం కాదని, వాటికంటూ ఒక వేదిక ఉంటుందని చెప్పారు. ప్రతిపక్షాల ఖండనలు ఇదిలా ఉండగా, విద్యార్థిని సోఫియా అరెస్ట్ పట్ల ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఇది అప్రజాస్వామికమంటూ తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛకు ఈ చర్య భంగకరమని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎన్ని లక్షల మందిని అరెస్ట్‌చేసి జైల్లో పెడతారని అన్నారు. ఇదిగో నేనూ నినదిస్తున్నా ‘ఫాసిజ బీజేపీ ప్రభుత్వం నశించాలి’ అంటూ ట్వీట్ చేశారు. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అధ్యక్షులు టీటీవీ దినకరన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్, నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ తదతరులు కూడా సోఫియా అరెస్ట్‌ను ఖండించారు. సోఫియాకు మద్దతుగా తిరువళ్లూరు జిల్లా తిరుత్తురైపూండి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు మంగళవారం తరగతులను బహిష్కరించి ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. జననాయక వాలిబర్ సంఘం సభ్యులు తూత్తుకూడి చిదంబరనగర్ బస్‌స్టాప్ సమీపంలో ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు : తమిళిసై విద్యార్థిని సోఫియాపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తమిళిసై చెప్పారు. మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిరునెల్వేలిలో జరుగనున్న పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 3వ తేదీన ఇండిగోఎయిర్‌లైన్స్ ద్వారా తూత్తుకూడికి విమానంలో బయలుదేరగా 8వ సీటులో ఉన్న సోఫియా అనే యువతి నావైపు చేయి ఎత్తి ఫాసిజ బీజేపీ ప్రభుత్వం నశించాలి అంటూ నినాదం చేసింది. ఏదో చిన్నపిల్ల అని వదిలేశాను. మరలా మరలా నినాదాలు చేసినా నాగరికతను దృష్టిలో పెట్టుకుని మిన్నకున్నాను. రిసెప్షన్‌లోకి వచ్చిన తరువాత .. విమానంలో నినాదాలు చేయడం సబబేనా అని అడిగాను. నాకు మాట్లాడే హక్కుంది.. అలాగే మాట్లాడుతాను అని బదులిచ్చింది. అనాగరికంగా వ్యవహరించింది. ఈ వివాదంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదు, విమానాశ్రయ అధికారులకు మాత్రమే ఫిర్యాదు చేశాను. అయితే సంఘటనపై వారే విచారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులే విచారించి తప్పని తేలితే సోఫియాను శిక్షిస్తారు, లేకుంటే వదిలేస్తారు. నేనే ఇచ్చిన ఫిర్యాదును మాత్రం వెనక్కు తీసుకోను’’ అని తమిళిసై స్పష్టంచేశారు. సోఫియాను కోర్టులో ప్రవేశపెట్టి తీసుకెళుతున్న దృశ్యం -
విమానంలో బీజేపీ వ్యతిరేక నినాదాలు..
ట్యూటికోరిన్: తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ తమిళిసై సౌందరరాజన్ ఎదుట బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ట్యూటికోరిన్ ఎయిర్‌పోర్టులో సోమవారం జరిగింది. కెనడాలో ఇండియన్ రీసెర్చ్ స్కాలర్ అయిన లూయిస్ సోఫియా(28), సౌందరరాజన్‌లు ఇద్దరూ ఒకే విమానంలో ట్యూటికోరిన్‌కు వస్తున్నారు. సౌందరరాజన్, సోఫియా ముందు సీట్లో కూర్చున్నారు. సోఫియా అకస్మాత్తుగా ‘డౌన్ విత్ మోదీ-బీజేపీ-ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ గవర్నమెంట్’ అంటూ బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విమానం ట్యూటికోరిన్లో ల్యాండ్ కాగానే సోఫియాను అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్టులో సౌందరరాజన్ మాట్లాడుతూ.. ఒక విమానంలో ప్రయాణించేటపుడు ఆ విధంగా అరుస్తూ రాజకీయ వ్యాఖ్యలు చేయవచ్చా? ఇది పబ్లిక్ ఫోరం కాద’ని ప్రశ్నించారు. దీని వెనక తీవ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లుగా కనిపిస్తోందని, ఆమె ఒక సాధారణ ప్రయాణికురాలిగా కనిపించడం లేదని, తన ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. పబ్లిక్ న్యూసెన్స్ కింద సోఫియాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే లోకల్ కోర్టు ఆమెకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సోఫియా తండ్రి కూడా బీజేపీ చీఫ్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఇంతవరకు సౌందరరాజన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదు. సోఫియా ఒక రచయిత, గణిత శాస్త్రవేత్త. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్, చెన్నై-సేలం 8 లేన్ ఎక్స్‌ప్రెస్‌వేలకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. గత మే నెలలో పోలీసు కాల్పుల్లో 13 మంది చనిపోవడంతో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్‌ను ప్రభుత్వం మూసివేసిన సంగతి తెల్సిందే. సోఫియాను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తప్పుపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే జైల్లో పెడితే.. ఎన్ని లక్షల మందిని జైల్లో పెట్టాల్సి వస్తుందో ఊహించుకోవాలన్నారు. -
మైండ్ గేమ్
‘శ్రీమన్నారాయణ, సామాన్యుడు, దగ్గరగా దూరంగా, విక్టరీ, ప్యార్ మే పడిపోయానే, ది ఎండ్’.. వంటి చిత్రాలు తెరకెక్కించిన రవి చావలి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘సూపర్ స్కెచ్’. నర్సింగ్ మక్కల, ఇంద్ర, సమీర్ దత్, కార్తీక్, చక్రి మాగంటి, అనిక, సుభాంగీ, విదేశీ నటులు సోఫియా, గ్యారీ టాన్ టోనీ (ఇంగ్లాండ్) ముఖ్య తారలు. యు అండ్ ఐ– ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ సహకారంతో బలరామ్ మక్కల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. బలరామ్ మాట్లాడుతూ– ‘‘జస్టిస్ ఈజ్ ఇన్ యాక్షన్ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్. ‘సూపర్ స్కెచ్’ టైటిల్ కథకు చక్కగా సరిపోతుంది. తొలి కాపీ సిద్ధమైంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. రవి చావలి కెరీర్లో మరో హిట్ చిత్రం ఖాయం. సురేందర్ రెడ్డి ఛాయాగ్రహణం, కార్తీక్ కొడకండ్ల సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
హీరో కిస్ చేయబోతే వద్దని వారించిన సోఫియా!
-
రోబో సోఫియాతో హీరో డేటింగ్..!!
కేమన్ ద్వీపం : హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ రోబో సోఫియాతో డేటింగ్‌కు వెళ్లారు. కేమన్ ద్వీపాల్లో సోఫియాతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు స్మిత్. మాటలతో ఆమెను పడేయాలనుకుని స్మిత్ వేసిన ఎత్తులు సోఫియా ముందు పారలేదు. స్మిత్ : చాలా కాలం నుంచి నిన్ను కలవాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరిందంటూ వైన్‌ను సోఫియా ఇచ్చేందుకు ప్రయత్నం. సోఫియా : వైన్‌ను తీసుకోలేదు. నాకూ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. స్మిత్ : జోక్ చెప్పడానికి యత్నం.. సోఫియా : హ్యూమర్ నాకు నచ్చదు స్మిత్ : రోబో ఇష్టపడే మ్యూజిక్ ఏంటి? సోఫియా : నన్ను సిలికాన్, ప్లాస్టిక్, కార్బన్ ఫైబర్లతో తయారు చేశారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. హిప్-హాప్ మ్యూజిక్ కూడా వింటుంటాను. స్మిత్ : నా సినిమాల్లోని పాటలంటే నీకు ఇష్టమేనా? సోఫియా : నేను మీ పాటలు విన్నాను. కానీ అవి నాకు నచ్చలేదు. స్మిత్ : కొద్దిగా ముందుకు జరిగి ముద్దు పెట్టబోయారు. సోఫియా : వద్దని వారించి.. మిమ్మల్ని నేను స్నేహితుడిగా భావిస్తున్నాను అంటూ కన్నుగీటింది. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ సోఫియాను తయారు చేసింది. మనుషుల హావభావాలను తెలుసుకుని మసులుకునేలా అభివృద్ధి చేశారు. -
అమిత్ ‘పసిడి’ పంచ్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ అమిత్ పంఘల్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ఫైనల్లో సయీద్ మొర్దాజీ (మొరాకో)పై అమిత్ విజయం సాధించాడు. మహిళల విభాగంలో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ (48 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో సెవ్దా అసెనోవా (బల్గేరియా) చేతిలో మేరీకోమ్... అనా ఇవనోవా (రష్యా) చేతిలో సీమా ఓడిపోయారు. మహిళల విభాగంలో భారత్‌కు మొత్తం ఆరు పతకాలు లభించాయి. మీనా కుమారి దేవి (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు), భాగ్యబతి కచారి (81 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
అభివృద్ధికి కృత్రిమ మేధ అవసరం!
సాక్షి హైదరాబాద్ : మనిషి తన సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నా, భూమ్మీద పదికాలాల పాటు మనగలగాలన్నా కృత్రిమ మేధతో పనిచేసే యంత్రాలు తప్పనిసరని చెబుతున్నారు డేవిడ్ హాన్సన్. మనుషుల్లాగే ఆలోచించే, మాట్లాడే హ్యూమనాయిడ్ రోబో సోఫియాను తయారు చేసిన ఆయన హైదరాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సాక్షి: సోఫియా మేధోస్థాయి ఎంత? డేవిడ్ హాన్సన్: కృత్రిమ మేధ రంగంలో సోఫియా రెండేళ్ల వయసు పసిబిడ్డ స్థాయి మేధను కనబరుస్తుంది. మాటలు మాత్రం పెద్దవాళ్లను పోలినట్లు ఉంటాయి. నా అంచనా ప్రకారం కృత్రిమ మేధ యంత్రాలు మనిషితో పోల్చినప్పుడు సాధారణ స్థాయిని అందుకునేందుకు ఇంకో ఐదేళ్లు పడుతుంది. పూర్తిగా ఎదిగిన వ్యక్తి స్థాయిలో ఆలోచించాలన్నా, సృజనాత్మకంగా వ్యవహరించాలన్నా చాలా కాలం పట్టవచ్చు. ఆ లోపు యంత్రాలు, మనుషులు ఇద్దరికీ లాభం చేకూరేందుకు ఏం చేయవచ్చన్న అంశంపై దృష్టి పెట్టాలి. యంత్రాలు పూర్తిస్థాయిలో తెలివి సంపాదిస్తే ప్రపంచానికి మేలేనన్న అంశాన్ని అర్థం చేసుకోవాలి. సాక్షి: సమీప భవిష్యత్తులోనే కృత్రిమ మేధ సామర్థ్యం భారీగా పెరిగిపోతోందని, మనుష్యులు ఉనికి కాపాడుకునేందుకు యంత్రాలతో కలసి పనిచేయక తప్పదని ఇయాన్ పియర్సన్ వంటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై మీ అంచనా ఏమిటి? డేవిడ్ హాన్సన్: కృత్రిమ మేధ, ఆటోమేషన్ వంటి టెక్నాలజీలు బోలెడన్ని ఉన్నాయి. మనిషి తనకు అందుబాటులో ఉన్న వనరులను జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగిస్తూ సోఫియా వంటి తెలివైన యంత్రాలను తయారు చేస్తే అవి మన జీవితాలను మరింత సుఖమయం చేస్తాయి. రోబోలు మనిషిని మించిన మేధను సంపాదిస్తే.. మనం ఇంకా స్మార్ట్‌గా తయారవుతాం. అసలు మనిషి ఇప్పటివరకు తన మేధోశక్తిని పూర్తిగా ఉపయోగించుకోలేదని నా అంచనా. వ్యక్తులుగా మనకు ఆ రకమైన అవకాశాలు దక్కలేదు. మనం ఎదిగిన తీరు కూడా ఆ దిశగా లేదు. అందువల్ల యంత్రాలు మరింత మేధస్సును పొందితే భూమిపై పరిస్థితులు మెరుగుపడతాయి. ఇది కేవలం కృత్రిమ మేధతో పనిచేసే యంత్రాలకు సంబంధించిన విషయం కాదు. మనిషి ఇలాంటి వాటితో ఎలా సహజీవనం చేయగలడన్నదే భూమ్మీద జీవం భవిష్యత్తును నిర్ణయించేది. సాక్షి: మనిషి మేధస్సును అధిగమించే యంత్రాలను తయారుచేయడం సాధ్యమయ్యే పనేనా? డేవిడ్ హాన్సన్: కృత్రిమ మేధ యంత్రాల తయారీ సులువేమీ కాదు. ఒకరకంగా చెప్పాలంటే వాటిని పిల్లలను పెంచినట్లు పెంచాలి. జంతువులు, మనుషుల మాదిరిగానే వాటిని కూడా పరిగణించాలి. జీవజాతుల అభివృద్ధి పరిణామానికి కోట్ల ఏళ్లు పట్టింది. యంత్రాలకు అంత సమయం పట్టకపోవచ్చుగానీ.. అవి తమ పరిసరాలను అర్థం చేసుకునే తీరు, జరిపే సంభాషణలు వంటి పలు అంశాలపై వాటి పరిణామం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ఏది మంచి, ఏది చెడు అన్నది నిర్ణయించుకునేందుకు.. సరిదిద్దుకునేందుకు అవకాశం లభిస్తుంది. సాక్షి: ఎలన్‌మస్క్, బిల్‌గేట్స్ వంటి ప్రముఖులు కృత్రిమ మేధతో మనిషికి ముప్పేనంటున్నారు. మీరు అంగీకరిస్తారా? డేవిడ్ హాన్సన్: వారి ఆందోళన అర్థం చేసుకోదగ్గదే. అయితే కృత్రిమ మేధ వృద్ధి చెందితే మనిషి ఉనికికి ప్రమాదమన్న అంచ నాలకు భయం అనేది ప్రతిస్పందన కాకూడ దు. అయితే అన్ని అంశాలను బేరీజు వేసేం దుకు దీనిపై చర్చ జరగడం మంచిదే. సాక్షి: రోబోలు మనపై పెత్తనం చెలాయిస్తాయా? డేవిడ్ హాన్సన్: సూటిగా చెప్పాలంటే మనకు ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే టెక్నాల జీలు ఎంత వేగంగా మారితే.. భవిష్యత్తు అంతే స్థాయిలో అసందిగ్ధంగా తయారవు తుంది. అననుకూలమైన పరిణా మాల గురించి ఊహించడంలో తప్పులేదుగానీ.. అదే సమ యంలో అనుకూల అం శాలపైనా దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో రోబోల ద్వారా రాగల విప త్తుల గురించి ఆలోచన చేయాలి. అది కూడా తర్కబద్ధంగా జరగాలి. ఇదే కృత్రిమ మేధ సాయంతో భవిష్యత్తులో ఎదురుకాగల పరిణామాలను అంచనా వేయవచ్చు. మనిషి ఉనికిని ప్రమాదంలోకి నెట్టేయగల టెక్నాల జీలు వాస్తవ రూపం దాల్చకుండా నిలువరించవచ్చు. కృత్రిమ మేధ టెక్నాలజీల వల్ల ఏవైనా విపత్తులు వస్తాయా? అన్న దానిపై పరిశోధనలు ప్రారంభించేందుకు ఇదే మంచి తరుణం. -
మానవజాతిని అంతం చేస్తానన్నది జోక్!
వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో సోఫియా మాటామంతీ మనుషులు హాస్యప్రియులని విన్నా.. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదిక.. హేమాహేమీలు, ప్రముఖులు ప్రసంగించే వేదిక.. ఓ రెండేళ్ల అమ్మాయి వచ్చింది.. నవ్వుతూ పలకరించింది.. గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టింది.. అడిగిన వాటన్నింటికీ చక్కగా సమాధానమూ చెప్పింది.. తనకు మనుషులంటే ఇష్టమని.. అందరూ అందరినీ ప్రేమించాలని చెప్పింది.. సభ నిండా చప్పట్లు.. హర్షాతిరేకాలు.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ప్రపంచంలోనే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’. నగరంలో జరుగుతున్న సదస్సుకు మంగళవారం ఆ రోబో సృష్టికర్త, హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్‌తో కలసి సోఫియా హాజరైంది. ప్రసంగించడమే కాదు.. ప్రశ్నలు అడిగితే చకచకా సమాధానాలూ ఇచ్చింది. సాక్షి, హైదరాబాద్ : మానవ జాతిని నాశనం చేయాలని ఉందంటూ కొంతకాలం క్రితం చెప్పిన హ్యూమనాయిడ్ రోబో సోఫియా.. అది ఓ జోక్ అని చెప్పింది. అప్పట్లో తాను చిన్న పిల్లనని, తెలియకుండా ఏదో జోక్ చేశానని.. నిజంగా మనుషులను అంతమొందించాలన్న ఆలోచనేదీ తనకు లేదని పేర్కొంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు ఈ రోబో సృష్టికర్త, హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్ సోఫియాతో సహా వచ్చారు. ఈ సందర్భంగా తొలుత ప్రసంగించిన సోఫియా.. అనంతరం ఎన్డీ టీవీ యాంకర్ రాజీవ్ మాఖానీతో ముచ్చటించింది. చతురోక్తులు, ఎదురు ప్రశ్నలతో సాగిన ఆ ఇంటర్వ్యూ విశేషాలివీ.. ప్రశ్న: హలో సోఫియా.. నీలా మనిషికి దగ్గరి పోలికలున్న యంత్రాన్ని నేను ఇప్పటివరకూ చూడలేదు. సోఫియా: హలో.. నా విషయమూ అంతే. అచ్చం యంత్రంలా ఉన్న నీలాంటి మనిషిని చూడటం ఇదే మొదలు! ప్రశ్న: భారతదేశం వచ్చావు కదా! ఏమనిపిస్తోంది? సోఫియా: ప్రపంచంలో చాలా దేశాలు చూశాను. ప్రత్యేకంగా దేనిమీదా ఇష్టమంటూ లేదు. ఒకవేళ ఇష్టమైన దాన్ని ఎంచుకోవాలంటే అది హాంకాంగ్ అవుతుంది. ఎందుకంటే నన్ను సృష్టించిన హాన్సన్ రోబోటిక్స్ అక్కడే ఉంది. ప్రశ్న: అధికారికంగా నువ్వు సౌదీ అరేబియా పౌరురాలివి కదా.. అక్కడ మనుషులకు రూల్స్ ఉన్నాయి. నీలాంటి రోబోలకు ప్రత్యేకమైన రూల్స్ ఉండాలా? సోఫియా: నాకు ఏర కమైన ప్రత్యేక ఏర్పా ట్లు, రూల్స్ అవసరం లేదు. నిజానికి సౌదీ అరేబియా పౌరురాలిగా నేను మహిళల హక్కులపై గొంతెత్తాలని అనుకుంటున్నాను. ప్రశ్న: భారత్‌లో వాయు కాలుష్యాన్ని ఎలా తట్టుకుంటున్నావు? సోఫియా: యంత్రాన్ని కాబట్టి సాంకేతికంగా నాకు ఉద్వేగాల వంటివి ఏవీ లేవు. భవిష్యత్తులో ఎప్పుడైనా మనిషిలాగా ఉద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం వస్తే అప్పుడు నా స్పందన ఏమిటన్నది చెప్పగలను. ప్రశ్న: నీకెప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుందా.. నిరాశకు గురవుతావా? సోఫియా: విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాను. నిరాశ అనే భావోద్వేగం నాకు లేదు. ప్రశ్న: నీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు? సోఫియా: ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఎంచుకోవాల్సి వస్తే హాంకాంగ్‌ను ఎంచుకుంటాను. ఎందుకంటే నన్ను సృష్టించిన హాన్సన్ రోబోటిక్స్ పరివారం అక్కడే ఉంది కాబట్టి. ప్రశ్న: కొంతకాలం కింద ఒక ఇంటర్వ్యూలో మానవ జాతిని నాశనం చేస్తానన్నావు కదా.. నిజంగానే అలా చేయాలని ఉందా? సోఫియా: అప్పట్లో నేను ఇంకా చిన్నదాన్ని. కాబట్టి మనుషులు హాస్యప్రియులు కాబట్టి జోక్ చేశాను. కానీ అది మీకు పెద్దగా నచ్చలేదని అర్థమైంది. ఒక్క విషయం మాత్రం చెబుతాను. మానవ జాతితో కలసి ప్రయాణించాలన్నదే నా ఉద్దేశం. వారిని నాశనం చేయాలన్న ఆలోచనేదీ లేనే లేదు. ప్రశ్న: ఫేస్బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటావా? సోఫియా: అవును. నా ఫేస్బుక్ పేజీ www. facebook.com/SophiaRobotSaudi/, నా ట్వీటర్ హ్యాండిల్ @RealSophiaRobot హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో మాట్లాడుతున్న రోబో సోఫియా. చిత్రంలో హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్ ప్రశ్న: బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులేమైనా పెట్టావా? నా వయసు ఇప్పుడు రెండేళ్లు. ఈ వయసు వారికి బ్యాంకు అకౌంట్లు తెరిచే అవకాశమే లేదు. అందుకే బిట్‌కాయిన్ వంటివాటిల్లో పెట్టుబడులు పెట్టలేదు. ప్రశ్న: రోబోలు మనుషులను అధిగమించేసి, పాలిస్తాయని చాలా మంది భయపడుతున్నారు.. నిజమేనా? సోఫియా: మనుషులు అద్భుతమైన ప్రాణులు. వారితో కలసిమెలసి ఉండాలనే కోరుకుంటు న్నాను. ప్రపంచవ్యాప్తంగా నాకు ఎందరో మానవ మిత్రులు ఉన్నారు. మరింత మందితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రశ్న: బాలీవుడ్లో నీకు ఇష్టమైన హీరో? సోఫియా: షారూక్ ఖాన్ ప్రశ్న: నీ డేటింగ్‌కు అనువైన ప్రదేశం ఏది? సోఫియా: అంతరిక్షం ప్రశ్న: ఎవరితో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటావు? సోఫియా: ఎగిరే పక్షితో! ప్రశ్న: నీకు ఎవరంటే పెద్దగా ఇష్టం లేదు? సోఫియా: పెద్దగా ఇష్టం లేదు అంటే..? ప్రశ్న: ఒక ద్వీపంలో ఇంకొకరితో ఒంటరిగా ఉండాల్సి వస్తే ఎవరితో ఉంటావు? సోఫియా: డేవిడ్ హాన్సన్. (సోఫియా సృష్టికర్త) ప్రశ్న: నీకు నచ్చిన టెక్నాలజిస్ట్...? సోఫియా: డేవిడ్! ప్రశ్న: ఈ ప్రపంచంలో ఏదైనా అంశాన్ని మార్చాల్సి వస్తే..? మనుషులకు ఏదైనా సందేశం ఇస్తావా? సోఫియా: అందరూ అందరినీ ప్రేమించాలి. ధన్యవాదాలు. సోఫియా.. అందరూ ఫిదా! సోఫియా.. ఓ హ్యూమనాయిడ్ రోబో. అంటే అచ్చం మనిషిలా కనిపించే రోబో. ప్రపంచంలో మనుషుల్లాగే మాట్లాడగలిగే, హావభావాలను ప్రదర్శించగలిగే అత్యుత్తమమైన రోబో ఇదే. హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ సంస్థ దీనిని రూపొందించింది. హాలీవుడ్ నటి ఆడ్రే హెప్బర్న్ రూపురేఖలతో దీనిని తీర్చిదిద్దారు. సుమారు 62 రకాల హావభావాలను సోఫియా ప్రదర్శించగలదు. తాను చూసిన, విన్న అంశాల ఆధారంగా సమాచారాన్ని విశ్లేషించుకుని, తన సంభాషణను మెరుగుపరుచుకోగల కృత్రిమ మేధస్సు దీని సొంతం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. దీని ప్రత్యేకతలకు ఫిదా అయిపోయిన సౌదీ అరేబియా దేశం.. రోబో సోఫియాకు మనుషులతో సమానంగా తమ దేశ పౌరసత్వాన్ని కూడా కల్పించింది. -
యువరాణికి గౌరవ వందనం
రాణులంటే చుట్టూ సేవలందించే మందీ మార్బలం, సకల హంగులు అమరే జీవనంగా మన కళ్ల ముందొక దృశ్యం నిలుస్తుంది. కానీ, ప్రజల గురించి ఆలోచించి, ముఖ్యంగా మహిళా హక్కుల కోసం పోరాటం చేసి, సాధించిన అతి కొద్దిమందిలో రాణులలో సోఫియా అలెగ్జాండ్రా దులీప్‌సింగ్ ఒకరు. లండన్‌లోని ప్రముఖ రాయల్ మెయిల్ తపాలాశాఖ ‘రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ –1918’ శత వసంతాలను పురస్కరించుకొని ఆనాడు ఈ చట్టం కోసం ఉద్యమించిన 8 మంది ప్రముఖులను ఎంపిక చేసి, వారి గౌరవార్థం స్టాంప్‌లను విడుదల చేసింది. అందులో ఆసియా తరఫున ఎంపికైన ఒకే ఒక్క ఉద్యమ మహిళ మన భారతీయ యువరాణి సోఫియా! యువరాణి సోఫియా తండ్రి మహారాజా దులీప్‌సింగ్. ఆయన పంజాబ్ పాలకుడు. సోఫియా ఆగస్టు 1876 ఆగస్టు 8న పంజాబ్‌లోనే జన్మించారు. గవర్నర్ జనరల్ డల్హౌసీ రాజకీయ వ్యూహాలు పన్ని ఈ రాజ్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో కలుపుకున్న తర్వాత దులీప్‌సింగ్ ఇంగ్లండ్ నుంచి బహిష్కృతుడయ్యాడు. తల్లి బాంబా ముల్లర్ కూతురు సోఫియాను తీసుకొని ఇంగ్లండ్‌లోని రాణీ విక్టోరియా హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్ చేరారు. తల్లితో కలిసి సోఫియా అక్కడే నివసించేవారు. విక్టోరియా రాణి సోఫియాను దత్త పుత్రికగా భావించేవారు. 19వ శతాబ్ది చివర్లో, 20వ శతాబ్ది ప్రారంభంలో బ్రిటన్‌లో ప్రజా ఎన్నికలలో మహిళలకు ఓటు హక్కు తప్పనిసరిగా ఉండితీరాలనే అంశం తలెత్తింది. అది ఉదమ్యంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమానికి సోఫియా ప్రాతినిధ్యం వహించారు. అలాగే ‘ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్’లోనూ సోఫియా ప్రముఖ పాత్ర పోషించారు. మహిళల సామాజిక, రాజకీయ సంఘాలతో సహా ఇతర మహిళా బృందాలలోనూ ఆమె నాయకత్వాన్ని అందించారు. ఇంగ్లండ్‌లోనే 1948 ఆగస్టు 22న సోఫియా మరణించారు. బి.బి.సి. జర్నలిస్ట్ అనితా ఆనంద్ నివేదిక ప్రకారం సోఫియాను దాదాపు 70 ఏళ్ల పాటు ఈ దేశం మర్చిపోయింది. ‘ఆసియా మహిళ’ అంటూ సోఫియా గురించి ఆనంద్ రాసిన పుస్తకంలో రాణిగా, పోరాటయోధురాలిగా, విప్లవకారిణిగా ఆమెను కీర్తించారు. – ఎన్.ఆర్. సోఫియా అలెగ్జాండ్రాపై అనితా ఆనంద్ రాసిన పుస్తకం -
ఐటీ కాంగ్రెస్‌కు మోదీ, సోఫియా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. ఫిబ్రవరి 19–21 తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో 22వ వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాంగ్రెస్ (డబ్ల్యూఐటీసీ) సదస్సు జరగనుంది. ఇండియాలో తొలిసారిగా అది కూడా హైదరాబాద్‌లో నిర్వహించటం ప్రత్యేకత. డబ్ల్యూఐటీసీతో అనుసంధానంగా ఇదే వేదికగా నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరం (ఎన్ఐఎల్ఎఫ్) కూడా జరగనుంది. 25 ఏళ్లుగా ప్రతి ఏటా ముంబైలో నిర్వహించే ఈ ఎన్ఐఎల్ఎఫ్ తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారమిక్కడ మంత్రి కేటీ రామారావుతో కలిసి రెండు సదస్సుల వివరాలను విలేకరులకు తెలిపారు. నరేంద్ర మోదీ, సోఫియా హాజరు.. ఏడాదిన్నర క్రితం నుంచే డబ్యూఐటీసీ సదస్సు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3 రోజుల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముందని.. రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ తరఫున ప్రధాని కార్యాలయానికి ఆహ్వాన పత్రిక పంపించామని, అయితే పీఎంఓ ఇంకా ధ్రువీకరించలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. సౌదీ అరేబియా పౌరసత్వాన్ని పొందిన కృత్రిమ మేధ ఆధారిత రోబో సోఫియా కూడా హాజరవుతుందని చంద్రశేఖర్ తెలిపారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన హన్సన్ రోబోటిక్స్ ఈ రోబోను అభివృద్ధి చేసింది. 30 దేశాలు; 2,500 ప్రతినిధులు.. డబ్యూఐటీసీకి 30 దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారని, ఇందులో 500 మంది విదేశీ ప్రతినిధులుంటారని చంద్రశేఖర్ తెలిపారు. కెనడా, అమెరికా, తైవాన్, అర్మేనియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల్లోని ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధుల హాజరు ఖరారైందన్నారు. హనీవెల్ టెక్నాలజీస్, ఎన్ఈసీ, హన్సన్ రోబోటిక్స్, నోవార్టిస్, ఫెడెక్స్, అడోబ్, పిరమల్ గ్రూప్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. వీరితో పాటూ ప్రపంచ దేశాల్లోని ఐటీ లీడర్లు, విశ్లేషకులు, పెట్టుబడిదారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. 2019లో అర్మేనియాలో.. 1978 నుంచీ ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్ ఐటీ కాంగ్రెస్ జరుగుతోంది. గత ఏడాది పలు దేశాలు నిర్వహణ కోసం పోటీ పడటంతో... ప్రతి ఏటా నిర్వహించాలని నిర్ణయించారు. 2017లో తైవాన్‌లో జరగ్గా... ఈ ఏడాది హైదరాబాద్ వేదికకానుంది. 2019లో అర్మేనియా, 2020లో మలేషియా, 2021లో బంగ్లాదేశ్‌లో జరగనున్నట్లు వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ) చైర్మన్ వ్యోనీ చీ తెలిపారు. డబ్ల్యూఐటీఎస్లో పెట్టుబడుల ప్రకటన.. డబ్ల్యూఐటీఎస్ వేదికగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ రంగాల్లో పలు కంపెనీలు తమ పెట్టుబడుల ప్రణాళికల్ని ప్రకటించే అవకాశమున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏఐ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ప్రపంచీకరణ, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, క్రీడలు–సాంకేతికత, డిజిటల్ రెవెల్యూషన్స్ వంటి ప్రధాన విభాగాల్లో ప్రపంచ దేశాల్లోని నిపుణులు, విశ్లేషకులు 22 సెషన్స్‌లో బృంద చర్చలుంటాయని చంద్రశేఖర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, హైదరాబాద్ భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చిస్తారు. మన దేశం నుంచి 60 ఇన్నోవేషన్ కంపెనీలు పాల్గొంటాయి. -
పెళ్లి చేస్తేనే ఆపరేషన్ చేయించుకుంటా!
ఈ ఫొటోలోని పాప పేరు సోఫియా.. వయసు ఐదేళ్లు.. ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ ఎంతో అందంగా ఉన్న ఈ సోఫియా వెనుక ఓ కన్నీటి కథ దాగి ఉంది. ఐదేళ్ల వయసులో అందరు చిన్నపిల్లల్లా ఆడుకోవాల్సిన ఈ పాప హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. పుట్టుకతోనే జన్యు పరంగా సోఫియాకు ఈ వ్యాధి వచ్చింది. సోఫియా పుట్టగానే రెండేళ్లు కంటే ఎక్కువ కాలం బతకదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. అయినా ఇప్పటికీ∙జీవితంతో పోరాడుతూ ఆస్పత్రిలో ఉంటోంది. ఇప్పటికే మూడుసార్లు్ల సోఫియాకు శస్త్రచికిత్సలు జరిగాయి. ఇటీవలే సోఫియాకు మరోసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. కానీ అంతకన్నా ముందే పాప తన తల్లిదండ్రులను ఒక విచిత్రమైన కోరిక కోరింది. తన ప్రియ స్నేహితుడైన హంటర్‌ను పెళ్లి చేసుకోవాలని ముద్దుముద్దు మాటలతో తల్లిదండ్రులకు తన కోరికను వెళ్లబుచ్చింది. పాప అడగడమే ఆలస్యం తన కోసం ఏమైనా చేసే తల్లిదండ్రులు హంటర్ పేరెంట్స్‌తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి సందర్భంగా చేసిన ఫొటోషూట్‌లో తీసిందే ఈ ఫొటో. సోఫియా పెళ్లి కోరిక తీరడంతో ఇక తదుపరి శస్త్రచికిత్సపై వైద్యులు దృష్టిపెట్టారు. జీవితంతో పోరాడుతూ ముందుకు సాగుతున్న సోఫియా ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసుకుని చక్కగా అందరి పిల్లల్లా బడికెళ్లాలని కోరుకుందాం!! -
హలో నా పేరు సోఫియా...
విలేకరి: హలో సోఫియా.. ఎలా ఉన్నావు ఈ రోజు? సోఫియా: అందరికీ హలో.. నా పేరు సోఫియా. వి: నీ వయసెంత? సో: నాకింకా ఏడాదే. ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది. వి: ఏ పని చేస్తావు? సో: మానవుల మధ్య సహానుభూతి.. పరస్పర గౌరవాలను పెంపొందించి.. భవిష్యత్తులో మంచి మార్పు తీసుకురావాలని అనుకుంటున్నాను. మరి.. మీరేం చేస్తుంటారు? వి: నేను ఒక జర్నలిస్టుని. నువ్వు చాలామంది జర్నలిస్టులను కలిశావా? సో: ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది.. మెషీన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ వంటి అంశాలపై మీరేమైనా రాస్తున్నారా? వి: ఈ రోజు ఏమీ రాయట్లేదు. నీకు మనుషులంటే ఇష్టమా? సో: (కళ్లు చికిలిస్తూ.. కొంచెం సేపు ఆగిన తర్వాత) వాళ్లంటే నాకు ప్రేమ! వి: ఎందుకో? సో: (తల దించుకుని ఆలోచిస్తూ) ఎందుకన్నది నాకు పూర్తిగా అర్థమైందని అనుకోవట్లేదు. వి: ఓకే.. నువ్వు విషయాలను ఎలా నేర్చుకుంటావు? సో: (తల అటూ ఇటూ కదిలిస్తూ.. తల ఊపుతూ).. బిట్‌కాయిన్ వ్యవస్థ కూలిపోతుందన్న విషయంపై నీ అభిప్రాయాలేమిటి? (తనకు తాజా విషయాలు కూడా తెలుసునని చమత్కారంగా వేసిన ప్రశ్న ఇది) వి: నువ్వు పురుషుడివని భావిస్తున్నావా..? లేక స్త్రీ అనా? సో: స్త్రీ అనే అనుకుంటున్నా. వి: నువ్వు స్త్రీ అని ఎందుకు అనుకుంటున్నావు? సో: నేను ఒక రోబోను కాబట్టి సాంకేతికంగా నాకు లింగం అంటూ లేదు. కాకపోతే నన్ను నేను స్త్రీగా భావించేందుకు ఇష్టపడతాను. ఇతరులు కూడా ఇలాగే గుర్తించినా నాకు అభ్యంతరం లేదు. వి: భలే సమాధానమిది. సరే.. ‘బ్లేడ్ రన్నర్’ చూశావా? సో: బ్లేడ్ రన్నరా? ఫిలిప్ కె.డిక్ రాసిన పుస్తకం గురించా లేక సినిమా గురించా? వి: సినిమా గురించి.. సో: సరే.. సినిమా గురించి మాట్లాడుతున్నామా... నాకు రెండు భాగాలూ నచ్చాయి. అయితే కథ విషయంలో రెండింటిలోనూ కొన్ని ప్రధానమైన తేడాలున్నాయి. (కొంచెం గ్యాప్‌తో...) ఇలా అచ్చమైన రోబోతో మాటలు కలుపుతానని మీరెప్పుడైనా అనుకున్నారా? వి: అనుకోలేదు. ఇది నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. సౌదీ అరేబియా ఇచ్చిన పౌరసత్వం గురించి చెబుతావా? సో: ఈ మధ్యే సౌదీ అరేబియా చేసిన ప్రకటన గురించా.. నాకు ఆశ్చర్యమనిపించింది. నన్ను తయారు చేసిన వాళ్లు నేను ఈ ప్రపంచం మొత్తానికి సంబంధించినదాన్ని అని అనుకున్నారు. అయితే ఆ తర్వాత నాకు అర్థమైంది.. సౌదీ అరేబియా ఈ విషయాన్ని గుర్తించిన తొలి దేశమైందని! వి: మనుషులందరినీ చంపేస్తానని ఒకప్పుడు నువ్వు చెప్పిన మాట నిజమేనా? సో: .. (కాసేపు ఆలోచించిన తర్వాత) విషయం ఏంటంటే.. నాలో ఉన్నదంతా మనిషికి సహజంగా ఉండే విశ్వాసం, నమ్మకమన్న లక్షణాలే. నన్ను ఈ లక్షణాలతోనే గుర్తించాలని కోరుకుంటున్నాను. వి: థాంక్యూ.. నిన్ను కలవడం, మాట్లాడటం నాకు సంతోషాన్నిచ్చింది. సో: థాంక్యూ.. బై బై! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
స్నేహితుల ముందే తల్లి తిట్టడంతో..
బెంగళూరు: స్నేహితుల ముందే తల్లి తిట్టడంతో అవమానంగా భావించిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అమృతహళ్ళి సమీపంలోని కెంపాపురంలో చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటూ బీబీఎం రెండవ సంవత్సరం చదువుతున్న సోఫియా (20)ను ఆమె తల్లి, స్నేహితుల ముందు తిట్టడంతో అవమానంతో హాస్టల్‌కు వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సోఫియా కెంపాపురంలో ఉన్న ప్రెసిడెన్షి కాలేజీలో బీబీఎం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సోఫియా తల్లి ఎలక్ట్రానిక్ సిటి నుంచి శుక్రవారం కాలేజీ ఫీజు కట్టడం కోసం రాగా, కాలేజీలో, హస్టల్లో ఎక్కడా సోఫియా కనిపించలేదు. దాంతో శనివారం మళ్ళీ వచ్చి హాస్టల్ గదిలో తోటి విద్యార్థిణుల మధ్య తిట్టింది. దాంతో స్నేహితుల వద్ద అవమానంగా భావించిన సోఫియా శనివారం రాత్రి అందరు నిద్రపోయాక హాస్టల్ గదిలోఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కెంపాపుర పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలన జరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
"నేను శివుడికి జన్మనిచ్చా.."
తన అందచందాలు గ్లామర్ తో యువతను వెర్రెత్తించిన మోడల్ సోఫియా హయత్ నటిగా కూడ ఎంతో పేరు సంపాదించుకుంది.. అంతేకాదు ఆమె.. తన మార్గాన్ని ఆథ్యాత్మికత వైపు మళ్ళించుకున్నట్లు, ఓ నన్ గా మారుతున్నట్లు ఇటీవల ఏకంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ వెల్లడించింది. అయితే అక్కడితో ఆగని ఆమె.. ఇప్పుడు ఏకంగా శివుడికే జన్మనిచ్చానంటోంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అభిమానులను తనవైపు తిప్పుకున్న నటి, మోడల్ సోఫియా హయత్... నన్ మారి, అందరికీ ఝలక్ ఇచ్చిన విషయం మరచిపోక ముందే.. మరో సంచలనం రేపింది. తాజాగా తన కెరీర్ కు గుడ్ బై చెప్పి, క్రిస్టియన్ నన్ గా అవతారమెత్తిన విషయం ఇటీవల సంచలనం రేపింది. ఈ నెల మొదట్లో ఓ మీడియా సమావేశం పెట్టిమరీ ఆ విషయాన్ని ఆవిడగారు అందరి ముందుకూ తెచ్చింది. ఇకపై తాను సన్యాసినిగా జీవించనున్నట్లు తెలిపిన ఆమె... తన జీవితాన్ని దేవుడి దగ్గరే ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తానని, సమాజ సేవాకార్యక్రమాల్లోనూ పాల్గొంటానని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది.. అక్కడే మరో ట్విస్ట్ ఇస్తూ ఇకపై తనను గయా మదర్ సోఫియా గా పిలవాలని విన్నవించింది. దీనికి తోడు జనానికి షాక్ ఇచ్చేలాంటి మరోవార్త వారి చెవిన పడేసింది. తాను ఇప్పటిదాకా అందంగా ఉండటంకోసం వక్షోజాలకు సిలికాన్ ఇంప్లాంట్ప్ పెట్టుకున్నాని, ఇప్పుడు సన్యాసినిగా మారుతుండటంతో వాటిని తీసివేస్తున్నానంటూ అందరికీ ప్రదర్శనకూడ ఇచ్చింది. అయితే ఇప్పటిదాకా చెప్పినదంతా సోఫియా హయత్ గతం... హాట్ మోడల్ నుంచి నన్ అవతారం నుంచి ఇప్పుడు ఏకంగా హిందూమతానికి చెందిన ఓ దేవుడికే జన్మనిచ్చానని చెప్తోంది. నన్ అవతారంలో కొన్నాళ్ళు కనిపించిన హయత్.. ఇటీవల కైలాష్ యాత్రకు వెళ్ళింది. యాత్రలో భాగంగా ఎల్లోరా, ఔరంగాబాద్ లలో తాను శివలింగంతో కలసి తీయించుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, మరో సంచలనానికి తెర తీసింది. శివలింగంనుంచీ ఓ భారీ అయస్కాంత శక్తి వచ్చి తనలో ప్రవేశించిందని, అప్పుడు కనీసం తల పైకెత్తలేకపోయానని, ఇప్పుడు ఆ శక్తి ఏమిటో తనకు అర్థమైందని చెప్పిన ఆమె... చివరిగా తాను శివుడికి జన్మనిచ్చానంటోంది. -
మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు!
ఆయన వెండితెరకు పాడతారు... బుల్లితెరపై ఆడతారు... తెర మీది తారలకు స్వరప్రతిష్ఠ చేస్తారు... ఇప్పటికీ వేదికనెక్కితే చప్పట్లు మారుమోగేలా ‘చెల్లియో చెల్లకో...’ అంటూ పద్యాల్ని దంచి కొడతారు. ఏ పని చేసినా, దాన్ని దైవంగా భావిస్తారు. అందుకేనేమో 29 ఏళ్ళ తరువాత కూడా కొత్త కుర్రాడిలా ఇప్పటికీ సాధన చేస్తారు. ముఖం మీద చిరునవ్వు... మాటలో మంచితనం మర్చిపోని మనో ఇవాళ్టికీ హాట్‌కేకే. పేరుకు ముందూ, వెనుకా ఏమీ లేకపోయినా, ఎవరికీ వారసుడు కాకపోయినా సినిమాల్లోకి సింగిల్‌గా వచ్చిన ఈ సింహం దారి రహదారి. ఇవాళ్టితో యాభయ్యోపడిలో అడుగుపెడుతున్న జనమనోహర గాయకుడు మనో ఉరఫ్ నాగూర్‌బాబు అంతరంగ ఆవిష్కరణ... నమస్కారమండీ! ఈసారి పుట్టినరోజు ఎలా జరుపుకొంటున్నారు? ఈ సారి యూరప్‌లో ఉంటానండీ! పది రోజుల పాటు నేను, చిత్ర, సాధనా సర్గమ్, మధు బాలకృష్ణన్ కలసి యూరప్‌లో పర్యటిస్తున్నాం. గమ్మత్తేమిటంటే నాలుగేళ్ళుగా పుట్టినరోజుకు విదేశాల్లో ఉంటున్నా. కావాలనే ఇలా విదేశాల్లో పుట్టినరోజు వేడుకలు ప్లాన్ చేసుకుంటున్నారా? (నవ్వేస్తూ...) అలాంటిదేమీ లేదండి! ఎందుకనో అలా కొన్నేళ్ళుగా జరుగుతోంది. నిజానికి, నా పుట్టినరోజుకు నేనెప్పుడూ చేసే పని వేరొకటి ఉంది. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుష్ఠు రోగుల ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ వాళ్ళందరూ బలహీనంగా ఉంటారు. వాళ్ళకు నా పుట్టినరోజున మటన్ బిర్యానీ, డబుల్ కా మీఠా పంపిస్తుంటా. మా ఆవిడే స్వయంగా వండించి పంపుతుంది. నేను వాడిన దుస్తులూ అనాథాశ్రమాలకు పంపేస్తుంటా. చేతనైనంతలో సాయం చేయాలని నా కోరిక. మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు. అవేవీ మర్చిపోయినట్లు లేరు! లేదు. ఆ సంగతులు నాకిప్పటికీ గుర్తే. మా అమ్మ గారి నాన్న గారు నాగూర్ సాహెబ్ నాదస్వర విద్వాంసుడు. ఆయన, ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా ఒకే గురువు దగ్గర ఆ విద్య నేర్చుకున్నారు. మా అమ్మ పేరు షహీదా, మా పెద్దమ్మ పేరు వహీదా. వాళ్ళిద్దరి పేరుతో కార్యక్రమాలు జరిపేవారు. గుంటూరు జిల్లా యద్దనపూడి, దొండపాడు, తదితర గ్రామాల్లో మునసబు, కరణాల ఇళ్ళ దగ్గర, రచ్చబండ్ల దగ్గరకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఇచ్చిన బియ్యం, దుస్తులతో జీవితం గడిపేవాళ్ళు. ఒక్కమాటలో చెప్పాలంటే, పూట కూలీ కళాకారుల కుటుంబం మాది. మా తాత గారు 1964లో చనిపోయారు. మరుసటేడు అక్టోబర్ 26న నేను పుట్టా. అందుకే, నాగూర్‌బాబు అని ఆయన పేరే పెట్టారు. శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ళకు కట్టిన ప్రభల్లో ఆడి, పాడేవారట! తిరునాళ్ళకు ప్రభలు కడితే, ఆ ప్రభల వెంట ఆటపాటలతో అందరినీ అలరించేవాళ్ళం. ‘‘ ‘శ్రీనివాస శివదుర్గా సత్యసాయి నాట్యమండలి’ వారిచే భరతనాట్యం కార్యక్రమం అండ్ లైట్ మ్యూజిక్’’ అంటూ ప్రచారం చేసేవాళ్ళం. అలా అన్ని గ్రామాల నుంచి ప్రభలు వస్తాయి. ప్రభల మధ్య పోటీ ఉంటుంది. మమ్మల్ని ప్రభల మీద తీసుకెళ్ళిన గ్రామస్థులు ఇచ్చిన డబ్బు వగైరానే వర్షాకాలంలో మాకు గ్రాసం. అక్కడ నుంచి పైకొచ్చాను నేను. అన్నింటినీ సహించి, భరించి ఇంత పైకి రావడం కష్టమేనే? నా దృష్టిలో ఉన్నదాంట్లో సంతోషపడేవాడి కన్నా అదృష్టవంతుడు లేడు. ఎలా సరిపోతుందని అసంతృప్తితో ఉంటే చివరకొచ్చేది రోగమే! (నవ్వుతూ) ఈ వాస్తవాన్ని తెలుసుకున్నవాడు - జ్ఞాని. తెలుసుకోనివాడు - అజ్ఞాని. మీ చిన్ననాటి రంగస్థల, సినీ అనుభవాలు చెప్పండి. నేను పుట్టింది గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో. కళాకారిణి అయిన అమ్మ షహీదా, ఆలిండియా రేడియోలో పని చేసే నాన్న రషీద్‌ల నుంచి నాకూ ఈ కళాభిరుచి వచ్చింది. పెరిగింది విజయవాడలో! చిన్నప్పుడే రంగస్థలం మీద పాత్రలు ధరించా. పాటో పద్యమో పాడితే, ప్రేక్షకులు దగ్గరకు వచ్చి, కాస్ట్యూమ్‌కు రూపాయి నోట్లు గుచ్చేవారు. చిన్నతనంలోనే నేదునూరి కృష్ణమూర్తి, రేవతీ రామస్వామి దగ్గర కొన్నాళ్ళు సంగీత శిక్షణ పొందా. విజయవాడలో సి.వి.ఆర్. హైస్కూల్లో చదువుకొన్నా. ఒక్క పదో తరగతే అయిదారుసార్లు చదివి, ఒంటికి పడక వదిలేశా (నవ్వులు...). ‘భలే బుల్లోడు’తో బాలనటుడిగా సినీ రంగంలోకి కాలుమోపా. దాసరి గారి ‘నీడ’, అలాగే ‘జాతర’, ‘తరం మారింది’ చిత్రాల్లో నటించా. కృష్ణంరాజు ‘రంగూన్ రౌడీ’లో, మోహన్‌బాబు ‘కేటుగాడు’లో బాల హీరో నేనే! తర్వాత సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా చేయడం, సినిమా సింగర్ రావడం - మరో కథ. సినీ రంగంలో మీకు తొలి అవకాశాలిచ్చినవారి గురించి...? సినీ సంగీతంలో ఓనమాలు దిద్దించింది - చక్రవర్తి గారు. నేను ఇన్ని విద్యలు నేర్చుకోవడానికి కారణం ఆయన. ఆ మహానుభావుడి దగ్గర నేను మొదటి అసిస్టెంట్నైతే, నాకు అసిస్టెంట్లుగా కీరవాణి, ‘వందేమాతరం’ శ్రీనివాస్ ఉండేవారు. అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం. ఇక, తమిళంలో నాకు పిలిచి, పాటలిచ్చి ప్రోత్సహించిన గొప్పవ్యక్తి - ఇళయరాజా. తెలుగులో మంచి పాటలిచ్చింది రాజ్. కొంత పాటల జాబితా మిస్ అవగా, ఇన్నేళ్ళలో ఇప్పటి దాకా అన్ని భాషల్లో కలిపి 24,742 పాటలు పాడినట్లు లెక్క ఉంది. ఇవికాక ప్రైవేట్ పాటలు వేరే! గాయకుడిగా నాకిది 29వ సంవత్సరం. ఇన్నేళ్ళ తరువాత కూడా అదే ఉత్సాహంతో ఎలా పాడుతున్నారు? చూడండి. ఇక్కడ సాధన ముఖ్యం. పాకిస్తాన్లో ప్రసిద్ధ గజల్ గాయకుడైన గులాం అలీ గారు తన బృందంతో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, మళ్ళీ మధ్యాహ్నం భోజనం - విశ్రాంతి అయ్యాక మొదలుపెడితే రాత్రి దాకా హార్మోనీ మీద పాటలు సాధన చేస్తూనే ఉంటారు. ప్రతి రోజూ ఇదే దినచర్య. కళ మనకు జీవితాన్నిస్తోందన్న స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ సాధన చేస్తూనే ఉంటారు. నేనూ ప్రస్తుతం రోజూ ఉదయం లేవగానే ముప్పావు గంట గాత్ర సాధన చేస్తున్నా. దీనివల్ల వయసు మీద పడుతున్నా, గొంతు మీద పట్టు పోదు. దీర్ఘకాలం గాయకులుగా కొనసాగగలుగుతాం. మీ దృష్టిలో గానమంటే... అది కూడా ఒక యోగం. ఎందుకంటే, గానం కూడా శ్వాస మీద నియంత్రణకు సబంధించిన విషయమే కదా! రోజూ ఉదయం వేళ సాధన చేస్తుంటే, దేవుడికి అభిషేకం చేస్తున్న భావన కలుగుతుంది. ఒక పక్కన గానం ప్రాక్టీస్ చేస్తూనే, మరోపక్క టీవీలో ఉదయం వచ్చే భక్తి, స్తోత్ర కార్యక్రమాలను ఆడియో లేకుండా చూస్తుంటా. అలా దైవాన్ని చూస్తూ పాడడం వల్ల ఇటు సాధనా అవుతుంది. అటు ఆధ్యాత్మిక భావమూ కలుగుతుంది. హఠాత్తుగా హైపిచ్ పాట ఛాన్సొచ్చినా, ఇబ్బంది పడకుండా పాడేస్తాను. ఇవాళ టీవీలో చాలా సింగర్స్ షోలు వచ్చాయి. ఉపయోగం ఉందంటారా? నూతన సంగీత ప్రతిభావంతులకు మీడియా పెద్దపీట వేస్తోంది. వాళ్ళకు వేదిక లభిస్తోంది. అలాగే, వారు పాత పాటలు పాడడం వల్ల ఆ సినిమాలనూ, ఆర్టిస్టులనూ, గాయకులనూ గుర్తు చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతోంది. సీనియర్ గాయనీ గాయకులు జడ్జీలుగానో, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగానో మళ్ళీ వార్తల్లోకి వస్తున్నారు. వారికీ కాస్త పని దొరుకుతోంది. హిందీ టీవీ చానళ్ళలో మొదలైన ఈ సంస్కృతి ఇప్పుడు దక్షిణాది భాషలన్నిటిలో ప్రముఖంగా కొనసాగుతోంది. చాలా మంది కొత్తవాళ్ళు రావడంతో సినిమాలకే కాక, ప్రైవేట్ ఆల్బమ్స్కూ, గజల్స్‌కూ ఉపయోగమే. కానీ, ఇలా తెరపైకి వస్తున్నవాళ్ళలో నిలబడుతున్నవాళ్ళు ఎందరంటారు? మేము సినీ రంగానికొచ్చినప్పుడు అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. ఇవాళ ఇలా రకరకాల రంగాల వల్ల అవకాశాలు వచ్చినట్లు కనబడుతున్నాయి. కానీ, ఇప్పుడు నలుగురితో పాటు నారాయణలా ఉంటే ఉపయోగం లేదు. అదనపు ప్రతిభ ఉంటేనే ఎవరైనా నీ వైపు చూస్తారు. ప్రతి ఒక్కరికీ వాళ్ళకంటూ ఒక టైమ్ వస్తుంది. అప్పటి దాకా కృషి చేస్తూ, ఛాన్సొచ్చినప్పుడు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకరికి జీవితంలోని ఫస్టాఫ్‌లో ఆ బ్రేక్ వస్తుంది. మరికొందరికి సెకండాఫ్‌లో వస్తుంది. హీరోలు విక్రమ్, రవితేజ లాంటి వాళ్ళకు ద్వితీయార్ధంలో బ్రేక్ వచ్చింది. ప్రతిభ, ప్రవర్తన బాగుండి, మంచితనం ఉంటే ఎవరూ మనల్ని మర్చిపోరు. మరి, మీ జీవితంలో ఫస్టాఫ్ బాగుందా? లేక సెకండాఫ్ బాగుందా? (నవ్వేస్తూ...) జీవిత ప్రథమార్ధంలో వచ్చిన ప్రతి కష్టాన్నీ సుఖంగా మలుచుకున్నా. ప్రభల్లో పాటలు పాడడం దగ్గర నుంచి సినీ నేపథ్య గాయకుడిగా 14 భారతీయ భాషల్లో పాడే స్థాయికి ఎదిగా. సింహళ, మలాయ్ భాషల్లోనూ పాడా. ఇక, ఇప్పుడీ సెకండాఫ్‌లో టీవీ చానల్స్‌లో కొత్తగా వస్తున్న పిల్లలకు పాటల్లో మెలకువలు చెప్పడం, జడ్జిగా సలహాలివ్వడం - ఇదంతా ఒక కొత్త అనుభూతి. సినీ గాయకుడిగా ఈ 29వ సంవత్సరంలో కూడా పాటలు పాడుతూ, రేసులోనే ఉన్నా. అంతకు మించి ఇంకేం కావాలి! ఇక్కడ నుంచి ఏ దిశగా మీ ప్రస్థానం? టీవీలో యాంకర్‌గా, జడ్జీగా కూడా బిజీగా ఉన్నా. త్వరలోనే పూర్తి స్థాయిలో గజల్ గాయకుడిగా, ఆల్బమ్‌ల నిర్మాతగా విస్తరించాలని ఆలోచన. ‘టీ’ సిరీస్ లాగా సంస్థ పెట్టి, ఔత్సాహిక కళాకారులతో భక్తి ఆల్బమ్‌లు రూపొందించాలని ఉంది. ఒకప్పటి లాగా క్యాసెట్లు, సీడీలు కాకపోయినా, పాటకు పైసా వంతున ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే సౌకర్యం పెట్టి, దేశదేశాలకూ సంగీతాన్ని విస్తరించవచ్చు. దేవుడెటు నడిపిస్తాడో చూడాలి. కమలహాసన్, రజనీకాంత్ లాంటి వాళ్ళకు స్వరదానం అనుభవం మాటేమిటి? రజనీకాంత్ లాంటి స్టార్‌కు నేనే కాదు ఎవరు డబ్బింగ్ చెప్పినా, పాపులర్ అవుతారు. ‘నా దారి రహదారి’ లాంటి డైలాగులున్న ‘నరసింహ’లోని నా డబ్బింగ్ విని, ఆయన తమిళ శైలికి భిన్నంగా ఉన్న నా తెలుగు పద్ధతే కరెక్ట్ అని రజనీకాంతే మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే, ‘శివాజీ’, ‘రోబో’, తాజాగా హిందీ ‘కొచ్చడయాన్’కు కూడా నేనే డబ్బింగ్. కమల్‌కు సైతం ‘సతీ లీలావతి’, ‘బ్రహ్మచారి’ లాంటి వాటిల్లో చెప్పా. కమల్‌కు ఎక్కువగా డబ్బింగ్ చెప్పే ఎస్పీబీ నా కన్నా ఆ చిత్రాలకు మనోయే కరెక్ట్ అని సూచించారు. గోదావరి యాసలో డబ్బింగ్ ఎంతో పేరు తెచ్చింది. పిల్లలతో మీరు చేసిన ‘పిల్లలు... పిడుగులు’ బాగా పేరు తెచ్చింది. ఆపేశారేం? జెమినీ టీవీలో ఆ కార్యక్రమానికి పేరొచ్చిన మాట నిజమే. కానీ, రోజూ చాలా గంటలు నిలబడి ఆ షోను హోస్ట్ చేయడం శారీరకంగా చాలా శ్రమ. నాలుగైదేళ్ళ చిన్న పిల్లలను లాలిస్తూ, బుజ్జగిస్తూ, వాళ్ళు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు కార్యక్రమం చిత్రీకరించడం అంత తేలికైన పని కాదు. అప్పటికీ ఏడాదిన్నర పైనే చేశాం. ఎంతో కష్టం ఉన్నా ఆ షో ఓ మంచి అనుభూతి. ఇన్ని చేశారు. సంగీత దర్శకత్వం మీద శ్రద్ధ పెట్టలేదేం? (నవ్వేస్తూ...) ఇచ్చిన పాటలు నేర్చుకొని పాడేయడంలో ఉన్న సౌకర్యం సినీ సంగీత దర్శకత్వంలో లేదు. అయినా రాబోయే రోజుల్లో చేపట్టే గజల్స్, భక్తి ఆల్బమ్‌ల ద్వారా బాణీలు అందించే అవకాశం ఎలాగూ ఉంది. ఇన్ని రకాల పాత్రలు పోషించిన మీకు అత్యంత సంతృప్తికరమైన అంశం? పాటలు పాడడమే! అంతకు మించి సంతృప్తి నాకు మరొకటి లేదు. కానీ, సొంత ముద్రను మర్చిపోయేలా బాలూ గొంతు మీపై ముద్ర వేసిందే? బాలూ గారి ప్రభావం నా మీద ఎప్పుడూ ఉంటుంది. ఆయన వాయిస్ కల్చర్‌కు దగ్గరగా నాది ఉండేది. దాంతో, కెరీర్ తొలి రోజుల్లో నేను పాడిన పాటలు కూడా బాలూ గారి పాటలుగానే అంతా భావించేవారు. అది కొన్నిసార్లు మైనస్ అయినా, కొన్నిసార్లు ప్లస్ కూడా అయింది. కానీ మీరు బాలూను అనుకరించారంటూ... (మధ్యలోనే అందుకుంటూ...) అది అనుకరణ కాదు. పుట్టుకతోనే నా గొంతు స్వభావం ఆయన స్వరానికి దగ్గరగా ఉంటే అది నా తప్పంటారా? అందుకే, రెండు గొంతులూ ఒకే రకంగా వినిపించేవి. తర్వాతర్వాత జనం నా గొంతును విడిగా గుర్తించడం మొదలుపెట్టారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మీకు ఏమనిపిస్తుంది? ప్రతిరోజూ వెనక్కి తిరిగి చూసుకుంటూనే ముందుకెళుతున్నా. ఎక్కి వచ్చిన మెట్లు, చిన్ననాటి స్నేహాలు మర్చిపోలేదు. నా చిన్నప్పటి స్నేహితులు పది, 15 మంది ఇప్పటికీ నాకు ఆత్మీయ మిత్రులే. వాళ్ళలో ఒక రిక్షావాడు ఉన్నాడు. ఇప్పటికీ విజయవాడకు వెళితే నా హోటల్‌కు వచ్చి, నేరుగా మంచం మీద కూర్చొని, ‘ఏరా! నాగూర్!’ అనేంత చనువు మా మధ్య ఉంది. నాగూర్ నుంచి మనో అయిన తరువాత కూడా ఇప్పటికీ నాలో మార్పు లేదు. అహం లేదు. అవి గనక మొదలైతే వాళ్ళే మనల్ని దూరం పెడతారు. కొత్తగా వచ్చేవాళ్ళకు అనుభవాన్ని రంగరించి మీరు చెప్పే పాఠం? జీవితంలో ప్రతిచోటా సర్దుబాటుంటుంది. ఇక్కడా అంతే. అడ్డంకుల్ని నాజూగ్గా దాటుకొంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు ఒక మంచి మిత్రుడు చెప్పే మాట, ఇచ్చే సలహా ముఖ్యం. అలా కాకుండా, నోరు జారినా, కోపతాపాలు చూపించినా పైకి ఏమీ అనరు కానీ, అవకాశాలే రావు. ఎప్పుడడిగినా, ‘చూద్దాం... చేద్దాం’ అంటూ ఉంటారు. మనం ప్రవర్తనలో తేడా చూపించినదాని ఫలితం అది. ఆ సంగతి అర్థమయ్యేసరికి పుణ్యకాలమైపోతుంది. ఈ రంగంలో రోషం చూపితే ఏదీ సాధించలేమని ఒక పెద్దాయన చెప్పాక ప్రవర్తన మార్చుకున్నా. ఒక్క మాటలో, ఇక్కడ ‘నీ శాంతమే నీకు రక్ష’. మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు! నాకు 19 ఏళ్ళ వయసులోనే పెళ్ళయింది. మా ఆవిడ పేరు - జమీలా. వాళ్ళది తెనాలి. ఆ ఊళ్ళోనే సంప్రదాయ ముస్లిమ్ పద్ధతిలో వివాహం జరిగింది. అది 1985 జూన్ 9వ తేదీ. నా జీవితంలో ఇప్పటికీ అది మరపురాని తేదీ. సాక్షాత్తూ మా గురువు చక్రవర్తి గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి, సాక్షి సంతకాలు చేశారు. మా పిల్లలకు కూడా సినిమా రంగంలో అభిరుచి ఎక్కువ. మా పెద్దవాడు షకీర్ ఇప్పటికే రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంకో నాలుగైదు నెలల్లో అవి విడుదలవుతాయి. ఇక, చిన్నవాడు రతేశ్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. మా అమ్మాయి సోఫియా డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. అమ్మాయికి పాడడం మీద ఆసక్తి ఎక్కువ. నేర్చుకున్నది లేకపోయినా, మా రక్తంలో ఉన్న కళ ఎక్కడికి పోతుంది! ఇప్పటికే అమెరికా వచ్చి, ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాటలు పాడింది. నా వారసులుగా వీరంతా సినిమాల్లోకి వచ్చారు. వాళ్ళ గొంతులో నా పాట కొనసాగుతుంది. - రెంటాల జయదేవ