సోఫియా: పశ్చిమ బల్గేరియాలోని హైవేపై నార్త్ మెసిడోనియన్ లైసెన్స్ ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 45 మంది మరణించారని అధికారులు తెలిపారు. అయితే బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు, కాలిన గాయాలతో ఏడుగురిని రాజధాని సోఫియాలోని ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక భద్రతా విభాగానికి చెందిన అంతర్గత మంత్రిత్వ శాఖ అధిపతి నికోలాయ్ నికోలోవ్ వెల్లడించారు.
(చదవండి: కుక్కని బుక్ చేసేందుకై...మరీ అలా చేయాలా!)
అంతేకాదు బస్సు బోల్తాపడటంతో అగ్నిప్రమాదం జరిగిందో లేదా అగ్నిప్రమాదం జరిగాక బొల్తాపడిందనేది ఇంకా స్పష్టం కాలేదని నికోలోవ్ చెప్పారు. అయితే ఈ ప్రమాదం తెల్లవారుఝామున సుమారు 2 గంటల ప్రాంతంతో జరిగిందని అన్నారు. పైగా బాధితుల్లో ఎక్కువ మంది నార్త్ మాసిడోనియాకు చెందిన వారేనని సోఫియాలోని నార్త్ మెసిడోనియా రాయబార కార్యాలయ అధికారి తెలిపారు.
(చదవండి: వామ్మో!! ఆరు టన్నుల లాంతర్ ఆవిష్కరణ!!)
Comments
Please login to add a commentAdd a comment